
అసలు నోట్లను గుర్తించండిలా..
కొత్త రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చాలామందికి అందుబాటులోకి కూడా రాకముందే పలు చోట్ల నకిలీ నోట్లు చెలామణిలోకి రావడం సామాన్యులకు దడ పుట్టిస్తోంది. పెద్ద నోట్ల మార్పిడికి ప్రజలు ఓ వైపు బ్యాంకులు, పోస్టు ఆఫీసుల ముందు బారులు తీరుతుంటే.. కొందరు కేటుగాళ్లు ఇదే అదునుగా నకిలీ నోట్లను చెలామణిలోకి తెస్తున్నారు. దీంతో ఏవి అసలువో, ఏవి నకిలీవో తెలియక ప్రజలు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కింది సూచనలతో అసలు నోట్లను గుర్తించవచ్చు.
ముందు భాగం
కొత్త రూ.2 వేల నోటు ముదురు గులాబీ రంగులో ఉంటుంది. పొడవు 66 మి.మీ, వెడల్పు 166 మి.మీ.గా ఉంటుంది.
ముందు భాగం
1. లైటు వెలుతురులో రూ.2000 సంఖ్యను గమనించవచ్చు.
2. నోటును కొంచెం వొంచి చూస్తే 2000 సంఖ్య కనిపిస్తుంది.
3. దేవ నాగరి లిపిలో రూ.2000 సంఖ్య రాసి ఉంటుంది.
4. మహాత్మా గాంధీ బొమ్మ మధ్య భాగం వైపునకు ఉంటుంది.
5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 ఉంటారుు.
6. నోటును ఏటవాలుగా పట్టుకుంటే దారం పోగు ఆకుపచ్చ రంగు నుంచి నీలం రంగుకు మారుతుంది.
7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు.
8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్
9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలు ఎడమ నుంచి కుడికి పెద్దవి అవుతూ కనిపిస్తారుు.
10. కింది భాగంలో కుడివైపున రూపారుు చిహ్నంతో సహా రంగు మారే సిరాతో (ఆకుపచ్చ నుంచి నీలం) 2000 ఉంటుంది.
11. కుడి వైపున అశోక స్థూపం చిహ్నం
అంధుల కోసం
12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.2000 సంఖ్య ఉన్న దీర్ఘచతురస్రాకారం ఉంటుంది.
13. కుడి వైపున, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముంద్రించిన ఏడు చిన్న చిన్న గీతలు ఉంటాయి.
వెనుక భాగం
14. నోటు ముద్రించిన సంవత్సరం ఎడమ వైపున ఉంటుంది.
15. నినాదంతో సహా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది.
16. మధ్య భాగంలో వివిధ భాషల ప్యానల్ ఉంటుంది.
17. మార్‌సపైకి ఇస్రో చేపట్టిన ప్రయోగాన్ని ప్రతిబింబిస్తూ మంగళయాన్ చిత్రం ముద్రించారు.