సాక్షి, తలుపుల(అనంతపురం) : ఎక్కడైనా కోడి బొచ్చు నల్ల రంగులో ఉండడం చూసి ఉంటాం. అయితే బొచ్చుతో పాటు చర్మం, రక్తం చివరకు పెట్టే గుడ్డు కూడా నల్లగానే ఉంటే.. ఆశ్చర్యంగా ఉంది కదూ !. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అచ్ఛం ఆ రకం కోళ్లే. కడక్‌నాథ్ అని పిలువబడే ఈ రకం కోళ్లను కర్ణాటకలోని బాగేపల్లి నుంచి తలుపుల మండలం గొల్లపల్లితండాకు చెందిన యువరైతు మనోజ్ఞనాయక్ తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఈ రకం కోళ్లలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి గుడ్లు పెడతాయి కానీ, పిల్లలను పొదగవు. వీటి గుడ్లను మాములు కోళ్ల కింద పొదుగుకు పెట్టాల్సిందే. ఇక వీటి మాంసానికి డిమాండ్ కూడా భారీగా ఉన్నట్లు రైతు తెలుపుతున్నాడు. అది కూడా ఎంతంటే.. కిలో మాంసం దాదాపు రూ.700 చొప్పున గుంటూరు, కర్ణాటక ప్రాంతాల్లో అమ్ముడు పోతోందట.
Comments
Please login to add a commentAdd a comment