సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్‌లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది.
రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు.
ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో..
2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment