ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం.. | Gujarat Sarpanch Showers Rs 500 Notes from Terrace Viral Video | Sakshi
Sakshi News home page

ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం..

Published Sun, Feb 19 2023 11:33 AM | Last Updated on Sun, Feb 19 2023 11:44 AM

Gujarat Sarpanch Showers Rs 500 Notes from Terrace Viral Video - Sakshi

గాంధీనగర్‌: పెళ్లి వేడుకలో కెరెన్సీ నోట్ల వర్షం కురిపించి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రెండు అంతస్తుల భవనంపై నుంచి రూ.500 నోట్లు విసిరాడు. దీంతో అక్కడున్న వారు వీటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. 

గజరాత్ కేక్రి తససీల్దార్ పరిధిలోని సెవాడా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నోట్లు విసిరింది మాజీ  సర్పంచ్‌ అని తెలుస్తోంది. ఆయన మేనల్లుడి పెళ్లి సందర్భంగా ఆనందంలో ఇలా చేశారు . మొత్తం రూ.5లక్షలకు పైనే మేడపైనుంచి వెదజల్లినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు షాక్ అయ్యారు. మరికొందరేమో గుజరాత్‌లో ఇది సాధారణమే అన్నారు. గతంలోనూ ఓ ఈవెంట్‌లో సింగర్‌పై రూ.50 లక్షలను వెదజల్లిన విషయాన్ని గుర్తుచేశారు.
చదవండి: 18.82 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement