Rs 500 Notes Worth Rs 88,032 Crore Missing From Indian Economy Report - Sakshi
Sakshi News home page

Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్‌! ఏమయ్యాయి?

Published Sat, Jun 17 2023 4:18 PM | Last Updated on Sat, Jun 17 2023 4:46 PM

rs 500 notes worth rs 88032 crore missing from indian economy report - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032.5 కోట్లు గల్లంతయ్యాయి. అన్నీ రూ.500 నోట్లు. ప్రింట్‌ అయ్యాయి కానీ ఆర్బీఐకి చేరలేదు. ఏమయ్యాయి ఈ నోట్లన్నీ? మనోరంజన్‌ రాయ్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి.

ప్రింట్‌ అయినవెన్ని.. ఆర్బీఐకి చేరినవెన్ని?
దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే యూనిట్లు మూడు ఉన్నాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్, నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. 

దేశంలోని ఈ మూడు మింట్‌లూ కొత్తగా డిజైన్‌ చేసిన రూ.500 నోట్లను 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో ఆర్బీఐకి చేరినవి 7,260 మిలియన్లు మాత్రమేనని మనోరంజన్‌ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే రూ. 88,032.5 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల రూ.500 నోట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. 

ఆర్టీఐ గణాంకాల ప్రకారం.. 2016-2017లో నాసిక్ మింట్  1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను ఆర్‌బీఐకి సరఫరా చేసింది. మూడు మింట్‌ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే ఆర్బీఐకి అందినవి మాత్రం 7260 మిలియన్ నోట్లే.

గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్‌లో 2015 ఏప్రిల్ - 2016 మార్చి మధ్య ముద్రితమయ్యాయి. ఆర్టీఐ ప్రకారం.. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఈ నోట్లు ఆర్బీకి సరఫరా అయ్యాయి.

సీఈఐబీ, ఈడీలకు లేఖలు
కరెన్సీ నోట్‌ ప్రెస్‌లలో ప్రింట్‌ అయిన నోట్లు, ఆర్బీఐకి చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు మనోరంజన్‌ రాయ్ లేఖలు కూడా రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరాలో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యత సాధారణమే అని కొందరు సీనియర్ ఆర్‌బీఐ అధికారులు సమర్థించినట్లుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement