రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పెద్ద నోటు మారక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కరెన్సీనోట్ల రద్దుతో, రూ.500 నోటు మారకపోవడంతో బావకు కూలీ సొమ్ము చెల్లించలేదు. డబ్బుల కోసం అక్క ఒత్తిడి చేయడంతో ఆవేదన చెందిన సత్తిబాబు పురుగుల మందును మద్యంలో కలుపుకొని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.