Rs 500 notes
-
ఆ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు ఫేక్? ఇదిగో క్లారిటీ..
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్‌లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
రూ.88 వేల కోట్లు మిస్సింగ్! అన్నీ రూ.500 నోట్లు..
భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032.5 కోట్లు గల్లంతయ్యాయి. అన్నీ రూ.500 నోట్లు. ప్రింట్ అయ్యాయి కానీ ఆర్బీఐకి చేరలేదు. ఏమయ్యాయి ఈ నోట్లన్నీ? మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి. ప్రింట్ అయినవెన్ని.. ఆర్బీఐకి చేరినవెన్ని? దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. దేశంలోని ఈ మూడు మింట్‌లూ కొత్తగా డిజైన్ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే. గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్‌లో 2015 ఏప్రిల్ - 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి. సీఈఐబీ, ఈడీలకు లేఖలు కరెన్సీ నోట్ ప్రెస్‌లలో ప్రింట్ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు మనోరంజన్ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. -
రూ. 500 నోట్ల రద్దు.. నిజమేనా?
భారతదేశంలో ప్రస్తుతం నోట్ల రద్దు, ఉపసంహరణ మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. రూ. 2000 నోట్ల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా రూ. 500 నోట్లను కూడా రిజర్వ్ బాంక్ అఫ్ ఇండియా రద్దు చేస్తుందని లేదా ఉపసంహరించుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శక్తికాంత దాస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రూ. 500 నోట్ల రద్దు & ఉపసంహరణకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటి వరకు ఈ విషయంపై ఆర్బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటి ఆలోచన కూడా లేదని తెలిసింది. అంతే కాకుండా రూ. 1000 నోట్లను మళ్ళీ ప్రవేశపెట్టే ఉద్దేశ్యం అసలే లేదని వెల్లడించారు. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) రూ. 500 నోట్ల రద్దు మీద జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని శక్తికాంత దాస్ వెల్లడించారు. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇచ్చారు. ఇప్పటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 50 శాతం వెనక్కి వచ్చాయని దాస్ తెలిపారు. తిరిగి వచ్చిన నోట్ల విలువ సుమారు రూ.1.82 లక్షల కోట్లు. చెలామణిలో ఉన్న రెండు వేల నోట్ల విలువ రూ. 3.62 లక్షల కోట్లు అని గతంలోనే వెల్లడించారు. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) తిరిగి వచ్చిన రూ. 2,000 నోట్లలో 85 శాతం నోట్లు బ్యాంకు డిపాజిట్లుగా, మిగిలినవి మార్పిడి కోసం వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 2023 మే 19న ఆర్బీఐ రెండు వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడికి లేదా డిపాజిట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30 చివరి రోజు అని కూడా అప్పుడే తెలిపింది. -
ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..
గాంధీనగర్: పెళ్లి వేడుకలో కెరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రెండు అంతస్తుల భవనంపై నుంచి రూ.500 నోట్లు విసిరాడు. దీంతో అక్కడున్న వారు వీటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. గజరాత్ కేక్రి తససీల్దార్ పరిధిలోని సెవాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నోట్లు విసిరింది మాజీ సర్పంచ్ అని తెలుస్తోంది. ఆయన మేనల్లుడి పెళ్లి సందర్భంగా ఆనందంలో ఇలా చేశారు . మొత్తం రూ.5లక్షలకు పైనే మేడపైనుంచి వెదజల్లినట్లు సమాచారం. #SorosGang भिखारी ए भारत हे तेरे वाहा filmo मे रुपीया उडते हे 🤣🤣🤣 गुजरात मेहसाणा pic.twitter.com/T7lKnK8AnA — akshaypatel (@akshayhspatel) February 18, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు షాక్ అయ్యారు. మరికొందరేమో గుజరాత్లో ఇది సాధారణమే అన్నారు. గతంలోనూ ఓ ఈవెంట్లో సింగర్‌పై రూ.50 లక్షలను వెదజల్లిన విషయాన్ని గుర్తుచేశారు. చదవండి: 18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు.. -
రూ.500 నోట్ల ప్రింటింగ్ పెంపు
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న నగదు కొరతను తగ్గించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. 500 రూపాయల కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ను ఐదు సార్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టు కరెన్సీ సరఫరాను మరింత పెంచేందుకు మేము చర్యలు తీసుకుంటున్నాం. ఉదాహరణకు రోజుకు 500 కోట్ల రూ.500 నోట్ల ప్రింటింగ్‌ను చేపడుతుంటే, ఈ ఉత్పత్తిని ఐదింతలు పెంచేందుకు చర్యలు తీసుకున్నాం’ అని గార్గ్ చెప్పారు. దేశంలో పలు ప్రాంతాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే రిపోర్టులపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. వచ్చే రెండు రోజుల్లో రోజుకు రూ.2500 కోట్ల విలువైన 500 రూపాయల నోట్లను సరఫరా చేయనున్నట్టు తెలిపారు. దీంతో నెలకు సరఫరా రూ.70వేల కోట్ల నుంచి రూ.75వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. ఈ నోట్లు డిమాండ్‌ను మించిపోనున్నట్టు చెప్పారు. డిమాండ్‌కు మించి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కరెన్సీ స్టాక్ ఉందని, గత కొన్ని రోజులుగా ఈ నగదును సిస్టమ్‌లోకి పంపించామని, ఇంకా రూ.1.75 లక్షల కోట్ల రిజర్వులు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్నారు. కానీ గత రెండు నెలల నుంచి అసాధారణంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ అసాధారణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో చోటు చేసుకుందని ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ కూడా చేశారు. అటు పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రూ.2000 నోట్ల సరఫరాను తగ్గించేసింది
పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి నోటు రూ.2000 కరెన్సీ నోటే. డీమానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత ఈ నోట్లనే ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావడంతో ప్రజలు చిల్లర దొరకక నానా కష్టాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది. 2000 రూపాయి నోట్ల సరఫరాను తగ్గించి, ఆర్బీఐ ఎక్కువగా కొత్త రూ.500 నోట్ల సరఫరాపై దృష్టిసారించినట్టు ఈ రిపోర్టు నివేదించింది. '' ప్రస్తుతం ఎక్కువగా రిజర్వు బ్యాంకు నుంచి ఎక్కువ విలువ కలిగిన నోట్లలో 500 రూపాయి నోట్లే ఎక్కువగా వస్తున్నాయి'' అని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ చెప్పారు. కేవలం 2000 రూపాయి నోట్లను రీసర్క్యూలేషన్ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదన్నారు. ప్రతి ఏటీఎంలలో నగదును స్టోర్ చేయడానికి నాలుగు క్యాసెట్లు ఉంటాయని, ఒకవేళ ఒక క్యాసెట్ 2000 రూపాయి నోట్లను కలిగిఉంటే ఆ మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. అదేవిధంగా ఒకవేళ ఆ క్యాసెట్‌ను రూ.500 నోట్లతో నింపితే, మెషిన్ సామర్థ్యం రూ.25 లక్షలకు పడిపోతుందని వెల్లడైంది. కానీ కస్టమర్లకు తేలికగా చిల్లర దొరకడానికి, ఏటీఎంల వద్ద సామర్థ్యం తగ్గినప్పటికీ, చిన్న కరెన్సీ నోట్లు రూ.500 నోట్లనే ఎక్కువగా సరఫరా చేయాలని ఆర్బీఐ దృష్టిసారించిందని తెలిసింది. ప్రీ-డీమానిటైజేషన్ సమయంలో ఉన్న నగదు కంటే తక్కువగానే ప్రస్తుతం మార్కెట్లో నగదు ఉంది. సెంట్రల్ బ్యాంకు త్వరలోనే చిల్లర సమస్యను మరింత తగ్గించడానికి కొత్త రూ.200 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుంది. కానీ ఆ నోట్లను ఆర్బీఐ ఏటీఎంల ద్వారా అందించదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. -
త్వరలో కొత్త రూ.500 నోట్లు
ముంబై: మరో దఫా రూ.500 నోట్లు త్వరలో చలామణిలోకి రానున్నాయి. 2017లో ముద్రిం చిన ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లోనే వెలువడనున్నాయి. ఈ మేర కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం ఒక ప్రకటన చేసింది. ‘రెండు నంబర్ ప్యానెళ్లలో ‘ఏ’ అక్షరం, ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం, వెనక వైపు ముద్రిత సంవత్సరం ‘2017’తో కూడిన నోట్లను జారీచేయబోతున్నాం’ అని ఆర్బీఐ తెలిపింది. అవసరాలకు అనుగుణంగా మహాత్మా గాంధీ సిరీస్‌లో విడుదలవుతున్న రూ.500 నోట్ల పరంపరలోనే కొత్త నోట్లు రాబోతున్నట్లు వెల్లడించింది. ఇక డిజైన్ ప్రకారం చూస్తే... ఈ నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల మాదిరిగానే ఉంటాయని పేర్కొంది. -
కొత్త పెద్ద నోట్లను క్రమంగా ఉపసంహరించాలి
చెన్నై: ఎకానమీలో నగదు పరిమాణాన్ని తగ్గించే దిశగా.. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,000, రూ. 500 నోట్లను కొన్నాళ్ల తర్వాత క్రమంగా ఉపసంహరించాలని కేంద్ర రెవెన్యూ శాఖ మాజీ కార్యదర్శి ఎంఆర్ శివరామన్ సూచించారు. నగదు–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి 13 శాతం స్థాయిలో ఉండటం సరికాదని, ఇన్నాళ్లూ ఆర్బీఐ పాటించిన నగదు ఎకానమీ విధానాలను ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే మూడేళ్లలో నగదు–జీడీపీ నిష్పత్తిని 7 శాతానికి తగ్గించే క్రమంలో కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లను క్రమంగా ఉపసంహరిస్తామని, కేవలం రూ.100 అంతకన్నా తక్కువ విలువ గల నోట్లే చలామణీలో ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని శివరామన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో విఫలమైన కేంద్రం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వసించి క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ పేమెంట్స్ వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు సాధనాల వినియోగం గణనీయంగానే ఉంటుంది కనుక పట్టణ ప్రాంతాల్లో నగదు సరఫరాను తగ్గించి.. గ్రామీణ ప్రాంతాల్లో పెంచాలని శివరామన్ తెలిపారు. -
ఇక రూ.500 నోట్లపై దృష్టి పెడతాం
న్యూఢిల్లీ: నోట్ల సమస్య రోజురోజుకు తగ్గిపోతోందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. ఇప్పటి వరకు రూ.2000 నోట్లు ముద్రించడంపైనే దృష్టి సారించామని, ఇక నుంచి రూ.500 నోట్లను ఎక్కువగా ప్రింట్ చేస్తామని చెప్పారు. 50శాతం నోట్లను ఇప్పటికే మార్చేశామని ఆయన చెప్పారు. కోపరేటివ్ బ్యాంకులకు కూడా డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అలాగే, దూర ప్రాంతాలకు విమానాల్లో డబ్బు పంపిస్తున్నామన్నారు. ఇప్పుడు వస్తున్న కొత్త నోట్లు పూర్తిగా సురక్షితమని ఆయన స్పష్టం చేశారు. తక్కువ మొత్తాల్లో విత్ డ్రా చేసుకునే వారికోసం రూ.100 నోట్లను ఏడాదికి పంపించేన్ని నోట్లను కేవలం ఐదు వారాల్లోనే మూడింతలు బ్యాంకులకు పంపిచామని చెప్పారు. దేశంలో మొత్తం రెండులక్షల 20 వేల ఏటీఎంలు ఉన్నాయని, వాటిలో రెండులక్షల ఏటీఎంలలో సాఫ్ట్వేర్ ఇప్పటికే అవసరానికి తగినట్లుగా మార్చడం జరిగిందన్నారు. అక్రమంగా డబ్బు నిల్వలు ఉంచిన వారిపై, పెద్ద మొత్తంలో నల్లధనం కూడబెట్టిన వారిపై, బ్యాంకు అధికారులపై ఈడీ చర్యలు తప్పక ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈడీ అందుకే అనూహ్య దాడులు చేస్తోందని, వీటిని సర్జికల్ స్ట్రైక్స్ అనుకోవచ్చని చెప్పారు. -
రూ.500 నోట్లు వచ్చాయోచ్!
చెన్నైకు విమానంలో రూ. 320 కోట్లు చిల్లర నాణేలు కూడా కష్టం కొంతైనా తీరేనా? సాక్షి, చెన్నై: చిలర్ల కష్టాలు కొంతైనా తీరేనా..! అన్న ఎదురు చూపులు తమిళనాడు రాష్ట్రంలో పెరిగాయి. ఇందుకు తగ్గట్టుగా శనివారం చెన్నైకు విమానంలో రూ. 500 కొత్త నోట్ల రూ. 320 కోట్ల మేరకు వచ్చి చేరాయి. అలాగే, సేలంకు రూ. కోటి విలువగల రూ.5, రూ.10 నాణేలు వచ్చాయి. రాష్ట్రంలో ఒకటో తేదీ నుంచి చిల్లర సమస్య మరింత జఠిలంగా మారిన విషయం తెలిసిందే. ఏటీఎంలకు వెళ్లినా, బ్యాంకులకు వెళ్లినా రూ. 2వేల నోట్లే ఇస్తుండడంతో చిల్లర సమస్య మరింతగా పెరిగింది. ఏ షాపునకు వెళ్లినా చిల్లర దొరకని దృష్ట్యా, జనం పాట్లు అంతా, ఇంతా కాదు. ఈ కొరతను అధిగమించేందుకు రూ. ఐదు వందల నోట్లు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూపుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాసిక్ నుంచి విమానంలో చెన్నైకు ఐదు వందల నోట్లు వచ్చి చేరాయి. ఉదయాన్నే మీనంబాక్కం విమానాశ్రయం కార్గోకు ఈ నోట్లు చేరుకున్నాయి. రిజర్వు బ్యాంక్ వర్గాలు, పోలీసు యంత్రాంగం నిఘా నడుమ నాలుగు కంటైనర్లలోకి నోట్ల కట్టలతో ఉన్న బాక్సుల్ని చేర్చారు. అక్కడి నుంచి గట్టి భద్రత నడుమ రిజర్వు బ్యాంక్ కార్యాలయానికి తరలించారు. అన్ని ఏటీఎంలలో పొందు పరిచేందుకు, బ్యాంకుల్లో పంపిణీ నిమిత్తం తరలించేందుకు రిజర్వు బ్యాంక్ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం రూ. ఐదు వందల కొత్త నోట్లు జనం చేతికి చేరే అవకాశాలు ఉన్నాయి. సేలంకు రూ. కోటి విలువగల రూ. ఐదు, రూ.పది నాణేలను తరలించారు. అక్కడి బ్యాంక్‌లకు ఈ చిల్లరను గట్టి భద్రత నడుమ చేర్చారు. రిజర్వు బ్యాంక్ నిబంధనల్ని ఉల్లంఘించి బ్యాంకులు వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు బయలు దేరాయి. గృహ, వాహన రుణాలను ముక్కు పిండి మరీ వసూళ్లు చేసే పనిలో పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, శనివారం కూడా బ్యాంక్‌ల వద్ద, ఏటీఎంల వద్ద జనం బారులు తీరక తప్పలేదు. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఆందోళనలు సాగాయి. మన్నార్ కుడికి చెందిన రైతు అశోకన్(55) బ్యాంకు కూలీ. నిలబడి నిరసించి స్పృహ తప్పాడు. ఆసుపత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. -
కొట్టేసిన పర్సులో ఆ నోట్లు చూసి...
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే... దొంగలు కూడా ఆ నోట్ల దొంగతనానికి వెనక్కి తగ్గుతున్నారు. గ్రేటర్ నోయిడాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేసిన దొంగలు అసలు పట్టుబడకుండా తప్పించుకుని పారిపోతారు. కానీ గ్రేటర్ నోయిడాలో దొంగలు మాత్రం, కొట్టేసిన పర్సును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. దీనికి ప్రధాన కారణమేమిటో తెలుసా? ఆ పర్సులో అన్నీ ఐదు వందల రూపాయల నోట్లు ఉండటమే. వికాస్ కుమార్...గ్రేటర్ నోయిడా కన్స్ట్రక్షన్ సైట్లో కూలీగా పనిచేస్తున్నాడు. పని అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్‌గా బస్ స్టాండు సమీపంలోకి రాగానే, ఓ ఇద్దరు దొంగలు అతని పర్సును కొట్టేసి, పరిగెత్తుకుని పారిపోయారు. అయితే అతని పర్సులో ఉన్న మూడు నోట్లు ఐదువందల రూపాయలవే ఉన్నాయి. పర్సును అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తారేమోనని వికాస్ వెతుకుతుండగానే.. ఆశ్చర్యంగా ఆ దొంగలే అతని ముందు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి వికాస్ ఒక్కసారిగా షాకయ్యాడు. పర్సులో అన్నీ ఐదువందల నోట్లే ఉన్నాయి... రూ.100 నోట్లు ఎందుకు పెట్టుకోలేదంటూ ఆ దొంగలు వికాస్‌పై దాడికి పాల్పడి పర్సును వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ సంఘటనపై ఇప్పటి వరకు తమవద్ద ఎలాంటి ఫిర్యాదు నమోదుకాలేదని, ఒకవేళ బాధితుడు తమల్ని ఆశ్రయిస్తే, దీనిపై విచారణ చేపడతామని కస్నా పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ సుధీర్ కుమార్ త్యాగి తెలిపారు. కాగ, బ్లాక్‌మనీపై ఉక్కుపాదంగా, నకిలీ కరెన్సీని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పటిష్టమైన భద్రతా ఫీచర్లతో 500, 2000 కొత్త నోట్లను నేటి నుంచి జారీచేయడం ప్రారంభించారు.