Rs 1000 note
-
రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు...
సాక్షి, ముంబై : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, ఎనిమిది నెలలు కావొస్తోంది. 1000, 500 రూపాయి నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అంతేకాక రద్దు చేసిన 500 రూపాయి నోటును ప్రభుత్వం తిగిరి మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 1000 రూపాయి నోటును మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. అసలు 1000 రూపాయి నోటును ప్రజలు కావాలనుకుంటున్నారో? లేదో? తెలుసుకోవడం కోసం ఓ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు తిరిగి 1000 రూపాయి నోటును మార్కెట్లోకి రావాలని కోరుకుంటున్నారని తెలిసింది. హైదరాబాద్కు చెందిన స్థానిక భాష షార్ట్ న్యూస్ యాప్ వే2ఆన్లైన్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 1000 రూపాయి నోట్లు కావాలంటూ ప్రజలు తన స్పందన తెలియజేశారు. 62 శాతం మంది ప్రజలు నోట్ బ్యాన్ నుంచి వచ్చిన మార్పులతో సమస్యలు ఎదుర్కొనట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మార్పులతో తమకెలాంటి సమస్యలేదని 38 శాతం ప్రజలు తెలిపారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు ఆ రద్దుతో నిరూపయోగంగా మారాయి. ఇటీవల ఆర్బీఐ వెలువరించిన డేటాలో రద్దయిన 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్లోకి వచ్చినట్టు తెలిసింది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2000, రూ.500 నోట్లను ఎక్కువగా విడుదల చేయడంతో మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రూ.200 బ్యాంకు నోట్లను కూడా ఆర్బీఐ ప్రవేశపెట్టింది. -
సామాన్యులపై సర్జికల్ దాడులు: డీకే అరుణ
హైదరాబాద్సిటీ: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..బీజేపీకి రాజకీయ ప్రయోజనాలకి మినహా..పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల్లో లాభపడటం కోసం జరిగిన కుట్రలో భాగమే నోట్ల రద్దు అంశమన్నారు. పెద్దనోట్ల రద్దు సామాన్యులపై సర్జికల్ దాడులు చేయడమేనని డీకే అరుణ అన్నారు. రూ.500 నోటు విడుదల చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారం రోజులు దాటినా పెద్దనోట్ల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. తన అవినీతి డబ్బుని మార్చుకోవడానికే ఢిల్లీ ఉన్న ప్రధాని దగ్గరికి సీఎం కేసీఆర్ వెళ్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దును సాకుగా చూపి పథకాలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. -
సీరియస్ సిచ్యువేషన్.. అల్లర్లు చెలరేగొచ్చు!
నగదు మార్పిడి లిమిట్ ను ఎందుకు తగ్గించారు? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: పెద్దనోట్లు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పెద్దనోట్ల రద్దుతో దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉందని, అల్లర్లు చెలరేగవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో నగదు బదిలీ పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో మోదీ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఈ ఆకస్మిక నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ పలు హైకోర్టులలో దాఖలైన పిటిషన్లపై విచారణ నిలిపివేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దనోట్ల రద్దును సవాల్ చేస్తూ పలు రాష్ట్రాల హైకోర్టులలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులకు డబ్బులు తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్రం న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ నిలిపివేయాలని కోరింది. అయితే, పెద్దసంఖ్యలో దాఖలైన ఈ పిటిషన్లు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయని, వివిధ హైకోర్టుల ముందు దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయించుకొని విచారించాలని సుప్రీంకోర్టు సూచించింది.