ఆత్మకూరు రోడ్‌షోలో అభివాదం చేస్తున్న మేకపాటి గౌతమ్‌రెడ్డి, పక్కన ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ఆత్మకూరు: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన అనంతరం ఏ ఒక్క హామీని అమలు చేయని చంద్రబాబును ఇక ఇంటికి పంపుదామని వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఆదివారం సాయంత్రం రోడ్‌షో నిర్వహించారు. బంగ్లా సెంటర్ నుంచి ప్రారంభమైన నాయకుల రోడ్‌షో ఎల్‌ఆర్‌పల్లి, బీఎస్సార్ సెంటర్, మున్సిపల్ బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా సాగుతూ సత్రం సెంటర్‌కు చేరుకుంది.
ఈ రోడ్ షోలో ఆద్యంతం మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ టీడీపీలో తనెన్నో అవమానాలు పొందానన్నారు. ఆ పార్టీ అధినాయకుడితో పాటు మిగిలిన నాయకుల గురించి తనకు బాగా తెలుసన్నారు. ప్రస్తుతం టీడీపీ తరపున పోటీ చేస్తున్న అసెంబ్లీ అభ్యర్థి సైతం వయసు మీరిన వ్యక్తేనని ఈ స్పీడు యుగంలో గౌతమ్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి లాంటి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకునేందుకు, ప్రత్యేక హోదా సాధించికునేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిగా తనతో పాటు గౌతమ్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
టీడీపీని బంగాళాఖాతంలో కలుపుదాం: ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి
ఇప్పటికే ఐదేళ్లు చంద్రబాబు అప్రజాస్వామిక పాలనను చూశామని, ఇక భరించటం కష్టమని ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కిన టీడీపీని బంగాళాఖాతంలో కలుపుదామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే మాట్లాడారు. అనుభవం ఉన్న చంద్రబాబు మేలు చేస్తాడని గత ఎన్నికల్లో ఆయనకు అవకావం ఇచ్చారన్నారు. అయితే జన్మభూమి కమిటీలు పేరుతో దోపిడీలు, రాజధానికి భూ సేకరణ పేరుతో మాగాణి భూముల దోపిడీ, అమరావతీ రాజధాని నిర్మాణంతో దోపిడీ, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో దోపిడీ ఇలా రాష్ట్రం దోపిడీల రాజ్యమైందని విమర్శించారు.
చంద్రబాబు పాలనలో కరువు కాటలతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రజలు కష్టాలు తీరాలంటే జగన్ మోహన్‌రెడ్డికి సీఎంగా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మెట్టుకూరు ధనంజయరెడ్డి, డాక్టర్ ఆదిశేషయ్య, అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, చల్లా రవికుమార్‌రెడ్డి, కొండా వెంకటేశ్వర్లు, నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, కౌన్సిలర్ స్వరూపారాణి, బాలఅంకయ్య, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment