గూడూరు: మా అమ్మ మా అన్నదమ్ములిద్దర్నీ కష్టపడి పోస్టు గ్రాడ్యుయేట్ చదివించింది. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి మేము కూడా బాగా చదివి, మంచి మార్కులు సాధించాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. దీంతో మా అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 3వ తేదిన సీఎం మా గ్రామానికి సమీపంలో ఉన్న కనిగిరికి వచ్చారు. ఆయన్ను ఎలాగోలా కలవాలని, ఆయన ద్వారా వచ్చిన పింఛన్‌ను ఆయనకే తిరిగిచ్చేలా చూడాలని మా అమ్మ నన్ను అడిగారు.
దీంతో మా అమ్మ అమరావతికి రూ.50వేలు విరాళం ఇవ్వాలని చెప్పి ఎలాగోలా ఆయన వద్దకెళ్లి నీవిచ్చే పింఛన్ నాకొద్దు. నా ఇద్దరు కొడుకులు బాగా చదివినా ఉద్యోగాలు రాలేదు. అంటూ వచ్చిన పింఛన్‌కు వడ్డీతో కలిపి రూ.50వేలు ఇచ్చేశారు. కానీ పచ్చ మీడియా మాత్రం అది కవర్ కాకుండా చేసిందని ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగనన్న సీఎం అయితేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆయన సీఎం కావాలని తన గ్రామం నుంచి కాలినడకన తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి వస్తానని చెబుతున్నాడు ఆ యువకుడు జీకే బాషా.
ఎమ్మెస్సీ, ఎంఫిల్ చేసిన బాషా
ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలానికి చెందిన జీ మాలకొండయ్య, కొండమ్మలకు బాషా, కొండస్వామి అనే ఇద్దరు కుమారులున్నారు. మాలకొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కొండమ్మ అన్నీ తానే తన ఇద్దరు కుమారులను బాగా చదివించారు. బాషా ఎమ్మెస్సీ(ఐటీ), ఎంఫిల్ చేశారు. కొండస్వామి ఎంఏ, బీఈడీ చేశారు. వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో తన తల్లి కోరిక మేరకు కాలినడకన తిరుమలకు ఈ నెల 6వ తేదీన శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి బయలుదేరానని బాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment