Bhopal BJP Leader Son An Accused In Sisters Sexually Abused Case, Details Inside - Sakshi
Sakshi News home page

MP Sisters Assaulted Case: అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపులు.. నిందితుల్లో బీజేపీ నాయకుని కుమారుడు..

Published Sun, Jul 16 2023 1:52 PM | Last Updated on Sun, Jul 16 2023 3:40 PM

BJP Leader Son An Accused In Sisters Sexually Abused Case - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. నలుగురు యువకులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితుల్లో బీజేపీకి చెందిన ఓ ఎమ‍్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దతియా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి రాగా.. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు స్థానిక పోలీసు స్టేషన్‌ వద్ద ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సొంత గడ్డపై ఈ ఘటన జరగడం గమనార్హం. 

బాధితుల్లో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. బాధితులు, నిందితులు విద్యార్థులని వెల్లడించారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

తన సోదరిని నలుగురు యువకులు ఎత్తుకుపోయారని మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తన సోదరిపై అత్యాచారం చేశారని పేర్కొంది. నిందితులు ఉన్నావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదీ చదవండి: ‘మీరు కాల్‌ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement