Job Securtiy
-
టీఎస్ఆర్టీసీలో ఉద్యోగ భద్రత; ఫైలుపై సీఎం సంతకం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఎట్టకేలకు ఉద్యోగ భద్రత అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. 2019లో దీర్ఘకాలం పాటు జరిగిన సమ్మె అనంతరం ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఉద్యోగ భద్రతపై సీఎం హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు కొత్త మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అప్పటి నుంచి అది పెండింగులో ఉండటంతో కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైలుపై సీఎం సంతకం చేయటంతో అది త్వరలో అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపోమాపో విడుదల కానున్నాయి. చిన్న విషయాలకే సస్పెన్షన్.. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లపై చిన్న చిన్న అంశాలకే ఉద్యోగాలను తొలగించే కఠిన చర్యలు అమలవుతున్నాయి. టికెట్ల జారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, టికెట్ల రూపంలో వచ్చిన డబ్బులో పూర్తి మొత్తాన్ని డిపోలో డిపాజిట్ చేయకపోవటం, ప్రయాణికులతో దురుసుగా వ్యవహరించటం వంటివాటికే కండక్టర్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. టిమ్ యంత్రాలు వచ్చాక డ్రైవర్లు కూడా టికెట్లు జారీ చేస్తుండటంతో వారిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంటున్నారు. బస్సు నడపటంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలకు పాల్పడినా కూడా డ్రైవర్లపై చర్యలుంటున్నాయి. ఇప్పుడేం మార్చారు.. తప్పు చేసిన వెంటనే కఠినచర్య తీసుకోకుండా కొన్నిసార్లు అవకాశం ఇచ్చేలా తాజాగా మార్గదర్శకాలు రూపొందించారు. బస్సులో 100 శాతానికి మించి ప్రయాణికులున్నప్పుడు ఒకరిద్దరికి టికెట్లు జారీ చేయకపోతే వెంటనే చర్యలు తీసుకోరు. అలాగే డబ్బు కాస్త తగ్గినా వెంటనే చర్యలుండవు. రెండు, మూడుసార్లు అదే తప్పు చేస్తేనే సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇటీవల హైదరాబాద్‌లో ఓ మహిళా కండక్టర్ ప్రయాణికుడితో ‘తెలుగు రానప్పుడు తెలంగాణలో ఎందుకున్నావ్’అన్నందుకే సస్పెండ్ చేశారు. అదే సమయంలో వరంగల్‌లో లేని ఉద్యోగులు ఉన్నట్లుగా చూపి నిధులు స్వాహా చేసిన విషయంలో అధికారిపై చర్యకు మీనమేషాలు లెక్కించారు. ఆ అధికారికి సహకరించారన్న ఆరోపణ ఉన్న మరో ఉన్నతాధికారిని మాత్రం వదిలేశారు. విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో ఓ ఉన్నతాధికారి రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. టికెట్ డబ్బులు కలెక్ట్ చేయకపోవడం, టికెట్ ఇవ్వని సందర్భంలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కండక్టర్లకు మొదటి దఫా చర్యలు ఉండవు. ఇది పునరావృతం అయితే తొల గించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకన్నా పెద్ద బస్సు అయితే సీట్ల సంఖ్య కంటే ప్రయాణికులు తక్కువున్నప్పుడు ఈ తప్పుకు సస్పెన్షన్ చేస్తారు. రుసుము వసూలు చేసి టికెట్ ఇవ్వకుంటే డీలక్స్ కంటే తక్కువ కేటగిరీ బస్సుల్లో తొలగించకుండా ఇతర చర్యలు తీసుకుంటారు. డీలక్స్ అంతకంటే ఎక్కువ కేటగిరీ బస్సులు అయితే సస్పెన్షన్‌లో ఉంచుతారు. అవసరం అయితే తొలగిస్తారు. ఇలా మార్గదర్శకాల్లో పలు మార్పులు చేశారు. వేధింపులుండవు: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కార్మికులను కొందరు అధికారులు చిన్నచిన్న తప్పులకే వేధిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉద్యో గభద్రతకు అవకాశం కల్పించటం గొప్ప విషయం. వేధింపులు లేకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు చేపట్టింది. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవచ్చు. సంబంధిత ఫైలుపై సంతకం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వేధింపులు లేకుండా మాత్రమే ఉద్యోగ భద్రత, అలా అని తప్పులు చేసినా పట్టించుకోరని అనుకోవద్దు. -
రెండు నెలల పాటు నో ఎంట్రీ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలోకి కొన్ని రకాలైన వలసలను రానున్న 60 రోజులపాటు నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్ కారణంగా ఉద్యోగ భద్రత కోల్పోతున్న అమెరికన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడుట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలోకి ఉద్యోగాల కోసం రావాలనుకుంటున్న వారికే ఈ నిషేధ ఉత్తర్వులు వర్తిస్తాయని, ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారికి ఇవి వర్తించవన్నారు. అమెరికన్ల ఉద్యోగాల రక్షణ కోసం అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశానన్నారు. కరోనాతో దాదాపు 2 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని, వారికి మళ్లీ ఉపాధి కల్పించాల్సి∙ఉందన్నారు. వలసలకు విరామం ఇవ్వడం ద్వారా.. కరోనా ప్రభావం అంతమై, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక దేశంలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్లకే లభిస్తాయన్నారు. అమెరికన్లకు కాకుండా, కొత్తగా వచ్చిన విదేశీయులకు ఉద్యోగావకాశాలు కల్పించడం అన్యాయమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత నిషేధం తొలగించాలా? కొంతకాలం కొనసాగించడమా? అనేది నిర్ణయిస్తామని చెప్పారు. మినహాయింపులు ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పలు మినహాయింపులు ఉన్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తేదీ నాటికి అమెరికా వీసా, లేదా గ్రీన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆ తేదీ నాటికి విదేశాల్లో ఉన్న, ఎలాంటి ఇమిగ్రంట్ వీసా కానీ, లేదా వేరే ఏ అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్ కానీ లేనివారికే అవి వర్తిస్తాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు రావాలనుకుంటున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా రావాలనుకుంటున్నవారికి ఈ నిషేధం వర్తించదు. అమెరికన్ల జీవిత భాగస్వాములు, వారి 21 ఏళ్లలోపు పిల్లలు, అమెరికన్లు దత్తత తీసుకోవాలనుకునేవారు నిషేధ పరిధిలోకి రారు. అన్ని రకాల ఇమిగ్రంట్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించబోతున్నట్లు ఇటీవల ట్రంప్ చెప్పడం తెల్సిందే. ఐటీ నిపుణులు, వ్యవసాయ కార్మికుల అందుబాటుపై ఈ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక, రాజకీయ వర్గాలు విమర్శించాయి. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాన్ని.. ట్రంప్ ఇలా కప్పిపుచ్చుకుంటున్నారని డెమొక్రాట్లు విమర్శలు గుప్పించారు. భారత్ సమీక్ష వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికా జారీ చేసిన ఉత్తర్వులను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ ఉత్తర్వులు భారతీయులపై, భారత్–అమెరికాల మధ్య సంబంధాలపై చూపే ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొన్నాయి. -
బాబు ఉంటే జాబు రాదు
గూడూరు: మా అమ్మ మా అన్నదమ్ములిద్దర్నీ కష్టపడి పోస్టు గ్రాడ్యుయేట్ చదివించింది. ఆమె పడుతున్న కష్టాన్ని చూసి మేము కూడా బాగా చదివి, మంచి మార్కులు సాధించాం. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. దీంతో మా అమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 3వ తేదిన సీఎం మా గ్రామానికి సమీపంలో ఉన్న కనిగిరికి వచ్చారు. ఆయన్ను ఎలాగోలా కలవాలని, ఆయన ద్వారా వచ్చిన పింఛన్‌ను ఆయనకే తిరిగిచ్చేలా చూడాలని మా అమ్మ నన్ను అడిగారు. దీంతో మా అమ్మ అమరావతికి రూ.50వేలు విరాళం ఇవ్వాలని చెప్పి ఎలాగోలా ఆయన వద్దకెళ్లి నీవిచ్చే పింఛన్ నాకొద్దు. నా ఇద్దరు కొడుకులు బాగా చదివినా ఉద్యోగాలు రాలేదు. అంటూ వచ్చిన పింఛన్‌కు వడ్డీతో కలిపి రూ.50వేలు ఇచ్చేశారు. కానీ పచ్చ మీడియా మాత్రం అది కవర్ కాకుండా చేసిందని ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగనన్న సీఎం అయితేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆయన సీఎం కావాలని తన గ్రామం నుంచి కాలినడకన తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పించి వస్తానని చెబుతున్నాడు ఆ యువకుడు జీకే బాషా. ఎమ్మెస్సీ, ఎంఫిల్ చేసిన బాషా ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలానికి చెందిన జీ మాలకొండయ్య, కొండమ్మలకు బాషా, కొండస్వామి అనే ఇద్దరు కుమారులున్నారు. మాలకొండయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కొండమ్మ అన్నీ తానే తన ఇద్దరు కుమారులను బాగా చదివించారు. బాషా ఎమ్మెస్సీ(ఐటీ), ఎంఫిల్ చేశారు. కొండస్వామి ఎంఏ, బీఈడీ చేశారు. వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో తన తల్లి కోరిక మేరకు కాలినడకన తిరుమలకు ఈ నెల 6వ తేదీన శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి బయలుదేరానని బాషా తెలిపారు.