Rs 500 note
-
ఆ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు ఫేక్? ఇదిగో క్లారిటీ..
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. -
పాత 500 నోటు నుంచి విద్యుత్ ఉత్పత్తి!!
మోదీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో తమవద్ద కట్టలకొద్దీ ఉన్న నోట్లను ఏం చేసుకోవాలో తెలియక చాలామంది తల బద్దలుకొట్టుకుంటే, ఒడిసాలోని నౌపడ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి మాత్రం.. వాటి నుంచి విద్యుత్తు తయారుచేసే టెక్నిక్ కనుగొన్నాడు. అతడి వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షించింది. చివరకు ప్రధానమంత్రి కార్యాలయం కూడా అర్జంటుగా ఈ విషయంపై ఒక ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖను ఆదేశించింది. ఒకే ఒక్క 500 రూపాయల నోటు నుంచి 5 వోల్టుల వరకు విద్యుత్తు వస్తుందని ఖరియార్ కాలేజిలో చదివే లచ్మన్ దుండి అనే ఈ విద్యార్థి చెప్పాడు. నోటు మీద ఉన్న సిలికాన్ కోటింగు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఆ కోటింగ్ బాగా కనిపించేందుకు తాను నోటును చించానని, దానికి నేరుగా సూర్యరశ్మి తగిలేలా చేసి, సిలికాన్ ప్లేటును విద్యుత్ వైరు సాయంతో ట్రాన్స్ఫార్మర్కు కలిపానని, దాంతో విద్యుత్ పుట్టిందని వివరించాడు. ఈ విషయాన్ని ఒకసారి తనిఖీ చేయాలని ఏప్రిల్ 12వ తేదీన ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మే 17న ఒడిషా ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను స్వయంగా వెళ్లి దుండీ ప్రాజెక్టు చూసి ఒక నివేదికను పీఎంఓకు పంపాలని తెలిపింది. సిలికాన్ ప్లేటు నుంచి వచ్చే విద్యుత్తును నిల్వచేసేందుకు ఒక ట్రాన్స్ఫార్మర్ను తయారుచేశానని, తన ఆవిష్కరణను ప్రధాని కార్యాలయం మెచ్చుకుంటే చాలా సంతోషిస్తానని అంటున్నాడు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించవచ్చని ఆలోచించానని, నోటును కాస్త చించి చూస్తే అందులో సిలికాన్ ప్లేట్ కనిపించిందని, అక్కడినుంచి తన పరిశోధన మొదలుపెట్టి, విజయవంతంగా విద్యుత్ తయారు చేశానని వివరించాడు. మొదట్లో తన కాలేజీలో దీన్ని ప్రదర్శించినపుడు అతడిని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి లేఖలు రాయడంతో అతడి విషయం వెలుగులోకి వచ్చింది. -
నీళ్లలో పడి రూపం కోల్పోయిన రూ. 500 నోటు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్ లైన్ లో సంచలనం చేశాయి. కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా, కాదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు వెలిసిపోలేదు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించిన విషయం తెలిసిందే. ఇక పరీక్షలకు కొత్త రూ.500 నోటు వంతు వచ్చింది. కానీ ఈ సారి పరీక్ష కావాలని చేయకపోయిన ప్రమాదవశాత్తు జరిగింది. శంకరమఠం ఏరియా వాసి, హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గురువారం ఏటీఎం నుంచి డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని ఆందోళన చెందాడు. కానీ, కొన్ని చోట్ల వేడి నీటిలో పరీక్షించినా నోటుకు ఏమీ కాలేదు. కొత్త రూ.500 నోటును పరీక్షించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. -
సామాన్యులపై సర్జికల్ దాడులు: డీకే అరుణ
హైదరాబాద్సిటీ: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీకి రాజకీయ ప్రయోజనాలకి మినహా..పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల్లో లాభపడటం కోసం జరిగిన కుట్రలో భాగమే నోట్ల రద్దు అంశమన్నారు. పెద్దనోట్ల రద్దు సామాన్యులపై సర్జికల్ దాడులు చేయడమేనని డీకే అరుణ అన్నారు. రూ.500 నోటు విడుదల చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారం రోజులు దాటినా పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. తన అవినీతి డబ్బుని మార్చుకోవడానికే ఢిల్లీ ఉన్న ప్రధాని దగ్గరికి సీఎం కేసీఆర్ వెళ్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దును సాకుగా చూపి పథకాలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. -
సీరియస్ సిచ్యువేషన్.. అల్లర్లు చెలరేగొచ్చు!
నగదు మార్పిడి లిమిట్ ను ఎందుకు తగ్గించారు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: పెద్దనోట్లు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, అల్లర్లు చెలరేగవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో నగదు బదిలీ పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఈ ఆకస్మిక నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ పలు హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని కోరింది. అయితే, పెద్దసంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయని, వివిధ హైకోర్టుల ముందు దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకొని విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది. -
రూ.500 నోటు మారక ఆత్మహత్యాయత్నం
కాకినాడ క్రైం : రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పెద్ద నోటు మారక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి...కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామానికి చెందిన దిమ్మల సత్తిబాబు (38) కూలి పనులు చేస్తుంటాడు. తనతో పాటు బావను కూడా కూలి పనిలోకి తీసుకెళ్తుంటాడు. కరెన్సీనోట్ల రద్దుతో, రూ.500 నోటు మారకపోవడంతో బావకు కూలీ సొమ్ము చెల్లించలేదు. డబ్బుల కోసం అక్క ఒత్తిడి చేయడంతో ఆవేదన చెందిన సత్తిబాబు పురుగుల మందును మద్యంలో కలుపుకొని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.