నెల్లూరు(సెంట్రల్): తనపై అనవసరంగా నిందలు వేయాలనుకునే వారే దిగజారుడు తనం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక 46వ డివిజన్ బృందావనం, 45వ డివిజన్ రామ్మూర్తినగర్, శ్రీనివాస అగ్రహారం ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఏదో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనిల్‌కుమార్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఇటీవల ఏబీఎన్ చానల్లో తనపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. తనపై ఏబీఎన్ చానల్‌ను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయాలనుకున్న మంత్రి నారాయణ పన్నాగం ఫలించలేదన్నారు.
కాగా తాను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి చెడుగా మాట్లాడానని ఇటీవల ఒక చానల్‌లో తన ఫోన్ కాల్ వాయిస్ అంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి రాయలసీమకు చెందినవాడుగా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ విధంగా తనపై అసత్య ప్రచారాలు చేసి నిందలు వేయాలనుకునే వారే అడ్డంగా దొరుకుతున్నారన్నారు. గతంలో అసత్య ప్రచారాల వల్ల భార్యాభర్తలను విడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి నీచమైన పనులుచేయడం వల్లే గతంలో సూళ్లూరుపేటలో మంత్రి నారాయణను ఆయన సోదరుడు ఎందుకు కొట్టారో గుర్తుపెట్టుకోవాలన్నారు. అసత్య ప్రచారాలను సోషల్‌మీడియాలో పెట్టడం వంటి నీచమైన విషయాలను మానుకోవాలని హితవు పలికారు.
కార్యక్రమంలో డాక్టర్ కొండారెడ్డి, నాయకులు వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, శిరిగిరి చక్రవర్తి, వేలూరు రఘు, శివ, కృష్ణ, ముని, గంగపట్నం అశోక్‌ఘాటియా, శ్రీహరి, దేవిశెట్టి రాజగోపాల్, గూడూరు వాసుదేవరెడ్డి, కోట శ్రీనివాసులు, నాలి బాలయ్య, జువ్వల సూర్యనారాయణ, సుధాకర్, శ్రీదేవి, శ్రీకాంత్, అయ్యవారు స్వామి, శ్రీనివాసులు, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment