new notes
-
కింగ్ చార్లెస్-3 ఫొటోతో కొత్త కరెన్సీ నోట్లు.. ఫొటోలు వైరల్..
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం వీటి ముద్రణ జరుగుతోంది. 2024 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే చార్లెస్ ఫొటో ఉన్న కొత్త 5, 10, 20, 50 యూరో నోట్లు క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈయన ఫొటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. దాదాపు 70 ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్‌లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక పాత నోట్లు కూడా చెల్లుతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. రాణి ఫొటోలు ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని చెప్పింది. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
ఎస్బీఐ : కొత్త నోట్ల కోసం ఇంకా...
ఇండోర్: ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త కొత్త నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతూ వస్తోంది. 2000 రూపాయి నోటు నుంచి 500 రూపాయి నోట్లు, 200 రూపాయి నోట్లు, 50 రూపాయి నోట్లు, 20 రూపాయి నోట్లు, 10 రూపాయి నోట్లు ఇలా కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఈ కొత్త నోట్లను పాతనోట్లతో పోలిస్తే మరిన్ని భద్రతా పరమైన ఫీచర్లతో ప్రవేశపెడుతోంది. అయితే పాత నోట్లకు, కొత్త నోట్లకు సైజుల్లో మార్పులు ఉండటం వల్ల.. కొత్త నోట్లకు అనుకూలంగా బ్యాంక్‌లు ఏటీఎంలను మార్చాల్సి వస్తుంది. డిమానిటైజేషన్ పూర్తయి ఇప్పటికి 21 నెలల కావొస్తున్నా.. ఇంకా 18,315 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ కోరిన మేరకు ఆర్టీఐ డేటాలో ఎస్బీఐ ఈ విషయం తెలిపింది. ఏటీఎం రికాలిబ్రేషన్( ఏటీఎం పునరుద్ధరణ) ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని పేర్కొంది. కొత్త నోట్లు రూ.2000, రూ.500, రూ.200ను పంపిణీ చేయడానికి ఎన్ని ఏటీఎంలను రికాలిబ్రేట్ చేశారని చంద్రశేఖర్ ఎస్బీఐను ఆర్టీఐ ద్వారా కోరాడు. చంద్రశేఖరన్ ప్రశ్నకు ఆగస్టు 18న ఎస్బీఐ ఇచ్చిన సమాధానంలో... మొత్తం 59,521 ఏటీఎంలు ఉండగా, 41,386 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేసినట్టు పేర్కొంది. ఈ ప్రక్రియకు మొత్తం రూ.22.50 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. ఇంకా 18,135 ఏటీఎంలను రికాలిబ్రేట్ చేయాల్సి ఉందని, అవి ప్రస్తుతం కొత్త కరెన్సీ నోట్ల పంపిణీకి సిద్ధంగా లేవని చెప్పింది. కాగ, 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. -
రూ. 2 వేల నోట్లు మాయమవుతున్నాయ్..
షాజాపూర్: దేశవ్యాప్తంగా మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లు మాయమైపోతున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. ఇందులో కుట్రకోణం దాగుందని ఆరోపించారు. సోమవారం నాడిక్కడ జరిగిన ఓ రైతు సదస్సులో చౌహాన్ మాట్లాడుతూ.. ‘పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ.15 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండేది. నోట్ల రద్దు తర్వాత చలామణి రూ.16.50 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ రూ.2 వేల నోట్లు మాత్రం మార్కెట్ నుంచి మాయమైపోతున్నాయి’ అని వెల్లడించారు. మార్కెట్లో నగదు కొరతతో సమస్యల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని చౌహాన్ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
కొత్త నోట్లను గుర్తుపట్టడం కష్టంగా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నోట్లతో అంధులకు చాలా కష్టమవుతోంది. ఈ నోట్లన్నింటిన్నీ దాదాపు ఒకే విధమైన పరిమాణాలతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రవేశపెడుతుండటంతో, వారు గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందని తెలిసింది. పాత నోట్లలో పొడవు, వెడల్పుల్లో కనీసం 10ఎంఎం అయినా తేడా ఉండేంది. కానీ కొత్త నోట్లలో ఇది కేవలం 4ఎంఎం మాత్రమే ఉంది. దీంతో పాత రూ.20 నోటు,కొత్త రూ.200 నోట్లు ఒకే విధమైన పరిమాణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా చూపులేని వారు నోట్ల సైజును బట్టే వాటిని గుర్తిస్తుంటారు, అదే నిరక్షరాస్యులు వాటి రంగును బట్టి నోట్ల విలువను గుర్తిస్తారు. కానీ ఆర్బీఐ ప్రవేశపెడుతున్న కొత్త నోట్ల సైజులో పెద్దగా తేడా లేకపోవుతుండటంతో వారికి కష్టమవుతోంది. ''అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కరెన్సీ నోట్ల సైజుల్లో తేడా 5 ఎంఎం ఉండాలి. కానీ కొత్త కరెన్సీ రూ. 50, రూ.200 నోట్లలో తేడా కేవలం 4ఎంఎం మాత్రమే. త్వరలో కొత్తగా రాబోతున్న రూ.100 నోటు తేడా కేవలం 2 ఎంఎం అని మాత్రమే తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలైంది. 2017 అక్టోబర్30న ఈ విషయంపై మేము జోక్యం చేసుకుంటా'' అని అడ్వకేట్, సొలిసిటర్ కంచన్ పమ్మని చెప్పారు. బ్లైండ్ గ్రాడ్యుయేట్ల ఫోరమ్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో దీనిపై క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది. -
21, 51 రూపాయల కొత్త నోట్ల ఆలోచన లేదు
► రూ. 50 రూ. 100 నోట్లను రద్దు చేయాం ► ఆర్దిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ స్పష్టం న్యూఢిల్లీ: కొత్తగా 21 రూపాయలు, 51 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా తమ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. బీజేపీ ఎంపీ పరేశ్ రావెల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే రూ. 50, రూ.100 నోట్లను రద్దు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు. -
మార్కెట్లోకి వచ్చిన కొత్త నోట్లెన్నో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సుమారు 12 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఫిబ్రవరి 24 వరకు మొత్తం 11,64,100 కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఈ మొత్తం ఇప్పటికి మరికొంత పెరిగి ఉంటుందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఎన్ని పాత నోట్లు వచ్చాయనే వివరాలను మాత్రం మంత్రి తెలుపలేదు. ప్రతి కరెన్సీ నోటు నకిలీదో కాదో పరిశీలించాల్సి ఉందని, అనంతరం నకిలీ నోట్లను, మంచి వాటిని వేరు చేయాలన్నారు. ఇదొక పెద్ద ప్రక్రియని, ఈ పనంతా ముగిసిన అనంతరం సమగ్రమైన నివేదికను సభకు అందిస్తామన్నారు. అదేవిధంగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల వివరాలను ప్రకటించారు. గతేడాది డిసెంబర్ లో రూ.1,40,824 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయని చెప్పారు. కాగ 2015 డిసెంబర్ లో ఈ పన్నులు రూ.1,35,660 కోట్లు మాత్రమే. -
కొత్త నోట్లు ప్రెస్‌ల నుంచి డైరెక్ట్‌గా ఇంటికే!
రోజుల తరబడి క్యూలైన్లో నిల్చున్నా బ్యాంకుల్లో నగదు దొరకడం లేదు.. కొంతమంది దగ్గరైతే కోట్లకు కోట్లు కొత్త నోట్లు దర్జాగా వచ్చేస్తున్నాయి. ఇదంతా ఏమిటి? వారందరికీ కొత్త నోట్లు ఎలా దొరుకుతున్నాయి. మనం ఎన్నిరోజులు నిల్చున్న మనకెందుకు దొరకట్లేదు. కొందరి బ్యాంకు అధికారులు మతలబుతో పాటు ఇంకేమైనా గందరగోళం ఉందా? ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల నుంచి వస్తున్న సందేహాలు. వారి సందేహాలకు ఆజ్యం పోస్తూ తాజాగా ఆదాయపు పన్ను శాఖ కూడా పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు కొందరి వద్దే దొరుకుతుండటంపై అనుమానాలు వ్యక్తంచేస్తోంది. పెద్ద ఎత్తున్న కొత్త నోట్లు ప్రభుత్వ ముద్రణా సంస్థలు, ఆర్బీఐ నుంచే డైరెక్ట్‌గా కొందరి ఇళ్లకు చేరినట్టు ఐటీ అనుమానిస్తోంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించాయి. హిందుస్తాన్ టైమ్స్ రిపోర్టు ప్రకారం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన రెండు ప్రభుత్వ కరెన్సీ ప్రెస్ ముద్రణ వేసి ఉన్న రూ.20 లక్షల కొత్త 2000 రూపాయి నోట్లు గతనెలా ఢిల్లీలో పట్టుబడ్డాయి. ఇవి పట్టుబడిన అనంతరం వెంటనే ఐటీ శాఖ, మద్రణ సంస్థ నుంచి కొత్త నోట్లు ఇలా ఎక్కడికి వెళ్తున్నాయ్ అనే దిశగా విచారణ ప్రారంభించింది. ఈ నగదు పట్టుబడింది ఓ కొరియర్ బాయ్ దగ్గర. అతని పేరు కృష్ణ కుమార్‌గా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 15న గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్ మార్కెట్లో వేచిచూస్తుండగా అధికారులు ఇతన్ని పట్టుకున్నారు. ముద్రణ సంస్థల సీల్‌తో ఉన్న నగదు పబ్లిక్‌లో పట్టుబడటం ఇదే మొదటిసారని ఇద్దరు సీనియర్ ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ఒకవేళ ప్రింటింగ్ ప్రెస్, ఆర్బీఐ చెస్ట్‌లు తమ లొసుగులతో రాజీపడి ఇలాంటి కార్యకలాపాలేమైనా నిర్వహిస్తే, ఆర్బీఐ కచ్చితంగా తమతో మరింత సమాచారం పంచుకోవాల్సి ఉంటుందని మరో అధికారి చెప్పారు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నగదు చేరవేస్తున్న నగదు నిర్వహణ కంపెనీల పాత్రపై కూడా ఐటీ, ఇంటిలిజెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అధికారులు పట్టుకున్న ఆ బ్యాగులు సాల్బోని, నాసిక్ ప్రెస్‌లకు సంబంధించినవి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ రెండు ప్రెసింగ్ సంస్థలు రోజుకు 52 లక్షల పీస్‌ల నోట్లను ప్రింట్ చేస్తున్నాయి. -
కొత్త నోట్లలో లంచం తీసుకోరా?
-
కొత్త నోట్లలో లంచం తీసుకోరా?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోట్ల రద్దుపై శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నోట్ల రద్దు ద్వారా అవినీతి నిర్మూలన జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్న మాటలు నిజం కాదని.. కొత్త నోట్లలో లంచం తీసుకోరనడానికి, బ్లాక్ మనీ ఉండదనడానికి ఎలాంటి గ్యారంటీ లేదన్నారు. నోట్ల రద్దుతో తీవ్రవాదులకు నష్టం జరుగుతుందన్న వాదన సైతం అవాస్తవం అని, ఉగ్రవాదులకు ఫేక్ కరెన్సీ మాత్రమే అందటం లేదని చిదంబరం అన్నారు. సెప్టెంబర్ 30 నుంచి జమ్మూకశ్మీర్‌లో 33 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారని వెల్లడించారు. 2016లో కశ్మీర్లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య 87 అని.. ఇది 2015లో మృతి చెందిన భద్రతా సిబ్బంది సంఖ్య కంటే రెట్టింపు అని తెలిపారు. దీనిని బట్టి తీవ్రవాదం విషయంలో పరిస్థితి మెరుగైనట్లుగా కనిపించడం లేదని చిదంబరం అన్నారు. నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఆగ్రహంతో లేరు అని చెప్పడం సరికాదన్నారు. -
రెడిమేడ్ గార్మెంట్స్‌లో చక్కగా చుట్టి ...
-
కేరళలో రూ. 51 లక్షల కొత్త నోట్లు స్వాధీనం
-
కేరళలో రూ. 51 లక్షల కొత్త నోట్లు స్వాధీనం
కన్నూర్/ముంబై: దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేరళలోని ఇరిటి వద్ద ఆదివారం ఎక్సైజ్ అధికారులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి లెక్కల్లో చూపని రూ. 51 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి వస్తోంది. కేరళలోని తిరూర్‌లో ఓ వ్యాపారి నుంచి రూ. 39.98 లక్షల విలువైన రూ.2 వేలనోట్లను ఇటీవల స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ముంబైలోని పన్వేల్‌లో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రూ. 35 లక్షలను, రూ. 2.5 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దొరికిన కరెన్సీ అంతా రూ.2 వేల కొత్తనోట్లే. -
డబ్బేమైంది..!
జిల్లాకు వచ్చిన రూ.315 కోట్ల కొత్త నోట్లు అయినా ఏటీఎంలలో డబ్బుల కొరత గంటపాటే పనిచేస్తున్న మిషన్లు సెలవు రోజుల్లో మూతే బ్యాంకుల్లోనూ తప్పని తిప్పలు పాత నోట్లు రద్దయి నలభై రోజులు కావస్తున్నాయి. అధికార యంత్రాంగం కోరినదాంట్లో సుమారుగా రూ. 315 కోట్లు జిల్లాకు కొత్త నోట్లు వచ్చాయి. ఇంకా ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండగా.. సెలవు రోజుల్లోనైతే అసలు తెరవడమే లేదు. బ్యాంకులకు వెళ్తున్న ఖాతాదారులందరికీ నిర్దేశించిన డబ్బులు కూడా అందడం లేదు. మరి జిల్లాకు వచ్చిన కొత్త నోట్లు ఏమైనట్లు..? ప్రజలకు ఇది శేష ప్రశ్నగా మారింది. నిజామాబాద్‌అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పాత రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో జిల్లాకు రూ.350 కోట్లు కొత్తవి పంపాలని అధికారం యంత్రాంగం ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. ఇప్పటివరకు జిల్లాకు రూ.315 కోట్లకుపైగా కొత్తనోట్లను బ్యాంకులకు పంపిణీ చేసి నగదును అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సామాన్య జనానికి డబ్బులు మాత్రం అందడంలేదు.. సెలవులు వస్తే ఏటీఎంలు మూత పడుతున్నాయి. పని రోజుల్లో గంటపాటు ఏటీఎంలలో డబ్బులు ఉంటున్నాయి. జిల్లాలో 356 బ్యాంకులు, 342 ఏటీఎంలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల ద్వారా నగదును ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కోట్లాది రూపాయలు వచ్చినా.. సామాన్యుడికి అందకపోవడం వెనుక పక్కదారి పట్టడమే ప్రధాన కారణమంటున్నారు. బ్యాంకులలో నగదు విత్ డ్రాకు నిబంధనలు అమల్లో ఉన్నాయి. సామాన్య జనం డబ్బుల కోసం ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాలు, శుభకార్యాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర వ్యాపారపరంగా అవసరాలు, రైతులు పెట్టుబడికి డబ్బులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో ఏటీఎంలు మూతపడ్డాయి. పింఛన్ల కోసం వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలు ఇంకేన్ని రోజులు ఉంటాయోనని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల ద్వారా రూ.10 వేల నగదు అందిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం సక్రమంగా అమలు కావడంలేదు. నేటివరకూ కొందరు ఉద్యోగులకు డబ్బులు అందలేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రంగాల్లోని బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు బ్యాంకుల నుంచి నేరుగా నోట్ల మార్పిడి జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయల నోట్ల మార్పిడిలో బ్యాంకు అధికారులదే పెద్దన్న పాత్ర. నల్లధన కుబేరులు, దళారుల వ్యవహారమే కొనసాగింది. బ్యాంకుల నుంచి డబ్బులను మధ్యవర్తులు పొంది 30 శాతం కమీషన్‌తో నోట్ల మార్పిడికి తెగబుతున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు, పరిశీలనలు చేపడితే ఖచ్చితంగా అక్రమాలు వెలుగులోకి వచ్చేవని జానాభిప్రాయం. కాగా జిల్లాలో నల్లధనం బయట పడకపోవడం మిస్టరీగా మారింది. అక్రమ ఆస్తులు, ఆదాయంపై ఐటీశాఖ స్పందన కనిపించడం లేదంటున్నారు. -
బాబా బాబా..బ్లాక్ బ్యాంక్
-
బ్రోకర్ల గుట్టు రట్టు..భారీగా కొత్త నోట్లు స్వాధీనం
బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తరువాత భారీగా నమోదవుతున్నఅక్రమ నగదు లావాదేవీల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాత నోట్ల మార్పిడిలో మధ్యవర్తులు, బ్రోకర్లు అక్రమాలకు హద్దు లేకుండా పోతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా వ్యవహరించి అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు. తాజాగా కర్ణాటకలో భారీగా కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నగదు మార్పిడికి పాల్పడుతున్న రాకెట్టును ఛేదించిన ఈడీ అధికారులు ఏడుగురు మధ్యవర్తులను అరెస్టు చేశారు. సుమారు 93 లక్షల రూపాయల స్వాధీనం చేసుకుంది. నగదు బదిలీ దర్యాప్తులో భాగంగా ఈడీ అరెస్ట్ చేసిన వారిలో ఒక ప్రభుత్వ అధికారి బంధువు సహా ఉన్నారు. రూ .2000ల కొత్త నోట్ల రూ 93 లక్షలను వీరినుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద కేసునమోదు చేశామన్నారు. ఇటీవల ఆదాయపన్నుఅధికారులు 5.7 కోట్ల కొత్త నోట్లనుస్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులుగా కస్టమర్లుగా వ్యవహరించి బ్రోకర్ల గుట్టురట్టు చేశారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కైన బ్రోకర్లు పాత నగదు మార్పిడిలో 15-35 శాతం కమిషన్ తీసుకుంటున్నట్టుగా తమ దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. నిందితులను స్థానిక కోర్టులోహాజరపర్చనున్నట్టు చెప్పారు. కమిషన్ తీసుకుంటూ నల్లధనాన్ని వైట్ గా మార్చేందుకు గాను ఒక ముఠాగా ఏర్పడి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై తమ విచారణ కొనసాగుతుందని తెలిపారు. -
కొత్త నోటు.. ఇట్టే పట్టు!
డోర్ డెలివరీ వ్యాపారం – 10 శాతం కమీషన్ ఇస్తే చాలు – చర్చనీయాంశంగా మారిన ముఠా ఆగడాలు – భారీ మొత్తంలో కొత్త కరెన్సీ సర్క్యులేషన్ – మొదట్లో ఏకంగా 30 శాతం కమీషన్ రూ.500 మించి మందులు(మెడిసిన్స్) కొనుగోలు చేస్తే మీ ఇంటికే పంపుతాం. – ఓ మెడికల్ షాప్ ప్రకటన మీరు రూ.2 వేలకు మించి సరుకులు కొనుగోలు చేస్తే మీ ఇంటి వద్దకే సరుకులు తెచ్చిస్తాం. ఇవీ మార్కెట్లో సాధారణంగా కనిపించే వ్యాపార ప్రకటనలు. తాజాగా రూ.1.10లక్షల పాత కరెన్సీ ఇస్తే.. లక్ష రూపాయల కొత్త కరెన్సీ డోర్ డెలివరీ చేస్తాం అంటూ ఓ ముఠా ప్రచారం చేసుకుంటోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కొత్త కరెన్సీ రాకతో రోజుకో కొత్త తరహా వ్యాపారం తెరపైకి వస్తోంది. బ్లాక్ మనీని మార్చుకోవడం ఎంత సులువైన విషయమో రోజుకో కొత్త ప్రచారం చూస్తే అర్థమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని లక్షలు కావాలన్నా చెప్పండి.. మీ ఇంటి వద్దకే వచ్చి కరెన్సీ ఇస్తామంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎలాంటి తనిఖీల ఇబ్బంది లేకుండా కొత్తగా నిగనిగలాడే రూ.2వేల నోట్లు ఇస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవైపు రూ.2వేలకే గంటలకొద్దీ లైన్లలో వేచి చూస్తున్న సాధారణ జనం.. మరోవైపు లక్షలకు లక్షల కొత్త కరెన్సీని ఇంత సులభంగా కరెన్సీ ముఠా ఎలా తేగలుగుతుందో అర్థం కాని పరిస్థితి. మొదట్లో 30 శాతం వరకూ ఉన్న కమీషన్ కాస్తా తాజాగా 10 శాతానికి పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 8 శాతం కమిషన్‌తోనూ నల్లధనాన్ని సులభంగా తెల్లధనం చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. కరెన్సీ మార్పిడి పేరుతో నకిలీ ముఠాలు కూడా జిల్లాలో సంచరిస్తున్నాయి. డబ్బున్న వాళ్లను గుర్తించి దోచుకునేందుకు కొత్త ఎత్తుగడతో తెరపైకి వస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఒకవైపు క్యూలు.. మరోవైపు...! – ఒకవైపు కేవలం రూ.2 వేల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏటీఎంలో వేచిచూస్తున్న సాధారణ జనం! – వచ్చిన జీతాన్ని తీసుకునేందుకు బ్యాంకు వద్ద క్యూలో ఉదయం నుంచి నిల్చుంటే కేవలం రూ.4 వేలు మాత్రమే ఇస్తామని చల్లగా మధ్యాహ్నం సమయంలో తేల్చిచెబుతున్న బ్యాంకర్లు!! – మరోవైపు లక్షా 10 వేలు ఇవ్వండి చాలు.. అక్షరాలా లక్ష రూపాయల కొత్త రూ.2 వేల నోట్ల కరెన్సీ ఇస్తామంటున్న ఏజెంట్లు!!! ఇదీ జిల్లాలో హెచ్చుమీరుతున్న కరెన్సీ ముఠా ఆగడాలకు సాక్ష్యం. అది కూడా నేరుగా ఇంటికే చేరుస్తామని(డోర్ డెలివరీ) కూడా చెబుతుండటం గమనార్హం. బ్యాంకుల చుట్టూ గంటలకు గంటలు తిరిగితే తప్ప రూ.2 వేలు సాధారణ జనం పొందలేకపోతుంటే...లక్షలకు లక్షలు కొత్త కరెన్సీ ఏ విధంగా కరెన్సీ ముఠా చేతికి వచ్చిందనే విషయం అర్థం కాని పరిస్థితి. అయితే, బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఇంత సులభంగా కొత్త కరెన్సీ మార్కెట్లో లభించడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో బ్యాంకు సిబ్బంది పాత్రపై విచారణ జరిగితే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, ప్రధానంగా బళ్లారి నుంచి భారీగా కొత్త నగదు జిల్లాలోకి వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. 30 శాతం నుంచి 8 శాతానికి.. వాస్తవానికి నోట్ల రద్దు ప్రకటన కొత్తలో ఏకంగా 30 శాతం కమీషన్ నడిచింది. అంటే పాత నోట్ల మొత్తం లక్ష రూపాయలు ఇస్తే.. రూ.70 వేల కొత్త కరెన్సీ ఇచ్చేవారు. అయితే, రానురాను సులభంగా కొత్త కరెన్సీ ముఠాకు వచ్చిపడుతోంది. దీంతో క్రమంగా కమీషన్ మొత్తాన్ని 30 నుంచి 20 శాతానికి.. ఆ తర్వాత 15 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 10 శాతం కమీషన్ నడుస్తోందని సమాచారం. ఇంకా బేరమాడితే 8 శాతానికి కూడా నగదును సులభంగా ఈ ముఠాలు మారుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే అదనుగా కరెన్సీ మారుస్తామంటూ నకిలీ ముఠాలు తెరమీదకు వస్తున్నాయి. నిరంతరం దాడులు చేస్తాం కరెన్సీ మారుస్తామంటూ కొన్ని ముఠాలు జిల్లాలో బయలుదేరాయి. జిల్లా అంతటా ఇప్పటికే అప్రమత్తం చేశాం. అందుకే ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు చెబుతున్నాం. కరెన్సీ ముఠాల గురించి పోలీసులకు సమాచారం ఇస్తాం. నకిలీ ముఠాలు కూడా బయలుదేరాయి. ఆదోని గ్యాంగు వద్ద కూడా నగదు లేదు. కేవలం రూమర్లను సృష్టించి.. డబ్బున్న వాళ్లను గుర్తిస్తున్నారు. – ఆకే రవికృష్ణ, జిల్లా సూపరింటెండెంట్ -
పాత నోట్లకు కొత్త నోట్లు
- రూ.7 కోట్లకు భేరం - పోలీసులను పరుగులు పెట్టించిన ఘనులు - తెల్లవారుజామున 5 గంటల వరకు గాలింపు ఎమ్మిగనూరురూరల్: పెద్ద నోట్ల రద్దు కొందరికి సంకటంగా మారితే మరికొందరికి ఆదాయ వనరు అయింది. పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ కొందరు మరి కొందరికితో ఫోన్లో భేరమాడడం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఘటన శనివారం ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. దీనిపై అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వనీయ సమాచారం మేరకు... ‘తమ మద్ద కొత్త కరెన్సీ నోట్లున్నాయి.. 20 శాతం కమీషన్ ఇస్తే రూ. 7కోట్ల వరకు పాత నోట్లు మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరుకు చెందిన కొందరు వ్యక్తులు కొలిమిగుండ్ల, హైదరాబాద్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారితో ఫోన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఫోన్ సంభాషణల విషయం తెలుసుకున్న ఎస్పీ క్రైం పార్టీ పోలీసులు ట్రాప్ చేశారు. ‘ఎన్నికోట్ల పాత నోట్లు తెచ్చినా మేము మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరు వాసులు చెప్పగా ’రూ. 3కోట్లకు కావాలి’ అని వారు చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వారిని నోట్లతో వచ్చి ఎమ్మిగనూరు బస్టాండ్‌లో ఉండాలని సూచించారు’. ఇందుకు సంబంధించి ఎస్పీ నుంచి సమాచారం రావడంతో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అర్ధరాత్రి పట్టణానికి చేరుకొని స్థానిక సీఐ, ఎస్ఐలతో బస్టాండ్, లాడ్జ్లను గాలించారు. పోలీసులు పట్టణంలో తిరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తి పట్టణానికి వచ్చిన కొత్త వ్యక్తులకు సమాచారం అందించటంతో వారు రాత్రికి రాత్రే మంత్రాలయం వెళ్లడం, అక్కడ కూడా పోలీసులు గాలించడం జరిగిపోయింది. చివరకు పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి దగ్గర తనిఖీ చేయగా డబ్బులు దొరకకపోవడంతో పోలీసు ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడి జరుగుతుందని రేగిన కలకలం చివరికి రెండు గ్రూపులకు చెందిన వారి దగ్గర డబ్బులు లేవని చీటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. విషయంపై పట్టణ ఎస్ఐ కె.హరిప్రసాద్‌ను 'సాక్షి' వివరణ కొరగా డబ్బులు మారుస్తామని చీటింగ్ చేసిన కేసులో పట్టణానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
స్తంభించిన ‘సహకారం’ !
– డీసీసీబీ బ్రాంచీల్లో నిలిచిన లావాదేవీలు – కొత్త నోట్లులేక స్తంభించిన సేవలు - ఆందోళనలో రైతులు కోడుమూరు: పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్ సహకార వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజుల నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలోని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్(డీసీసీబీ)లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లు తీసుకోకూడదని జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్‌కు ఆర్బీఐ నిబంధనలు విధించడంతో ఈపరిస్థితి తలెత్తింది. కర్నూలు జిల్లాలో 22 డీసీసీబీ బ్రాంచీలు, 95 సహకార సంఘాలున్నాయి. వీటిలో లక్ష ఇరవైవేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల కింద వారికి దాదాపు రూ. 872 కోట్లు అప్పులిచ్చారు. రూ. 475 కోట్లను రైతుల నుంచి డిపాజిట్లు సేకరించారు. దాదాపు రూ.1350 కోట్లు లావాదేవీలతో వాణిజ్య బ్యాంకులతో సమానంగా డీసీసీబీ బ్రాంచీలు పనిచేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సహకార సంఘాల సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎంతో నమ్మకంగా చేసిన డిపాజిట్లను సహకార బ్యాంకులు తిరిగి ఇవ్వలేని పరిస్థితి. కనీసం తీసుకున్న రుణాలను చెల్లిస్తామని రైతులు ముందుకొచ్చినా పెద్దనోట్ల తీసుకోకూడదు. దీంతో రైతన్నలకు వడ్డీ బారం మరింత పెరిగే అవకాశముంది. సేద్యం ఆధారంగా జీవించే రైతులకు నల్ల కుబేరులకు విధించిన పెద్దనోట్ల ఆంక్షలను వర్తింపజేయడం, అన్నపెట్టే రైతును అవమానించినట్టేనని భూమాత రైతు సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ.2000 కూడా ఇవ్వని పరిస్థితి డబ్బు అవసర నిమిత్తం ఖాతాదారులు డీసీసీబీ బ్రాంచీలకు వెళ్లితే రూ.2000 కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వాణిజ్య బ్యాంకులకు కొత్త కరెన్సీ నోట్లు ఎంతో కొంత సరఫరా అవుతున్నాయి. డీసీసీబీ బ్రాంచీలకు మాత్రం ఆర్బీఐ నుంచి కొత్తనోట్లను సరఫరా చేయడంలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.3 కోట్లు సహకార బ్యాంకు నుంచి ఖాతాదారులకు అందజేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పుదారులకు ఓవర్ డ్యూ ముప్పు : డీసీసీబీ బ్రాంచీలల్లో వివిధ పథకాల కింద రైతులు తీసుకున్న అప్పుల వాయిదాలను చెల్లించేందుకు వెళ్తుండగా బ్యాంక్ ఉద్యోగులు పాతనోట్లను తీసుకోవడంలేదు. కొత్త నోట్లు కావాలని ఖాతాదారులకు వెనక్కి పంపుతున్నారు. నెల వాయిదాలు సరిగ్గా చెల్లించకపోతే వడ్డీలు పెరిగిపోతాయని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలకు బ్రేక్ : ఆర్బీఐ ఆంక్షలతో జిల్లాలోని 22 జిల్లా సహకార కో–ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచుల్లో రోజుకు రూ. 4 కోట్లు సహకార లావాదేవీలు, వ్యాపారాలు స్థంభించిపోయాయి. పెద్దనోట్లు రద్దయి దాదాపు 25 రోజులు పూర్తవుతుంది. ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు లావాదేవీలను ఆ బ్యాంకు కోల్పోయింది. ఈ ప్రభావం సహకార రంగంపైనే కాకుండా జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడిందని డీసీసీబీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తమ బ్రాంచ్‌లలో దాదాపు రూ.25 కోట్లు విలువైన బంగారు నగలు తాకట్టు పెట్టి రైతులు రుణాలు తీసుకున్నారు. పెళ్లిళ్ల కోసం వాటిని విడిపించుకునేందుకు వెళ్లిన రైతులకు బంగారు ఆభరణాలు ఇవ్వడంలేదు. కొత్తనోట్లు ఇస్తేనే నగలు ఇస్తామని బ్యాంక్ సిబ్బంది మెలిక పెడుతున్నారు. దీంతో రైతులకు దిక్కుతోచడం లేదు. అప్పు మంజూరైనా ఇవ్వడంలేదు : సామేల్, రైతు రెండున్నర ఎకరా మార్టిగేజీ చేసి కోడుమూరు డీసీసీబీలో రూ.2.59 వేలు అప్పు మంజూరు చేయించుకున్నా. వారం రోజుల నుంచి డబ్బుల కోసం తిరుగుతున్నా బ్యాంక్ అధికారులు ఇవ్వడంలేదు. ఈ నెల 9వ తేదీన నా కొడుకు పెళ్లి ఉంది. చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఆర్బీఐ ఆంక్షలను సడలించాలి : సునీల్ కుమార్, కేడీసీసీ డీజీఎం నోట్ల రద్దుపై ఆంక్షలను సడలించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లా సహకార కేంద్రాల్లోని లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుతో లావాదేవీలు నిలిచిపోవడంతో రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. బ్రాంచీలన్నీ ఆర్థికంగా నలిగిపోతాయి. -
కేటుగాళ్లకు కొత్త నోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గంటల తరబడి క్యూలో నిలబడితే.. చివరకు బ్యాంకర్లు దయతలిస్తే సామాన్యుడి చేతికొచ్చేది మహా అయితే రెండు రూ.2 వేల నోట్లు మాత్రమే. బ్యాంకు ఏటీఎం ఎదుట క్యూలో నిలబడితే వచ్చేది రోజుకు ఒక్కటే నోటు. బాగా పలుకుబడి ఉంటేగాని బ్యాంకులో మూడు నాలుగు నోట్లు తీసుకోవడం సాధ్యం కాదు. ఇదీ వాస్తవ పరిస్థితి. కానీ.. కొంతమంది వద్ద లక్షలాది రూపాయల విలువ చేసే కొత్త నోట్ల కట్టలు ఉంటున్నాయి. పకడ్బందీగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరాల్సిన ఈ నోట్లు బయటకు ఎలా వస్తున్నాయన్నది అంతుబట్టడం లేదు. బ్యాంకుల సిబ్బంది, మేనేజర్ల సహకారం లేకుండా ఒక్క నోటు కూడా బయటకు రాదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలో మాత్రం చాలా సునాయాసంగా రూ.2 వేల నోట్ల కట్టలు బయటకు వచ్చేస్తున్నాయి. బ్యాంకు మేనేజర్‌కు, సిబ్బందికి 20 నుంచి 30 శాతం కమీష¯ŒS ఇస్తే ఎన్ని కావాలంటే అన్ని లక్షలు మార్చుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి జిలావ్యాప్తంగా ఉన్నట్టు ఇటీవలి ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. వారం క్రితం రూ.24 లక్షల రూపాయలు మార్చుకునేందుకు యత్నించిన వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. విజయవాడకు చెందిన విజయ్ అగర్వాల్‌తోపాటు, కార్ యాక్ససరీస్ పనిచేసే అంచెల రవికుమార్ సహా 8మంది పోలీసులకు పట్టుబడ్డారు. అగర్వాల్, రవికుమార్ అనేవారికి ఏలూరులో మెకానిక్‌గా పనిచేసే రవితో పరిచయం ఉంది. అతను నాలుగు శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మార్చుకుంటానని చెప్పడంతో వారు ఏలూరు వచ్చారు. సోమవరప్పాడు పొలాల్లో ఉండగా పోలీసులకు అందిన సమాచారంతో వారిపై దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రూ.24 లక్షల నగదు స్వా«ధీనం చేసుకున్నారు. అయితే డబ్బులు మార్చుకునేవారు మాత్రం పట్టుపడలేదు. సుమారు రూ.రెండు కోట్లు మార్చుకునేందుకు డీల్ కుదిరిందని, ఈ ప్రయత్నంలో వారు పోలీసులకు పట్టుబడినట్లు ప్రచారం జరిగినా సూత్రధారులు బయటకు రాలేదు. పోలీసులు డబ్బులు దొరకగానే కేసు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూత్రధారులను పట్టుకునే ప్రయత్నం వారి నుంచి లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా గురువారం రాత్రి ఏలూరు వ¯ŒSటౌ¯ŒSలోని సూర్యా అపార్ట్మెంట్లో ఎలబాక బాలకృష్ణ సహా ఐదుగుర్ని అరెస్ట్ చేసి రూ.19 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ వడ్రంగి మేస్రి్తగా పని చేస్తున్నాడు. అతని వద్ద అంత డబ్బు ఉండే అవకాశం లేదు. తాను వేర్వేరు వ్యక్తుల వద్ద అప్పు తీసుకున్నానని బాలకృష్ణ చెబుతున్నాడు. అప్పు తీసుకున్నా రూ.2 వేల కొత్త నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతని ఇంటిపక్కనే స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఉండటంతో అందులో పనిచేసే సిబ్బంది ద్వారా ఈ డబ్బులు బయటకు వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును కూడా గాలికి వదిలివేయకుండా లోతుగా దర్యాప్తు చేస్తే నోట్ల మార్పిడి వెనుక సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం తాడేపల్లిగూడెంలో పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తుండగా మాడెం గోపీకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.3.56 లక్షల విలువైన రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను లక్షకు 12 శాతం కమీష¯ŒSకు పాత నోట్లు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
అసలు నోట్లను గుర్తించండిలా..
కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చాలామందికి అందుబాటులోకి కూడా రాకముందే పలు చోట్ల నకిలీ నోట్లు చెలామణిలోకి రావడం సామాన్యులకు దడ పుట్టిస్తోంది. పెద్ద నోట్ల మార్పిడికి ప్రజలు ఓ వైపు బ్యాంకులు, పోస్టు ఆఫీసుల ముందు బారులు తీరుతుంటే.. కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా నకిలీ నోట్లను చెలామణిలోకి తెస్తున్నారు. దీంతో ఏవి అసలువో, ఏవి నకిలీవో తెలియక ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కింది సూచనలతో అసలు నోట్లను గుర్తించవచ్చు. ముందు భాగం కొత్త రూ.2 వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66 మి.మీ, వెడల్పు 166 మి.మీ.గా ఉంటుంది. ముందు భాగం 1. లైటు వెలుతురులో రూ.2000 సంఖ్యను గమనించవచ్చు. 2. నోటును కొంచెం వొంచి చూస్తే 2000 సంఖ్య కనిపిస్తుంది. 3. దేవ నాగరి లిపిలో రూ.2000 సంఖ్య రాసి ఉంటుంది. 4. మహాత్మా గాంధీ బొమ్మ మధ్య భాగం వైపునకు ఉంటుంది. 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 ఉంటారుు. 6. నోటును ఏటవాలుగా పట్టుకుంటే దారం పోగు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగుకు మారుతుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు. 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తారుు. 10. కింది భాగంలో కుడివైపున రూపారుు చిహ్నంతో సహా రంగు మారే సిరాతో (ఆకుపచ్చ నుంచి నీలం) 2000 ఉంటుంది. 11. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం అంధుల కోసం 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.2000 సంఖ్య ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉంటుంది. 13. కుడి వైపున, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముంద్రించిన ఏడు చిన్న చిన్న గీతలు ఉంటాయి. వెనుక భాగం 14. నోటు ముద్రించిన సంవత్సరం ఎడమ వైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. 16. మధ్య భాగంలో వివిధ భాషల ప్యానల్ ఉంటుంది. 17. మార్సపైకి ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ చిత్రం ముద్రించారు. -
కొత్తనోట్ల నిర్వహణపై RBI కఠిన నిబంధనలు
-
క్యూలో సిటీ
పచ్చనోటు ‘రద్దు’.. నగరవాసికి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. పదిరోజులు గడుస్తున్నా ‘కొత్తనోటు’ చేతికి అందక ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల వద్ద కిలోమీటర్ల పొడవున జనం బారులు.. ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దే అవే క్యూలు. ఏది కొనాలన్నా తడుముకునే పరిస్థితి. వంటింట్లోని డబ్బాలు వెదికినా పదిరూపాయలు కూడా దొరకడం లేదు. మార్కెట్లు కుప్పకూలిపోయారుు. కూలీలకు పని దొరకని దుస్థితి. కోట్ల ఆస్తులున్నా రూ.2 వేల కొత్త నోట్లు కోసం అవస్థలు పడాల్సివస్తోంది. గురువారం కూడా నగరవ్యాప్తంగా ఇదే దుస్థితి. రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లో రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరిగే గుడిమల్కాపూర్ మార్కెట్లో గురువారం రూ.2 కోట్ల మేరకే వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం, కూరగాయలు, హోల్‌సేల్, నిత్యావసరాలు.. ప్రతి మార్కెట్ ‘నోటు’ దెబ్బకు విలవిల్లాడుతున్నారుు. - సాక్షి,సిటీబ్యూరో -
ఆర్బీఐలోనే క్యాష్ అయిపోయింది!
ఆర్బీఐ చెన్నై ఆఫీసులో గత వారం రోజులుగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. బ్యాంకుకు వస్తున్న విజిటర్స్ సంఖ్య పెరుగుతుండటంతో, ఆ ఆఫీసులో నగదు అయిపోతున్నాయి. దీంతో గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూసిన వారు నిరాశతో తిరుగుముఖం పటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం వాటిని మార్చుకోవడానికి తుది గడువుగా డిసెంబర్ 30ను నిర్ణయించింది. అప్పటివరకు మార్చుకోని వారి పరిస్థితి ఇక అంతే. దీంతో తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఆర్బీఐ ఆఫీసులోనే నగదు అయిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్‌మనీ నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ.. కనీస అవసరాలకు కూడా నగదు లభ్యంకాకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్‌లను కూడా గత వారం రోజులుగా పక్కనపెట్టి క్యూలైన్లో నిల్చుంటున్నామని వారు పేర్కొంటున్నారు. 1960లో రిజర్వు బ్యాంకు చెన్నై ఆఫీసును బ్యూటిఫుల్ ఫోర్ట్ గ్లాసిస్ ప్రాంతంలోకి తరలించారు. అప్పటినుంచి చూసుకుంటే ఈ ఆఫీసుకు వచ్చే జనం కొంచెం తక్కువగానే ఉండేవారట. కానీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుకు వచ్చే విజిటర్స్ సంఖ్య పెరిగి, భారీ రద్దీ ఏర్పడిందని అధికారులు చెప్పారు. ముందు రోజు ఉదయం 7 గంటలకు క్యూలైన్లో నిల్చుంటే, తర్వాత రోజైనా తమవంతు రావడంలేదని కొంతమంది ప్రజలు నిరాశ వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకులు రూ.2000 నోట్లను ఇష్యూ చేస్తుంటే, కస్టమర్లకు చిల్లర ఇవ్వడానికి ఇబ్బందులు పాలవాల్సి వస్తుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. మూడు గంటల నుంచి బ్యాంకు ఆఫీసు ముందు నిల్చుంటే, ఆఖరికి క్యాష్ అయిపోయినట్టు తెలిసిందని మరో కస్టమర్ వాపోయాడు. కొత్త నోట్లు అయిపోతుండంతో, ఇక 10 రూపాయి, 5 రూపాయి నాణేలను జారీచేసే ప్రక్రియలో పడింది రిజర్వు బ్యాంకు.క్యూ లైన్లో నిల్చోవడం ఇష్టపడని వారు, క్యూలో ఉన్నవారికి కమీషన్ ఇస్తూ నగదును డ్రా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు ఐడీ కార్డులపై నగదును డ్రా చేస్తున్నారు. దీంతో త్వరగా నగదు అయిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
-
కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
♦ తెలంగాణ, ఏపీలో దొడ్డిదారిన భారీగా చేతులు మారిన రూ. 2 వేల నోట్లు ♦ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలులో దళారుల దందా ♦ ఈ ఐదు నగరాల్లో బ్యాంక్‌ల నుంచి భారీగా నగదు జారీ చేసిన బ్యాంకర్లు ♦ హైదరాబాద్‌లో 24 మంది ఉన్నతాధికారులపై విచారణ ప్రారంభం ♦ విజయవాడ, గుంటూరు, కర్నూలులో13 మంది అధికారుల అక్రమాలు పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడంపై రిజర్వు బ్యాంక్ ఆరా కమీషన్ ప్రాతిపదికన పెద్దనోట్లు అందించినట్లు ఆరోపణలు బేగంపేట్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి భారీగా నగదు బయటకు.. సహకార బ్యాంక్‌ల నుంచి రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున నగదు! రూ. 2 వేల నోట్ల సరఫరా, వినియోగంపై లెక్కలు తేల్చేపనిలో కేంద్ర ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్ గుట్టుచప్పుడు కాకుండా కొత్త నోట్ల బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందా? అందులో ఏకంగా బ్యాంకు అధికారులే భాగస్వాములయ్యారా? కమీషన్ ప్రాతిపదికన పాత నోట్లకు కొత్త నోట్లను ఇచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్ అధికారులు కొందరు రూ. 2 వేల నోట్లను బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇష్టానుసారంగా ఈ నోట్లను కమీషన్ ప్రాతిపదికన బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలింది. రూ.1,000, 500 నోట్లను రద్దు చేసిన రెండోరోజు అంటే గురువారం నుంచి ఆదివారం దాకా భారీగా రూ.2 వేల నోట్లు పక్కదారి పట్టాయి. ప్రధాని పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన రెండోరోజు 40 శాతంగా ఉన్న కమీషన్ల దందా మంగళవారం వచ్చేసరికి 25 శాతానికి తగ్గింది. రూ.2 వేలనోట్లు భారీగా చలామణిలోకి రావడం వల్లే ఇలా జరిగిందని, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఈ దందా జోరుగా సాగుతోందని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి. దీంతో మంగళవారం నుంచి బ్యాంక్ శాఖల వద్ద నిఘా పెరిగింది. ముఖ్యంగా గురువారం నుంచి ఆదివారం దాకా భారీ ఎత్తున నగదు బయటకు తరలించినట్లు తేలిన బ్యాంక్ శాఖల సిబ్బందిని పక్కనబెట్టి ఇతర శాఖల ఉద్యోగులను సర్దుబాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెందిన 24 మంది సీనియర్ అధికారులు, విజయవాడ, గుంటూరు, కర్నూలులో 13 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రిజర్వు బ్యాంక్ గుర్తించింది. తీగలాగితే డొంక కదిలిందిలా.. రిజర్వు బ్యాంక్ హైదరాబాద్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు తన సమీప బంధువు ఒకరు ఫోన్ చేసి.. తన దగ్గర ఉన్న రూ.25 లక్షల పాత నోట్లు తీసుకుని కొత్తవి రూ.20 లక్షలు ఇస్తామంటున్నారు నమ్మవచ్చా అని అడిగారు. సదరు అధికారి మాటల్లో పెట్టి తన బంధువు నుంచి ఎవరు సమకూర్చబోతున్నారు? అతనికి ఎవరు ఇస్తామన్నారు? వంటి వివరాలను సేకరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే దిల్షుక్నగర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఆ బ్యాంక్ నుంచి నగదు మార్పిడి పేరిట డూప్లికేట్ పత్రాలు సృష్టించి రూ.50 లక్షల దాకా బయటకు తరలించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో ఓ బ్యాంక్ చీఫ్ మేనేజర్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనకు సన్నిహితుడైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 25 శాతం కమీషన్‌పై గత ఆదివారం రూ.2.5 కోట్లు సమకూర్చారు. ఆ నగదు విత్‌డ్రాకు ఆయన గడచిన గురు, శుక్రవారాల్లో నగదు మార్పిడికి వచ్చిన వారి పత్రాలను డూప్లికేట్ చేశారు. ఇంతపెద్దమొత్తంలో నగదు ఎందుకు విత్‌డ్రా చేశారని రిజర్వుబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నిస్తే మొదటి రెండు రోజులు వచ్చినవారే నాలుగోరోజు వచ్చారని బుకాయించారు. సోమవారం బ్యాంక్ సెలవు దినం కావడంతో దీనిపై మగంళవారం విచారణ ప్రారంభమైంది. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాదు... నెల్లూరులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌కే చెందిన ఓ సీనియర్ మేనేజర్ తన బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.2 కోట్ల విలువైన వంద నోట్లను ఓ వడ్ల వ్యాపారికి విత్‌డ్రా చేసి ఇచ్చాడు. చిల్లర లేదని ఇబ్బంది పడుతూ నగదు మార్పిడికి వచ్చిన వారికి మాత్రం ఆయన రూ.2000 నోట్లు ఇచ్చాడు. వంద నోటు కావాలని గొడవ చేసినా లేవంటూ వడ్ల వ్యాపారికి మాత్రం కమీషన్‌కు ఆ నోట్లు అమ్ముకున్నట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీనిపైనా విచారణ ప్రారంభమైంది. విజయవాడలోనూ ఇదే తంతు విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాలుగు బ్యాంక్‌లకు అందించాల్సిన రూ.12.5 కోట్ల నగదులో నాలుగో వంతు తాను పంపించిన వారికి ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్లను పురమాయించాడు. పాత నోట్ల మొత్తానికి 30 శాతం తక్కువగా కొత్తవాటిని సరఫరా చేశారు. ఈ నోట్లు తీసుకున్న వారు వెంటనే ఏలూరులో 40 శాతం కమీషన్‌కు పాత నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు పోలీసులను అప్రమత్తం చేసే లోపే దళారులు జారుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. ‘‘రూ.1000, రూ.500 పాత పెద్ద నోట్లు ఉంటే చెప్పండి...30 శాతం తక్కువకు కొత్త రూ.2000 నోట్లు సరఫరా చేస్తాం. మీ దగ్గర లేకపోతే మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నా చెప్పండి. ఎంతైనా ఫర్వాలేదు. మేం పాతవి తీసుకుని కొత్తవి ఇవ్వడానికి సిద్ధం’’ అనేక చోట్ల ఇప్పుడు ఇదే సంభాషణ. అత్యవసరంగా నగదు కావాలనుకునే వారి నుంచి 40 నుంచి 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు సమకూర్చిన మొత్తంలో 80 శాతం నగదు బయటకు తరలించిన విషయం రిజర్వు బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం ఆ బ్యాంక్‌కు బయటి నుంచి సిబ్బందిని తెప్పించి నగదు మార్పిడి, డిపాజిట్ల కార్యకలాపాల బాధ్యతలు అప్పగించారు. నగదు తరలింపుపై కన్ను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బ్యాంక్‌ల నుంచే భారీ ఎత్తున అక్రమంగా రూ.2 వేల నోట్లు బయటకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. రూ.500 నోట్లను తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు అందజేస్తే ప్రమాదకరమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం ఉదయమే ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని హెచ్చరించారు. అందువల్లే మంగళవారం ఇక్కడి బ్యాంక్‌లకు అందాల్సిన రూ.500 నోట్లను కావాలనే నిలుపుదల చేసినట్లు రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు. రూ.2,000 నోట్లను బహిరంగ మార్కెట్‌కు తరలించిన సీనియర్ అధికారులను గుర్తించామని, అతి త్వరలోనే వారిపై వేటు వేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంలకు చెందిన 24 మంది ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై రిజర్వుబ్యాంక్ విచారణ జరుపుతోంది. మామూలు కంటే నగదు విపరీతంగా బయటకు తరలించిన బ్రాంచ్‌లు వాటికి కారకులైన అధికారుల జాబితాను రిజర్వుబ్యాంక్ ఇప్పటికే ఆయా బ్యాంక్‌ల యాజమాన్యాలకు అందజేసింది. విజయవాడ, గుంటూరు, కర్నూలులోనూ ఇలాంటి కార్యకలాపాలకుపాల్పడిన 13 మంది సీనియర్ అధికారులపైనా కన్నేసి ఉంచాలని రిజర్వుబ్యాంక్ సదరు బ్యాంక్‌ల ఉన్నతాధికారులను ఆదేశించింది. కమీషన్లపై ఐబీ నివేదిక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురంలో కమీషన్ల ప్రాతిపదికన పెద్ద ఎత్తున నగదు మార్పిడి జరుగుతోందంటూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఇది జోరుగా సాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బ్యాంక్ సిబ్బంది లాలూచీ కారణంగానే పాత నోట్ల బ్లాక్ మార్కెటింగ్ అధికమైందని నివేదికలో తెలిపింది. అనంతపురం జిల్లాకు పొరుగున కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి కోట్ల రూపాయల్లో రూ.2 వేల నోట్లు వచ్చి చేరుతున్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, విజయవాడ నుంచి వ్యాపారులు అనంతపురంలో తిష్ట వేశారని కూడా ఐబీ హెచ్చరించింది. దీంతో మంగళవారం అనంతపురం సరిహద్దులోని కర్ణాటక బ్యాంక్‌ల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. సహకార బ్యాంక్‌ల్లో నగదు పంపిణీ బంద్ రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత నగదు మార్పిడికి రాష్ట్రాల ఆధీనంలోని సహకార బ్యాంక్‌లకు రిజర్వు బ్యాంక్ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బ్యాంక్‌లకు చేరిన మొత్తం ఖాతాదారులు, నగదు మార్పిడి కోసం వచ్చిన వారి కంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే చేరుతున్నాయని గ్రహించింది. దీంతో రిజర్వుబ్యాంక్ మంగళవారం నుంచి ఆ బ్యాంకుల్లో కార్యకలాపాలను నిలుపుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సహకార బ్యాంక్‌ల నుంచి భారీగా డబ్బు రాజకీయ ప్రముఖులకు చేరినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీన్ని కొనసాగిస్తే ప్రమాదకరమని, రూ.2 వేలు, రూ.500 నోట్లు బ్లాక్‌మార్కెట్ అవుతాయని హెచ్చరించింది. దీంతో దేశవ్యాప్తంగా సహకార బ్యాంక్‌ల నుంచి నగదు కార్యకలాపాలు నిషేధిస్తున్నట్లు రిజర్వుబ్యాంక్ మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది కూడా వెల్లడించలేదు. ఆయా రాష్ట్రాల్లో సహకార బ్యాంక్‌లకు తరలించిన నగదు వివరాలపై విచారణ జరపాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
సినీ పరిశ్రమకు ఇబ్బందేమీ లేదు
పెనుగంచిప్రోలు : తెలుగు సినిమా పరిశ్రమపై పెద్దనోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఏమీ ఉండదని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మ అమ్మవారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ కర్ల వెంకటనారాయణ ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం బోయపాటి శ్రీను స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో ‘సరైనోడు’ సినిమా షూటింగ్‌కు ముందు అమ్మవారిని దర్శించుకున్నానని, ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిందన్నారు. అలాగే, ఈనెల 16వ తేదీ నుంచి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, హీరోయిన్గా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారని తెలిపారు. గతంలో భద్ర, తులసి, దమ్ము, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలు తీశానని, ఇప్పుడు తీయబోయేది ఏడో సినిమా అని పేర్కొన్నారు. ద్వారకా క్రియేషన్స్ రవీంద్రరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్.. ఉర్జిత్ పటేల్ సంతకంతో ప్రజల చేతుల్లో మిలమిలాడుతున్న 2వేల రూపాయల నోటుపై షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్లకు చెక్ పెట్టేలా అత్యంత జాగ్రత్తగా డిజైన్ చేసిన ఈ తాజా నోట్లలో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్ పొందుపరచలేదన్న వార్త కలకలం రేపుతోంది. సరిపడా సమయంలేక భద్రతా లక్షణాలను పాత రూ. 500 నుంచి రూ. 1,000 నోట్ల మాదిరిగా ఉంచినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. హై సెక్యూరిటీ ఫీచర్స్ ను జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని, ఈ ప్ర్రక్రియకు కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వివరించారు. ఇలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చివరిసారి 2005 లో చేపట్టారన్నారు. వాటర్ మార్క్స్, సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్, గుప్త చిత్రం లాంటి ఇతర భద్రతా ఫీచర్స్ చేర్చడానికి అనేక అనుమతులు, ఫైనల్ గా క్యాబినెట్ ఆమోదం అవసరమని తెలిపారు. నూతన నోట్ల నిర్ణయం ఆరు నెలల క్రితం జరిగిందనీ , దీంతో భద్రతా లక్షణాలు మార్చే సమయం చాలక, డిజైన్ మార్చినా, భద్రతా లక్షణాలను పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు ఆ అధికారి తెలిపారు. మరోవైపు కొత్త కరెన్సీ నోట్లకు పాకిస్తాన్ నుంచి పొంచి వున్న నకిలీ ముప్పుపై ప్రశించినపుడు.. అసాధ్యమని తేల్చి పారేశారు..డిజైన్ మాత్రమే మార్చబడింది తప్ప భద్రతా లక్షణాలు అలాగే ఉన్నాయన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వ ముద్రణాలయంలో నకిలీ నోట్లు ప్రింట్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. -
తొలిరోజు కొత్త నోట్లు సెల్ఫీలకే పరిమితం
రూ.2000కు దొరకని చిల్లర మార్చుకోలేక ఇబ్బందిపడ్డ జనం తొలిరోజు కొత్త నోట్లు సెల్ఫీలకే పరిమితం నేటి నుంచి పనిచేయనున్న ఏటీఎంలు సిటీబ్యూరో: రెండురోజులుగా ‘చిల్లర’ కష్టాలు పడుతున్న నగర జీవికి మరో ‘కొత్త’ కష్టం వచ్చిపడింది. గురువారం కొత్త కరెన్సీ కోసం ఉదయమే బ్యాంకులకు పరుగులు తీసి.. ఆశగా సరికొత్త రూ.2000 నోట్లు అందుకున్నారు. వెంటనే సెల్ఫీలు దిగారు. ఆనందంగా వాటిని మార్చుకోవాలని ప్రయత్నించగా అసలు కష్టం మొదలైంది. చేతికి వచ్చిన కొత్త నోటుకు రూ.100 నోట్లు దొరకక ముప్పతిప్పలు పడ్డారు. తొలిరోజు తీసుకున్న డబ్బు కేవలం ‘సెల్ఫీ’లకే ఉపకరిస్తోందని పలువురు వాపోయారు. మరోపక్క శుక్రవారం నుంచి ఏటీఎం కేంద్రాలు సైతం పనిచేయనుండడంతో వాటి వద్దా బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. అందని రూ.500 నోట్లు కేంద్ర ప్రకటించినట్లు గురువారం నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ మార్పిడి, డిపాజిట్ల కార్యక్రమం మొదలైంది. అరుుతే, మార్కెట్లోకి కొత్త రూ.500 నోటు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో రూ.2000 నోట్లు మాత్రమే ప్రజలకు చేరారుు. గంటల తరబడి క్యూలో నిల్చున్న నగర వాసులకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పరిమితికి లోబడి గరిష్టంగా రూ.4000 చెల్లిస్తున్నారు. గతంలో అందుబాటులో ఉన్న దాని కంటే భారీ నోట్లు అమలులోకి రావడంతో రెండు రూ.2000 నోట్లు వీరి చేతికి వస్తున్నారుు. వీటిని తీసుకుని బయటకు వస్తున్న వినియోగదారులకు మరో పరేషాన్ ఎదురవుతోంది. రూ.2000కు దొరకని చిల్లర నగర వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచీ చిల్లర సమస్య ఏర్పడింది. పాత రూ.500, రూ.వెరుు్య నోట్లు పెట్రోల్ బంకులతో పాటు ‘ఎమర్జెన్సీ కేంద్రాలకు’ చేరిపోయారుు. దీంతో పాటు మిగిలిన చిన్న డినామినేషన్ నోట్ల కొరత ఏర్పడింది. ఈ పరిణామాలతో కొత్తగా చేతికి వచ్చిన రూ.2000 నోటుతో మార్కెట్లోకి వస్తున్న వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. రూ.వెరుు్య కంటే ఎక్కువ ఖరీదు చేస్తున్న వారికి ఇబ్బంది లేకపోరుునా.. అంతకు తక్కువ కొంటున్న వారికి మాత్రం చిల్లర లేక వ్యాపారులు చేతులెత్తేస్తున్నారు. ఇక బస్సులు, క్యాబ్‌ల్లో అరుుతే చిల్లర సమస్య కారణంగా అసలు రూ.2000 నోటు తీసుకోవడానికే నిరాకరిస్తున్నారు. అంతటా అదే సీన్.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో గంటల తరబడి వేచివుండి కొత్త నోట్లను చేతుల్లోకి తీసుకుంటున్న వినియోగదారులు వాటిని అపురూపంగా చూసుకుంటున్నారు. అనేక మంది వాటిలో ఉన్న ఫీచర్లను పరిశీలించడంపై ఆసక్తి చూపుతుండగా... మరికొందరు ఆ నోట్ల ఫొటోలు, సెల్ఫీలతో ముచ్చట తీర్చుకుంటున్నారు. గురువారం నగరంలో ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య కొత్త కరెన్సీనే ‘కరెంట్ డిస్ప్లే’గా మారింది. గురువారం ఉదయం నుంచీ కొత్త కరెన్సీ సెల్ఫీలతో ‘సోషల్ మీడియా’ నిండిపోరుుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు... రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు గురువారం మూడు కమిషనరేట్ల అధికారులు బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు, ఇతర మోసాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం ఏటీఎం కేంద్రాలు సైతం పని ప్రారంభించనుండడంతో మరిన్ని చర్యలు తీసుకోవడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లోని సెంటర్ల వద్ద బలగాలను మోహరించనున్నారు. ఈ కేంద్రాలన్నీ రోడ్లపై ఉంటున్న నేపథ్యంలో అక్కడకు వచ్చే వినియోగదారులతో, వారి వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణరుుంచారు. ‘గుర్తింపు’పై వివరాలు రాయాల్సిందే.. పాత కరెన్సీ మార్పిడి, డిపాజిట్ చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్తున్న వినియోగదారులు అక్కడ గుర్తింపుకార్డు ప్రతుల్ని సమర్పిస్తున్నారు. వీటిపై సెల్ నెంబర్‌తో పాటు ఏ రోజు దాఖలు చేస్తున్నారో ఆ తేదీ, సమయం, ఎంత మొత్తం డిపాజిట్‌కు ఇచ్చారో ఆ వివరాలు సైతం కచ్చితంగా రాయాలని, వాటి కింద సంతకం కూడా పెట్టాలని పోలీసుల సూచిస్తున్నారు. అలా కాకుండా మీ గుర్తింపుకార్డు ప్రతిని చేజిక్కించుకున్న ఇతరులు ఎవరైనా దాని జిరాక్సు ప్రతుల్ని తీసుకుని నగదు మార్పిడి చేసుకునే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితుల డబ్బు మార్పిడి, డిపాజిట్‌కు ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. హోటళ్లలో 40 శాతం తగ్గిన అమ్మకాలు రాంగోపాల్‌పేట్: కేంద్ర సర్కారు పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్‌లోని అంతర్జాతీయ గుర్తింపు గల ప్యారడైజ్ హోటల్, అల్ఫా హోటల్‌తో పాటు పలు హోటళ్లలో అమ్మకాలు భారీగా తగ్గిపోయారుు. హోటళ్లలో రూ.1000, రూ.500 నోట్లు తీసుకోబోమని బోర్డులు ఏర్పాటు చేయడం, నెట్ చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్యారడైజ్ హోటల్లో 40 శాతం వ్యాపారం తగ్గిపోరుునట్లు నిర్వాహకులు తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆల్ఫా హోటల్లోనూ 30 శాతం అమ్మకాలు తగ్గిపోయారుు. దీంతో పాటు గురువారం వచ్చిన కొత్త రూ.2000 నోటుకు కూడా చిల్లర లభించక అన్ని వ్యాపార సంస్థలు వ్యాపారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రైతుబజారులు పచ్చి కూరగాయల అమ్మకాలపై ఈ ప్రభావం అధికంగా పడింది. చిల్లర దొరక్క అవస్థలు పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్తే రూ.2 వేల కొత్త నోటు ఇచ్చారు. దీనికి ఎక్కడా చిల్లర లేదంటున్నారు. పాత 500 నోట్లు కలిపి ఇస్తామని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త నోటుకు చిల్లర దొరికే పరిస్థితి లేదు. ఎక్కడకు వెళ్లినా ఇదే సమాధానం చెబుతున్నారు. పాత 100, 50 నోట్లతో పాటు కొత్త 500 నోట్లను త్వరగా వచ్చేతట్టు చేయాలి. - రవికుమార్, షాపూర్‌నగర్ ఎక్కడా మారడం లేదు.. చిల్లర దొరకాలంటే గగనతరంగా మారింది. 4 వేల పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంక్‌కు వెళ్తే రెండు రూ.2వేల నోట్లు ఇచ్చారు. వీటిని ఎక్కడ మార్చుకోవాలో అర్థం కావడం లేదు. కిరాణా దుకాణం, ఇతర మాల్స్‌లో కూడా చిల్లర తెమ్మంటున్నారు, సరుకులు ఇవ్వడం లేదు. బ్యాంకర్లు వంద రూపాయల నోట్లను కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. - శ్రీదేవి, శ్రీసారుు కాలనీ అనుమానిస్తున్నారు.. కొత్త నోట్లను కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేందుకు ప్రయత్నిస్తే తీసుకునేందుకు భయపడుతున్నారు. అసలివా.. నకిలీవా అని ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పినా నమ్మడం లేదు. వెంటనే పంపిణీ సమస్య లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కొత్త నోట్లను త్వరితగతిన పంపిణి చేయాలి. కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చినా వాటిని మార్చుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. - శంకర్, చింతల్ -
కొత్త నోట్లు వచ్చేశాయ్!
అనంతపురం అగ్రికల్చర్ : కొత్తనోట్లు జిల్లాకొచ్చేశాయి. రూ.2,000, రూ.500 నోట్లను బుధవారం ఉదయమే రెండు లారీల్లో చెక్కపెట్టెల్లో భద్రపరిచి తీసుకొచ్చారు. ఈ నోట్లను స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ భద్రపరిచారు. చాలా బ్యాంకులకు బుధవారం రాత్రి ఈ నోట్లు చేరాయని, వీటితో పాటు రూ.100 నోట్లు కూడా వచ్చాయని తెలిసింది. అయితే.. బ్యాంకర్లు అధికారిక సమాచారం ఇవ్వడంలేదు. గురువారం బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయని, ఏటీఎం కేంద్రాలు మాత్రం ఉండవని వారు తెలిపారు.