జైపూర్: దేశంలో మహిళలపై అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణం యావత్ దేశాన్ని తలదించుకునేలా చేసింది. అటు.. రాజస్థాన్‌లోని బిల్వారాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కలచివేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు.
మహిళలపై వేధింపులు, అత్యాచార, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నా, హిస్టరీ షీట్స్ నమోదైనా.. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఇకపై పోలీసు స్టేషన్‌లలో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిందితుల ప్రవర్తన పత్రాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు.
ఇటీవల రాజస్థాన్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. ఆగష్టు 2నే ఓ నాలుగేళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటనపై యావత్ రాష్ట్రం నివ్వెరబోయింది. ఇదే గాక ఇంతకు ముందే జోద్‌పూర్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ దారుణ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు చట్టాలను తీసుకువచ్చింది.
ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ..
Comments
Please login to add a commentAdd a comment