త్వరలో కొత్త రూ.500 నోట్లు
ముంబై: మరో దఫా రూ.500 నోట్లు త్వరలో చలామణిలోకి రానున్నాయి. 2017లో ముద్రిం చిన ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లోనే వెలువడనున్నాయి. ఈ మేర కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ఒక ప్రకటన చేసింది.
‘రెండు నంబర్ ప్యానెళ్లలో ‘ఏ’ అక్షరం, ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం, వెనక వైపు ముద్రిత సంవత్సరం ‘2017’తో కూడిన నోట్లను జారీచేయబోతున్నాం’ అని ఆర్‌బీఐ తెలిపింది. అవసరాలకు అనుగుణంగా మహాత్మా గాంధీ సిరీస్‌లో విడుదలవుతున్న రూ.500 నోట్ల పరంపరలోనే కొత్త నోట్లు రాబోతున్నట్లు వెల్లడించింది. ఇక డిజైన్ ప్రకారం చూస్తే... ఈ నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్ల మాదిరిగానే ఉంటాయని పేర్కొంది.