బ్యాంక్ చెక్కుపై బ్లాక్ ఇంక్ నిషేధమా?: ఇదిగో క్లారిటీ.. | Is RBI Banned Cheques Written In Black Ink Check The details | Sakshi
Sakshi News home page

బ్యాంక్ చెక్కుపై బ్లాక్ ఇంక్ నిషేధమా?: ఇదిగో క్లారిటీ..

Published Sat, Jan 18 2025 7:57 PM | Last Updated on Sat, Jan 18 2025 9:15 PM

Is RBI Banned Cheques Written In Black Ink Check The details

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ''బ్యాంక్ చెక్కులను బ్లాక్ ఇంక్ (Black Ink)తో రాయకూడదు'' అని. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత? 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) నిజంగా ఈ ఆదేశాలను జారీ చేసిందా అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.

బ్యాంక్ చెక్కులపై బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని వస్తున్న వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలను జారీచేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. అంతే కాకుండా.. ఎలాంటి ఇంక్ వాడాలి అనేదానికి సంబంధించి తాజాగా ఎలాంటి ఆదేశాలు వెల్లడికాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే. కాబట్టి బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా బ్లాక్ ఇంక్ ఉపయోగించవచ్చని పీఐబీ వివరించింది.

సాధారణంగా బ్లూ లేదా బ్లాక్ వాడొచ్చని చెబుతారు. ఎందుకంటే ఇవి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. చదవడానికి కూడా బాగుంటుంది. చెక్కులపై, బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లను రాయడానికి బ్లాక్ లేదా బ్లూ వాడొచ్చు. అయితే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు ఇంక్ వాడకం నిషేధం. ఎందుకంటే దీనిని అనధికారికంగా గుర్తిస్తారు. అంతే కాకుండా పెన్సిల్ లేదా తుడిచిపెట్టగలిగే వాటిని కూడా ఉపయోగించడం నిషేధం. ఎందుకంటే వీటిని చెరిపేసి.. మార్చేసే అవకాశం కూడా ఉంది.

ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?

బ్యాంక్ చెక్ రాయడానికి బ్లాక్ ఇంక్ నిషేధం అనే వార్తను ఎవరూ నమ్మకండి. ఎందుకంటే ఆ వార్తలో నిజం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పీఐబీ వెల్లడించింది. ఏదైనా ఒక వార్తకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా మంచి పద్దతి కాదని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement