గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్‌ హీరో | Mithun Chakraborty Hospitalised In Kolkata | Sakshi
Sakshi News home page

గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్‌ హీరో

Published Sat, Feb 10 2024 11:35 AM | Last Updated on Sat, Feb 10 2024 12:24 PM

Mithun Chakraborty Hospitalised In Kolkata - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్‌' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్‌ చక్రవర్తి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు.

మిథున్‌ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్‌ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు.  'ది కశ్మీర్‌ ఫైల్స్' చిత్రంలో మిథున్​ మెప్పించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement