శంషాబాద్‌లోని ఇద్దరు ఇండస్‌ఇండ్ బ్యాంక్ మేనేజర్లు కూడా..
ఆదిత్యా బిర్లా హౌసింగ్ ఖాతా నుంచి రూ.40 కోట్లు బదిలీ
ఖాతాదారునికి తెలియకుండా అనధికారికంగా లావాదేవీలు
ముగ్గుర్ని అరెస్టు చేసిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఖాతాదారునికి తెలియకుండా రూ.40 కోట్లు కాజేసిన కేసులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లతో సహా కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బషీద్ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తరుఫున రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీ చేశాడని సైబరాబాద్ ఆరి్థక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు. కేసు పూర్తి వివరాలివీ..ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థకు ఖాతా ఉంది.
బ్యాంక్ అంతర్గత ఆడిట్‌లో భాగంగా జులై 12న ఈ ఖాతా నుంచి శంషాబాద్‌లోని ఇండస్‌ఇండ్ బ్యాంకుకు రూ.15 కోట్లు, రూ.25 కోట్లు చొప్పున రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో జోనల్ హెడ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ జోనల్ హెడ్ (ఆపరేషన్స్) మణికందన్ రామనాథన్ జులై 19న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బహుమతిగా ఫార్చ్యూనర్ కార్లు..
కొట్టేసిన సొమ్ముతో బషీద్ రెండు టయోటా ఫార చ్యనర్ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఒకటి బ్యాంక్ మేనేజర్ రామస్వామికి బహుమతిగా అందించాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో బషీద్ ఢిల్లీకి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులు రామస్వామి, రాజే‹Ùలను హైదరాబాద్‌లో, బషీద్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన ఏ–3 బషీద్‌పై గతంలో హైదరాబాద్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, బోయిన్‌పల్లి పీఎస్‌లతో పాటు సైబరాబాద్‌లోని నార్సింగి, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్ ఠాణాలలో పదికి పైగా చీటింగ్ కేసులున్నాయి. బషీద్ పలు సినిమాలను నిరి్మంచడంతో పాటు నటించాడు కూడా.
బ్యాంక్ మేనేజర్ల పనే..
శంషాబాద్‌లోని ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజర్ కనుగుల రామస్వామి, సర్వీస్ డెలివరీ మేనేజర్ సపాయి రాజేశ్ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు. ఆదిత్యా బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ఖాతాలో రూ.కోట్లలో జరుగుతున్న లావాదేవీలను గుర్తించిన ఇరువురు నిందితులు పక్కా పథకం వేశారు. జులై నెలలో జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి షేక్ బషీద్ పేరుతో బ్యాంక్ అకౌంట్‌ను తెరిచారు. ఈ ఖాతాకు ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ చెక్, ఆరీ్టజీఎస్ లేకుండా అనధికారికంగా రూ.40 కోట్ల నగదును బదిలీ చేశారు. క్షణాల్లోనే ఈ అకౌంట్ నుంచి జాతీయ, ప్రైవేట్ బ్యాంక్‌ల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని వేర్వేరు ఏటీఎంల నుంచి విత్ డ్రా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment