
కొత్త నోట్లు వచ్చేశాయ్!
అనంతపురం అగ్రికల్చర్ : కొత్తనోట్లు జిల్లాకొచ్చేశాయి. రూ.2,000, రూ.500 నోట్లను బుధవారం ఉదయమే రెండు లారీల్లో చెక్కపెట్టెల్లో భద్రపరిచి తీసుకొచ్చారు. ఈ నోట్లను స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్ల నడుమ భద్రపరిచారు. చాలా బ్యాంకులకు బుధవారం రాత్రి ఈ నోట్లు చేరాయని, వీటితో పాటు రూ.100 నోట్లు కూడా వచ్చాయని తెలిసింది. అయితే.. బ్యాంకర్లు అధికారిక సమాచారం ఇవ్వడంలేదు. గురువారం బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయని, ఏటీఎం కేంద్రాలు మాత్రం ఉండవని వారు తెలిపారు.