not change
-
ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలతోపాటు ఉద్యోగార్ధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ప్రకారం.. ఇంటర్వ్యూలో పాల్గొన్న 47 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడడం లేదు. అంటే తాము పనిచేస్తున్న సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించారన్న మాట. 37 శాతం మంది 2023లో తమ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు ఈ నిపుణులను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. వాల్యూవాక్స్ 2023 జనవరి–ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,157 కంపెనీలు, 1,583 ఉద్యోగార్థులు పాలుపంచుకున్నారు. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో బలమైన భవిష్యత్ కనిపిస్తోంది. బీఎఫ్ఎస్ఐలో 71 శాతం, ఆరోగ్య సేవల్లో 64, నిర్మాణం, రియల్టీ 57, మీడియా, వినోదం 49, తయారీ 39, ఐటీ, ఐటీఈఎస్ 29 శాతం కంపెనీలు కొత్త వారిని చేర్చుకుంటున్నాయి. కొత్తగా జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య అక్టోబర్–డిసెంబర్‌తో పోలిస్తే 16 నుంచి 23 శాతానికి ఎగబాకింది. తాత్కాలిక ఉద్యోగులను పెద్దగా ఆమోదించడం కూడా ఈ ఏడాది జాబ్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు’ అని నివేదిక వివరించింది. -
యూపీలో కేబినెట్ విస్తరణ ఇప్పుడే కాదు: బీజేపీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మార్పులు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ఉపాధ్యక్షుడు, యూపీలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ఈ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి సరైన సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేపడ్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి మధ్య విభేదాలు నెలకొన్నాయనే ఊహాగానాలను కొట్టిపారేశారు. యూపీ ప్రభుత్వ, పార్టీ నాయకత్వాలను మార్చే అవకాశాలను తోసిపుచ్చారు. సీఎం, యూపీ బీజేపీ అధ్యక్షుడు ఇద్దరూ బాగానే పనిచేస్తున్నారన్నారు. ముగ్గురు మంత్రులు మరణించడంతో ఏర్పడిన ఖాళీలతో పాటు మిగతా ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అప్పుడే ప్రక్షాళన తప్పదని ఇటీవల వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాధామోహన్ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌ను వ్యక్తిగత కారణాలతో కలిశానని, కేబినెట్లో మార్పులకు సంబంధించి కాదని రాధామోహన్ సింగ్ తెలిపారు. మంత్రివర్గంలో కొన్ని ఖాళీలున్న విషయ వాస్తవమే అయినా, అవి అంత ముఖ్యమైన శాఖలకు సంబంధించినవి కావని వివరించారు. అందువల్ల కేబినెట్ విస్తరణ తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని తెలిపారు. -
రూ.500 నోటు మారక ఆత్మహత్యాయత్నం
కాకినాడ క్రైం : రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పెద్ద నోటు మారక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి...కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామానికి చెందిన దిమ్మల సత్తిబాబు (38) కూలి పనులు చేస్తుంటాడు. తనతో పాటు బావను కూడా కూలి పనిలోకి తీసుకెళ్తుంటాడు. కరెన్సీనోట్ల రద్దుతో, రూ.500 నోటు మారకపోవడంతో బావకు కూలీ సొమ్ము చెల్లించలేదు. డబ్బుల కోసం అక్క ఒత్తిడి చేయడంతో ఆవేదన చెందిన సత్తిబాబు పురుగుల మందును మద్యంలో కలుపుకొని తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. -
చీటర్లే
దేవరకొండ, న్యూస్‌లైన్ : చందంపేట మండలంలో కొందరు ఉపాధ్యాయుల తీరులో ఇంకా మార్పు రావడంలేదు. ఈ మండలంలో విద్యావ్యవస్థ తీరుపై ‘టీచర్లా.. చీటర్లా..?’ అనే శీర్షికన సాక్షిలో బుధవారం కథనం ప్రచురితమైనా పంతుళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో చాలావరకు పాఠశాలలు తెరుచుకోనేలేదు. అయితే, ‘సాక్షి’ కథనానికి స్పందించిన ఇన్చార్జి ఎంఈఓ పలు పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయన పర్యటనలో కూడా.. బడికి ఎగనామం పెట్టిన ఉపాధ్యాయుల తీరు బయటపడింది. ‘సాక్షి’ కూడా రెండు పాఠశాలలను సందర్శించింది. కొన్నిచోట్ల తెరుచుకున్న పాఠశాలలు గత కొన్ని రోజులుగా విధులకు డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులు బుధవారం హాజరయ్యారు. దీంతో మండలంలోని కలకొండతండా, కేతేపల్లి, మేఘావత్తండా, పందిరి గుండు తండా, ఇంద్రావత్ తండాలలోని ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. -
తెలంగాణపై నిర్ణయం మారదు
భీమ్‌గల్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమ్‌గల్ ఆర్టీసీ బస్టాండు ఆధునికీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీడబ్ల్యూసీ ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. అంతవరకు తెలంగాణవాదులందరూ ఓపికగా ఉం డాలన్నారు. సీమాంధ్రలో కొందరు ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణపై వెనక్కి చూసేది లేదని సోనియా చెప్పారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన ఘనత కేవలం సోనియాగాంధీకి మాత్రమే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ అభివృద్ధి పట్ల మం చి చిత్తశుద్ధి ఉన్న యువకుడన్నారు. ఆయన అమెరికాలో చూసిన అభివృద్ధిలో కొంతైనా ఇక్కడ సాధించాలన్న తపనతో ఉన్నాడని అన్నారు. డిపోతో సంబంధంలేకుండా ప్రజలకు రవాణా వసతిని కల్పిం చామ న్నారు. ఆర్టీసీ బస్సులు మనవని, వాటి ని వాడుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు. ఇప్పుడు వేసిన బస్సులు విజయవంతమైతేనే డిపో వస్తుందన్నారు. 40 ఏళ్ల తరబడి కలగన్న మెడికల్ కళాశాలను సాధించామన్నారు. అయినా దీనిపై నేను సంతోషంగాలేనని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిం చి, ప్రజలు ఎలాంటి వైద్యం కోసమైనా హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా చేసిననాడే తృప్తి పడతానని అన్నారు. అనంతరం బస్టాం డు ప్రాంగణంలోకి చేరుకుని పరిశీలించారు. జెండాలు ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, ఆర్టీసీ ఈ డీ పురుషోత్తం నాయక్, ఆర్ఎం కృష్ణకాంత్, ఆర్మూర్ డీఎం రాజమౌళి, స్థానిక సర్పంచ్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.