సామాన్యులపై సర్జికల్ దాడులు‌: డీకే అరుణ | dk aruna attacks government on demonetisation | Sakshi
Sakshi News home page

సామాన్యులపై సర్జికల్ దాడులు‌: డీకే అరుణ

Published Fri, Nov 18 2016 3:28 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

సామాన్యులపై సర్జికల్ దాడులు‌: డీకే అరుణ - Sakshi

సామాన్యులపై సర్జికల్ దాడులు‌: డీకే అరుణ

హైదరాబాద్‌సిటీ: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీకి రాజకీయ ప్రయోజనాలకి మినహా..పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల్లో లాభపడటం కోసం జరిగిన కుట్రలో భాగమే నోట్ల రద్దు అంశమన్నారు.

పెద్దనోట్ల రద్దు సామాన్యులపై సర్జికల్ దాడులు చేయడమేనని డీకే అరుణ అన్నారు. రూ.500 నోటు విడుదల చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారం రోజులు దాటినా పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. తన అవినీతి డబ్బుని మార్చుకోవడానికే ఢిల్లీ ఉన్న ప్రధాని దగ్గరికి సీఎం కేసీఆర్ వెళ్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దును సాకుగా చూపి పథకాలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement