బుర్ద్వాన్: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లా కట్వా పట్టణంలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహానికి దుండగులు నలుపు రంగు పూశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు విచారణ ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, దీంతో తమకు సంబంధమే లేదని బీజేపీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment