black colour
-
Anant Ambani Pre Wedding: రిలయన్స్ పెళ్లి వేడుకలో స్టార్స్ హంగామా (ఫోటోలు)
-
నల్లగా ఉన్నావంటూ భార్యతో గొడవ.. గొడ్డలితో భర్తను నరికింది
రాయ్‌గఢ్: భార్యను పదే పదే నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ వేధించాడో భర్త. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయితే ఈసారి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. అదే కసితో భర్తని ఒక్కవేటుతో గొడ్డలితో నరికి చంపింది. అంతేకాదు అతని మర్మాంగాలను సైతం ఛిద్రం చేసి.. ఆపై నేరం నుంచి తప్పించుకునే యత్నం చేసింది. ఛత్తీస్‌ఘడ్ దుర్గ్ జిల్లా అమలేశ్వర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంగీతకు, అనంత్ సోన్వానికి చాలాకాలం కిందట పెళ్లైంది. సంగీత.. అనంత్‌కు రెండో భార్య. అనంత్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి సంతానంతో కలిగిన కొడుకు.. సంగీత బిడ్డ, అనంత్.. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే.. పెళ్లైన నాటి నుంచే భర్త ఆమె రంగును ప్రస్తావిస్తూ.. అసహ్యంగా ఉన్నావంటూ వేధించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గతంలో చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఆదివారం రాత్రి కూడా అలాగే గొడవ జరగ్గా.. ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా భర్త మర్మాంగాలను గొడ్డలితో నరికి.. ముక్కలు చేసింది. భర్త శవం పక్కనే రాత్రంతా పడుకుని పోయిందామె. అయితే.. ఉదయం కాగానే భర్తని ఎవరో చంపారంటూ అరవడం ప్రారంభించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమదైన శైలిలో విచారించే సరికి సంగీత నేరం ఒప్పుకుంది. ఇదీ చదవండి: ఘోరం: కలుద్దామని పిలిచి... కత్తితో దాడిచేసిన ఇక్బాల్ షేక్ -
హీరోలకి బ్లాక్ కలర్ పులుముతున్న డైరెక్టర్స్!
క్యారెక్టర్ కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు కొందరు హీరోలు ‘నల్ల’గా మారిపోయారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు బ్లాక్ మేకప్‌తో కనిపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ లుక్ అంటూ విడుదలైన ఆ పోస్టర్లను చూసి, అభిమానులు ‘బ్లాక్.. కిర్రాక్’ అంటున్నారు. డిఫరెంట్ మేకప్‌తో కొందరు హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ కటౌట్‌కి ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బ్లాక్ కలర్ పులిమారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ సినిమా కోసమే ప్రభాస్ బ్లాక్ మేకప్ వేసుకున్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. రెండు పోస్టర్స్‌లో బ్లాక్ కలర్ నిండుగా ఉంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘సలార్’ సినిమా షూటింగ్ జరిగింది. సో.. ప్రభాస్ బ్లాక్ లుక్స్‌కు కథే కారణమని ఊహించ వచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ► ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లో నల్లని మేకప్‌లో ఎన్టీఆర్ ఫెరోషియస్‌గా కనిపించారు. ఇక హీరోగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమా ఆరంభమవుతుంది. ► హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో నాని ఫుల్ బ్లాక్ లుక్‌లో కనిపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సో.. ‘దసరా’ ఫస్ట్ లుక్ అలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ► కామెడీ హీరోగా, వీలైనప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ‘అల్లరి’ నరేశ్. కాగా 2021లో ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్ కనకమేడల మరో ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో ఫుల్‌గా మసి పూసుకుని ఉన్నారు నరేశ్. -
నల్లజాతీయులకు అండగా నలుపు కార్లతో రేస్
లండన్: ఫార్ములావన్ (ఎఫ్1) చాంపియన్ జట్టు మెర్సిడెజ్ నల్ల జాతీయులకు అండగా... జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్పందిం చింది. 2020 సీజన్లో పూర్తిగా తమ కార్లు నలుపుమయం కానున్నాయని ప్రకటించింది. నలుపు రంగు కార్లతో ఫార్ములావన్‌లో తమ రేసర్లు పాల్గొంటారని తెలిపింది. సహజంగా మెర్సిడెజ్ సంస్థ ఎప్పుడైనా సిల్వర్ కలర్ కార్లతో సర్క్యూట్లో దూసుకెళ్లెది. అయితే జాత్యాహంకారానికి, నల్లజాతీయులపై దమనకాండకు ముగింపు పలికే కార్యక్రమంలో భాగంగానే తాము ఈ సీజన్లో నలుపు కార్లతో బరిలోకి దిగుతున్నామని టీమ్ ప్రిన్సిపల్ టొటొ వోల్ఫ్ వెల్లడించారు. ‘ఇక వర్ణవివక్షపై మౌనముద్ర ఉండదు. ప్రపంచ క్రీడా వేదికపై మా గళం వినిపించేలా.... మా సంకల్పం ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో వస్తున్నాం. ఈ వివక్షను ఉపేక్షించం. జాత్యాహంకారం నశించిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం’ అని అన్నారు. ఈ ఆదివారం జరిగే ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్, అతని సహచరుడు బొటాస్ నలుపు కార్లతో ట్రాక్‌పై దూసుకెళ్లనున్నారు. -
కోడే కాదు గుడ్డు కూడా నలుపే !
సాక్షి, తలుపుల(అనంతపురం) : ఎక్కడైనా కోడి బొచ్చు నల్ల రంగులో ఉండడం చూసి ఉంటాం. అయితే బొచ్చుతో పాటు చర్మం, రక్తం చివరకు పెట్టే గుడ్డు కూడా నల్లగానే ఉంటే.. ఆశ్చర్యంగా ఉంది కదూ !. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అచ్ఛం ఆ రకం కోళ్లే. కడక్‌నాథ్ అని పిలువబడే ఈ రకం కోళ్లను కర్ణాటకలోని బాగేపల్లి నుంచి తలుపుల మండలం గొల్లపల్లితండాకు చెందిన యువరైతు మనోజ్ఞనాయక్ తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఈ రకం కోళ్లలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి గుడ్లు పెడతాయి కానీ, పిల్లలను పొదగవు. వీటి గుడ్లను మాములు కోళ్ల కింద పొదుగుకు పెట్టాల్సిందే. ఇక వీటి మాంసానికి డిమాండ్ కూడా భారీగా ఉన్నట్లు రైతు తెలుపుతున్నాడు. అది కూడా ఎంతంటే.. కిలో మాంసం దాదాపు రూ.700 చొప్పున గుంటూరు, కర్ణాటక ప్రాంతాల్లో అమ్ముడు పోతోందట. -
నెహ్రూ విగ్రహంపై నల్లరంగు
బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కట్వా పట్టణంలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి దుండగులు నలుపు రంగు పూశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు విచారణ ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, దీంతో తమకు సంబంధమే లేదని బీజేపీ స్పష్టం చేసింది. -
శ్రీపాదరావు విగ్రహానికి నల్లరంగు పూసిన దుండగులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మాజీ అసెంబ్లీ స్పీకర్ డి. శ్రీపాదరావు విగ్రహానికి ఆగంతకులు శనివారం అర్థరాత్రి నల్లరంగు పూశారు. ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ శ్రీపాదరావు విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను గుర్తించి కఠనంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
కారులో గంజాయి స్వాధీనం
చిట్టమూరు: మండలంలోని ఎల్లసిరి గ్రామంలో కారులో దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్చార్జి సీఐ రత్నయ్య కథనం మేరకు... ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఎల్లసిరిలో బ్లాక్ కలర్ ఉన్న ఫోర్డ్ ఫియోస్టో ఏపీ 16ఏఏ 4658 కారు అనుమానాస్పదంగా ఉండడంతో చిట్టమూరు ఎస్సై రవినాయక్‌కు సమాచారం అందింది. కారును పరిశీలించగా లాక్ చేసి ఉంది. దీంతో శుక్రవారం నెల్లూరు నుంచి కారు మెకానిక్‌ను పిలిపించి లాక్ ఓపెన్ చేశారు. తహశీల్దార్ వెంకట సునీల్ ఆధ్వర్యంలో కారులో ఉన్న 142 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి బ్లూ లగేజీ కవర్లలో ఒక్కో ప్యాకెట్లో సుమారు 2.5 కిలోలో ఉంది. మొత్తం 317 కిలోలు ఉందని, వీటి విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందన్నారు. తహశీల్దార్ఎన్డీపీఎస్ యాక్ట్ ద్వారా వివరాలు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. కారుకు రెండు నంబర్లు పేట్లు ఉన్నాయని, ఒకటి ఆంధ్రా రిజిస్ట్రేషన్ కాగా, వెనుక పక్క టీఎన్ 07.ఏఏ.3567 నెంబరు ఉందన్నారు. ఈ నెంబర్లు కూడా ఫేక్ అని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో గంజాయి లభించడంపై పలు అనుమానాలు: మండలంలో ఇంత వరకు గంజాయి దొరికిన దాఖలాలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఐదు రోజులుగా గ్రామం నడి బొడ్డున ఈ ప్రాంతం వారికి సంబంధాలు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో గంజాయితో సహా కారు వదిలి వెళ్లడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.