కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో కొత్త పన్ను విధానం కింద రూ.12 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు TDS మినహాయింపు రూ. 50వేల నుంచి రూ. 1లక్షకు పెంచారు. ఇక త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను వెల్లడించనుంది.
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని.. ద్రవ్య విధాన కమిటీ ఫిబ్రవరి 4 నుంచి కీలక చర్చలను నిర్వహించనుంది. మల్హోత్రా కీలక రేట్లలోని మార్పును ఫిబ్రవరి 7న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అందరి చూపు దీనిపైనే ఉంది. ఆ రోజు BPS రేటు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంటే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
శక్తికాంత దాస్ పదవీ విరమణ తరువాత.. సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్ బాధ్యతలు స్వీకరించారు. మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరగనున్న మొదటి ఎంపీసీ (Monetary Policy Committee) అవుతుంది. రేటు తగ్గింపు గురించి చాలా అంచనాలు ఉన్నప్పటికీ, సెంట్రల్ బ్యాంక్ పెంచడానికి క్లిష్టమైన చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ చర్చలు ఫిబ్రవరి 4 నుంచి 7 మధ్య జరగనున్నాయి. రెపో రేటుకు సంబంధించి అధికారిక ప్రకటన ఫిబ్రవరి 7 ఉదయం 10:00 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. గవర్నర్ మల్హోత్రా మధ్యాహ్నం 12:00 గంటలకు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత భారత ఆర్థిక స్థితి, కేంద్ర బడ్జెట్ 2025పై తన ఆలోచనల వెనుక గల కారణాల గురించి మాట్లాడతారు.
Comments
Please login to add a commentAdd a comment