Anil Yadav
-
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
-
రాజ్యసభకు ఆ ముగ్గురూ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రక టించారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వారి లో కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, వద్ది రాజు రవిచంద్ర మంగళవారం రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. బుధవారం ధ్రువీకరణ పత్రం తీసుకుంటానని రేణుకా చౌదరి రిటర్నింగ్ అధికారికి సమాచారం ఇచ్చారు. భారీ ప్రదర్శనగా వచ్చిన అనిల్ యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేందుకు పార్టీ కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకున్నారు. అనిల్ వెంట ఆయన తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తదితరులున్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌ను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో పాటు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కడం తన విజయం కాదని, తెలంగాణ యువజన కాంగ్రెస్ విజయమని వ్యాఖ్యానించారు. ఒక బీసీ బిడ్డను పెద్దల సభకు పంపి కాంగ్రెస్ అధిష్టానం బీసీలందరికీ తగిన గౌరవం ఇచ్చిందని చెప్పారు. కేసీఆర్‌కు రుణపడి ఉంటానన్న వద్దిరాజు రాజ్యసభకు 2022లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తొలిసారిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర మరోమారు రాజ్యసభలో అడుగు పెడుతున్నారు. రెండోమారు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్ గుప్తాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. తనను రెండోసారి రాజ్యసభకు పంపిన పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై పార్లమెంటులో గొంతెత్తుతానని వద్దిరాజు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాగా, ఈ నెల 8న రాష్ట్రం కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా 15 వరకు నామినేషన్లు స్వీకరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్ ఒక స్థానం దక్కాయి. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం.. పరిశీలన, విత్‌డ్రా గడువు ముగియడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. -
నర్సరావుపేట ఎంపీగా అనిల్ యాదవ్ ను గెలిపించుకుందాం: అంబటి రాంబాబు
-
నిందలు వేయాలనుకునే వారే దొరికిపోతున్నారు
నెల్లూరు(సెంట్రల్): తనపై అనవసరంగా నిందలు వేయాలనుకునే వారే దిగజారుడు తనం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక 46వ డివిజన్ బృందావనం, 45వ డివిజన్ రామ్మూర్తినగర్, శ్రీనివాస అగ్రహారం ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఏదో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనిల్‌కుమార్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఇటీవల ఏబీఎన్ చానల్లో తనపై అసత్య ప్రచారాలు చేశారన్నారు. తనపై ఏబీఎన్ చానల్‌ను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేయాలనుకున్న మంత్రి నారాయణ పన్నాగం ఫలించలేదన్నారు. కాగా తాను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి చెడుగా మాట్లాడానని ఇటీవల ఒక చానల్లో తన ఫోన్ కాల్ వాయిస్ అంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి రాయలసీమకు చెందినవాడుగా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ విధంగా తనపై అసత్య ప్రచారాలు చేసి నిందలు వేయాలనుకునే వారే అడ్డంగా దొరుకుతున్నారన్నారు. గతంలో అసత్య ప్రచారాల వల్ల భార్యాభర్తలను విడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి నీచమైన పనులుచేయడం వల్లే గతంలో సూళ్లూరుపేటలో మంత్రి నారాయణను ఆయన సోదరుడు ఎందుకు కొట్టారో గుర్తుపెట్టుకోవాలన్నారు. అసత్య ప్రచారాలను సోషల్‌మీడియాలో పెట్టడం వంటి నీచమైన విషయాలను మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డాక్టర్ కొండారెడ్డి, నాయకులు వేలూరు మహేష్, దార్ల వెంకటేశ్వర్లు, శిరిగిరి చక్రవర్తి, వేలూరు రఘు, శివ, కృష్ణ, ముని, గంగపట్నం అశోక్ఘాటియా, శ్రీహరి, దేవిశెట్టి రాజగోపాల్, గూడూరు వాసుదేవరెడ్డి, కోట శ్రీనివాసులు, నాలి బాలయ్య, జువ్వల సూర్యనారాయణ, సుధాకర్, శ్రీదేవి, శ్రీకాంత్, అయ్యవారు స్వామి, శ్రీనివాసులు, కృష్ణ పాల్గొన్నారు. -
అంజన్నా..? అనిలన్నా..?
సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారులో గందరగోళం ఇద్దరిని ప్రకటించిన అధికారులు అయోమయానికి గురైన ప్రజలు సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో శుక్రవారం ఓ వి‘చిత్రం’ చోటుచేసుకుంది. ఎన్నికల అధికారులు సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇద్దరిని ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నదెవరో అర ్థం కాక నియోజకవర్గ ప్రజలంతా అయోమయంలో పడ్డారు. సిట్టింగ్ ఎంపీ అంజన్‌కుమార్, ఆయన తనయుడు అనిల్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగానే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) అనంతరం ఆమోదం పొందిన నామినేషన్ల జాబితాను రిటర్నింగ్ అధికారి వాలిట్ ప్రకటించారు. ఈ జాబితాలో ఒకే (కాంగ్రెస్) పార్టీ నుంచి వీరిరువురి పేర్లూ ఉండటం.. కొంత గందరగోళానికి తెర తీసింది. అధికారులు ఏమంటున్నారంటే.. జాతీయ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులెవరైనా.. వారితో పాటు డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు ఎన్నికల కమిషన్ వెసులుబాటు కల్పించింది. జాతీయ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థి నామినేషన్‌ను ఒక ఓటరు ప్రతిపాదించాల్సి ఉండగా, డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఆమోదం పొందాలంటే మాత్రం 10మంది ప్రతిపాదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోక్‌సభకు బీఎస్పీ తరపున ఇరువురు అభ్యర్థులు, సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే బీఎస్పీ అభ్యర్థుల్లో ఒకరి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. హైదరాబాద్ లోక్‌సభకు బీఎస్పీ డమ్మీ అభ్యర్థికి ప్రతిపాదకుడు ఒక్కరే ఉన్నందున ఆ నామినేషన్ స్క్రూట్నీలో తిరస్కరణకు గురైంది. సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కాగా, డమ్మీ అభ్యర్థిగా అనిల్‌కుమార్ యాదవ్ పేరును పార్టీ ఇచ్చిన బీ ఫారంలో పేర్కొన్నారు. డమ్మీ అభ్యర్థిగా ఉన్న అనిల్ నామినేషన్‌ను 10మంది ఓటర్లు ప్రతిపాదించినందున.. అంజన్‌కుమార్ నామినేషన్‌తో పాటు అనిల్‌కుమార్ నామినేషన్ కూడా స్క్రూట్నీలో ఆమోదం పొందింది. ఇలా ఆమోదం పొందిన నామినేషన్‌ను డమ్మీ అభ్యర్థి గడువులోగా ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఇండిపెండెంట్‌గా పరిగణిస్తారు. గుర్తుల కేటాయింపులో ప్రధాన అభ్యర్థికి పార్టీ గుర్తు, ఇండిపెండెంట్ అభ్యర్థికి వేరే గుర్తు కేటాయిస్తారు.