ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్‌ | House Of Rape Accused Teen Near Ujjain To Be Demolished | Sakshi
Sakshi News home page

ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్‌.. బుల్డోజర్‌కు పని

Oct 3 2023 12:05 PM | Updated on Oct 3 2023 12:27 PM

House Accused Of Raping Teen Near Ujjain To Be Demolished - Sakshi

భోపాల్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్‌ అత్యాచార కేసులో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్‌యాక్షన్‌కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. 

జరిగింది ఇదే.. 
మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్‌ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు.

ప్రధాన నిందితుడి అరెస్టు?
లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్‌ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్‌ భరత్‌ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. 

ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement