Kadaknath Chicken
-
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి..!
-
సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం.. భారీ లాభాల్లో బిజినెస్
గుణదల (విజయవాడ తూర్పు): మాంసాహార ప్రియులు సరికొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. మటన్, చికెన్, చేపలు, రొయ్యలను ఇష్టంగా భుజి స్తారు. నాటు కోడి, బ్రాయిలర్, పెద్ద బ్రాయిలర్ (పేరెంట్స్) కోళ్ల మాంసం మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు కడక్‌నాథ్ కోడి మాంసం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ధర ఎక్కువైనా మంచి పోషక విలువలతోపాటు రుచికరమైన ఈ మాంసాన్ని భుజించేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. కడక్‌నాథ్ కథ ఏమిటంటే.. కడక్‌నాథ్ రకానికి చెందిన కోళ్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. సాధారణంగా నాటుకోళ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లు వాటికి భిన్నంగా ఈకలే కాదు శరీరం కూడా నలుపు రంగులో ఉంటాయి. మెలనిన్ అనే హార్మోన్ కారణంగా ఈ కోళ్లు నలుపు రంగులో ఉంటాయి. సాధారణ కోడి మాంసంతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో కొవ్వు శాతం చాలా తక్కువ. రుచి మాత్రం బాగుంటుంది. ఈ కారణంగా మాంసాహార ప్రియులు ఈ కోళ్లను ఇష్టపడుతున్నారు. ఈ కోళ్ల మాంసానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. కిలో మాంసం ధర రూ.1000 పైనే. అంటే మటన్ ధర కంటే కడక్‌నాథ్ కోడి మాంసం ధరే ఎక్కువ అన్నమాట. పోషక విలువలు ఎక్కువే.. ధర ఎక్కువైనా మార్కెట్లో కడక్‌నాథ్ మాంసానికి అధిక డిమాండ్ ఉండటానికి కారణం పోషక విలువలే. కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటంతో పాటు ప్రొటీన్, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కోడి గుడ్డులో సైతం అత్యధిక ప్రొటీన్లతో పాటు లినోబెయిక్ యాసిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. సాధారణంగా కోళ్లలో కనిపించే వ్యాధులు వీటి దరికి చేరవు. ఎక్కడైనా బతుకుతాయి.. కడక్ నాథ్ కోళ్లు కేవలం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కాక అన్ని ప్రదేశాల్లోనూ జీవించగలవు. చిన్న చిన్న పురుగులతో కడుపు నింపుకోకుండా పోషక విలువలున్న ఆహారం తీసుకుంటాయి. కూరగాయలు, ఆకుకూరలు, రాగులు, సజ్జలు ఇలా వేటినైనా జీరి్ణంచుకోగలవు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కడక్‌నాథ్ కోళ్లు రైతులకు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం పౌల్ట్రీ రంగంలో వీటికి డిమాండ్ అధికంగా ఉంది. అనేక మంది యువ రైతులు కడక్‌నాథ్ కోళ్ల ఫారాలు నిర్వహిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. ఒక్కో కోడి నెలకు 10 నుంచి 18 గుడ్లు పెట్టడం వల్ల తక్కువ సమ యంలో ఎక్కువ పిల్లలు పెరిగి వ్యాపారం వృద్ధి చెందుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం.. పౌల్ట్రీ రంగంలో కడక్‌నాథ్ జాతి కోళ్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ రంగానికి మరింత చేయూత ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కుదేలైన కోళ్ల ఫారాలను తెరిచి కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ జాతి కోడి పిల్లలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కడక్‌నాథ్ కోడి పిల్లలను ఇచ్చే దిశగా సమాలోచన చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి.. కడక్‌నాథ్ జాతి కోళ్లకు ప్రస్తుతం డిమాండ్ ఉంది. 2017లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేసి 500 కడక్‌నాథ్ కోడి పిల్లలతో పౌల్ట్రీఫారం ఏర్పాటు చేశాను. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. ఆకుకూరలు, కూరగాయ ముక్కలు మూడు పూటలా ఉంటే చాలు. నాలుగు నెలల వ్యవధిలో కోడి మాంసానికి సిద్ధమవుతుంది. మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా అధిక సంఖ్యలో కోళ్లు అమ్ముడుపోతున్నాయి. నా వ్యాపారం లాభాల బాటలో నడుస్తోంది. ప్రభుత్వం మరింత చేయూతనిస్తే మరింత వృద్ధిచెందుతుంది. – ఇంటి ప్రదీప్, పౌల్ట్రీ యజమాని, విజయవాడ. -
కశ్మీర్లో మీసం తిప్పుతున్న కడక్‌నాథ్ కోళ్లు.. కారణం ఎంఎస్ ధోని
మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్ కోళ్లు ఇప్పుడు కశ్మీర్లో సందడి చేస్తున్నాయి. అక్కడి యువతకి సరికొత్త ఉపాధిని చూపిస్తున్నాయి. ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కారణంగా ఈ కోళ్లు ఝార్ఖండ్ మీదుగా కశ్మీర్ చేరుకున్నాయి. తీవ్రవాద ప్రాబల్యంతో అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్న కశ్మీర్ యువతలో కొందరికి ధోని ఆదర్శంగా నిలిచాడు. తీవ్రవాదం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువత స్టార్టప్‌ల వైపు అడుగులు వేసేందుకు పరోక్షంగా సాయం అందించాడు. మైదానం బయట కూడా టార్జన్ వికెట్ కీపర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ కూల్‌గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఎంతోమంది క్రికెటర్లకు ఇన్సిపిరేషన్‌గా నిలిచారు. దీంతో ధోనిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు కంపెనీలు పోటీ పడ్డాయి. ఎండార్స్మెంట్లలో సచిన్‌కి ధీటుగా ఎదిగాడు. ధోని ఏదైనా చెబితే చాలు ఆచరించేందుకు బోలెడు మంది సిద్ధంగా ఉండేవాళ్లు, అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ధోని రిటైర్ అయ్యాక మైదానంలో అతని మెరుపు ఇన్సింగ్సులు చాలా వరకు తగ్గినా.. భారత యువతలో అతను నింపుతున్న స్ఫూర్తి అలాగే కొనసాగుతోంది. పౌల్ట్రీ వ్యాపారంలో ధోని క్రికెట్ కెరీర్ లాస్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ కావడానికి ముందే ధోని రాంచీలో యాభై ఎకరాలతో ఫార్మ్ హౌజ్ నిర్మించాడు. ఇందులో పదెకరాల స్థలంలో ఆర్గనిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ.. ఆ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తున్నాడు. ఈ సాగుకంటే ముందు ఈ రంగంలో రాణించవచ్చనే నమ్మకం ధోనికి కల్పించినవి కడక్‌నాథ్ కోళ్లు. మధ్యప్రదేశ్ , చత్తీస్ఘడ్ ప్రాంతంలో పెరిగే కఢక్‌నాథ్ కోళ్లతో గతేడాది ధోని పౌల్ట్రీ రంగంలోకి అడుగు పెట్టారు. రెండు వేల కోళ్లతో ఏర్పాటు చేసిన ఈ పౌల్ట్రీ ఫార్మ్ దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. కడక్‌నాథ్ స్టార్టప్ ధోని నుంచి స్ఫూర్తి పొందిన ఇద్దరు కశ్మీర్ యువకులు తొలిసారిగా సుందర లోయల్లో కడక్‌నాథ్ కోళ్ల ఫారమ్ ప్రారంభించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన నుమైర్ రషీద్, మమూన్‌ఖాన్ అనే ఇద్దరు యువకులు ది రాయల్ ఫెదర్స్ పేరుతో స్టార్టప్‌గా కడక్‌నాథ్ కోళ్ల ఫారాన్ని శ్రీనగర్ సమీపంలో ఏర్పాటు చేశారు. కశ్మీర్ యువకులు ప్రారంభించిన ఈ రాయల్ ఫెదర్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో కశ్మీర్ యువకుల కడక్‌నాథ్ కోళ్ల ఫార్మ్ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో వీళ్లకి ప్రోత్సాహం అందించేందుకు దేశం నలుమూలల నుంచి అనేక మంది ముందుకు వస్తున్నారు. Two engineering students has started “Kadaknath” chicken poultry farm in #Kashmir. They have started this joint venture to create employment in the valley. Kadaknath is considered the most expensive chicken breed in world because of its protein value.#Kashmirilivesmatter #Jobs pic.twitter.com/djEASTQn9V — yasinmalik786 (@yasinmalik7861) January 13, 2022 కశ్మీర్లో మార్పు ఇంజనీరింగ్ చేసిన ఇద్దరు యువకులు కోళ్ల ఫార్మ్ ఏర్పాటు చేయడం మిగిలిన దేశానికి పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ కశ్మీర్‌కి సంబంధించినంత వరకు ఇది కీలకమైన విషయం. ఎందుకంటే 80వ దశకం చివర్లో కశ్మీర్లో చెలరేగిన హింసతో పచ్చని లోయలో నెత్తురు ఏరులై పారుతోంది. అక్కడి యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపినా ఆశించిన మేరకు సక్సెక్ కాలేకపోయింది. ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. ఇండియన్ ఐకాన్స్‌ని స్ఫూర్తిగా తీసుకుని పైకి ఎదిగేందుకు కశ్మీర్ యువత ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఎంతో సానుకూలమైన అంశం. కశ్మీర్ యువతలో స్ఫూర్తి నింపుతున్న వారిలో ధోని లాంటి లెజెండ్స్ ముందు వరుసలో ఉంటున్నారు. అందుకే ఏఎన్ఐ మొదలు అనేక జాతీయ మీడియా సంస్థలు వీరిపై ప్రత్యేక కథనాలు వండివారుస్తున్నాయి. సోషల్ మీడియాలో వీళ్ల గురించి వెతుకులాట మొదలైంది. ఇదే బాటలో కశ్మీర యువత ఉపాధి మీద దృష్టి సారించి పైకి ఎదగాలని దేశం కోరుకుంటోంది. చదవండి: ఊపిరితిత్తుల సమస్య.. నోట్లో పైపు, చిన్నారి జోషి కోసం ‘అవతార్’ సాయం -
కోళ్ల నలుపుకు అదే కారణం.. కిలో ధర రూ.700 నుంచి 900
సాక్షి,రాయపర్తి(వరంగల్): తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సైన నలుపుకోడి. మటన్‌కు పోటా పోటీగా గిరాకీ, నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలతో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చి పెడుతున్న ఈ కోళ్లను రాయపర్తి మండలం కొలన్పల్లికి చెందిన యువకుడు సతీష్ పెంచుతున్నాడు. నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటుకోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటంతో ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.700 నుంచి రూ 900 వరకు, గుడ్డు ఒక్కటికి రూ. 20 నుంచి రూ.30 వరకు పలుకుతుందని సతీష్ అంటున్నాడు. నెలకు 18 గుడ్లు.. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 గుడ్ల చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీల నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. వృత్తి సాఫ్ట్వేర్..ప్రవృత్తి నాటుకోళ్ల పెంపకం వృత్తి సాఫ్ట్వేర్ అయినా ప్రవృత్తిగా నాటుకోళ్లను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు సతీష్. చాలా చోట్ల తిరిగినా దొరకపోవడంతో ఆన్లైన్లో ఏక్యూఏఐ అనే యాప్ ద్వారా ఒకేసారి ఒక్కో పిల్లకు రూ.110 చొప్పున 50 పిల్లలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం 70 నాటుకోళ్లు, 50 కడక్‌నాథ్ కోడిపిల్లలతో పాటు బాతులను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తునాడు. చదవండి: రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు -
ఈ కోడి కొవ్వు తక్కువ.. రుచి ఎక్కువ
తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సయిన నలుపు రంగు కోడి. మటన్‌కు పోటాపోటీగా గిరాకీ. నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలలో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో రైతుకు ఎక్కువ లాభాలు తెచ్చి పెడుతున్న ఈ నల్ల కోడి పేరు ‘కడక్‌నాథ్’. సాక్షి, అమరావతి: నాటుకోడి మాంసానికి ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. అయితే నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటు కోడి మార్కెట్లో ప్రవేశించి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ధారా, జాబియా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వంటి గిరిజన ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. రంగు, రుచితో పాటు ఈ కోళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ‘మెలనిన్’ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వలనే ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. మార్కెట్లో కడక్‌నాథ్ కోడి మాంసం ధర కిలో అక్షరాల రూ.800లు పైమాటే. మాంసమే కాదు.. ఈ కోడి గుడ్డు కూడా కాస్ట్లీనే. ఒక్కొక్క గుడ్డు రూ.20 పైనే పలుకుతోంది. ఎన్నో ‘లాభాలు’ సాధారణ బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి మాంసంలో ప్రొటీన్స్/ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. కొలెస్ట్రాల్ మాత్రం చాలా తక్కువ. మాంసంలోనే కాదు ఈ కోడి గుడ్డులో కూడా అత్యధిక శాతం ప్రొటీన్లు, లినోలెయిక్ యాసిడ్లు ఉన్నాయి. ఈ కోళ్లకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన తెగుళ్లు పెద్దగా వీటి దరి చేరవు. ఏ వాతావరణంలోనైనా ఇవి పెరుగుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, రాగులు, సజ్జలు ఇలా ఏవైనా తిని జీర్ణించుకోగలుగుతాయి. ఇలా.. పోషకాలు అందిస్తూ వినియోగదారునికి, లాభాలు తెచ్చిపెడుతూ పౌల్ట్రీ రైతులకు కడక్‌నాథ్ కోళ్లు ప్రయోజనకరంగా ఉన్నాయి. రూ.2 కోట్లతో ప్రాజెక్టు మంచి రుచితో పాటు అత్యధికంగా పోషకాలను అందించే ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని మన రాష్ట్రంలో ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ జిల్లా ఊటుకూరు వద్ద మూతపడిన కోళ్ల ఫారంను పునరుద్ధరించి కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పౌల్ట్రీ ఫారం నిర్వహణ కోసం కోసం ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వీఏఎస్, పారావెట్ పోస్టులను కూడా మంజూరు చేశారు. ఈ పౌల్ట్రీఫారం ద్వారా వేల సంఖ్యలో కడక్‌నాథ్ కోడి పిల్లలను ఉత్పత్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా వాటి పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు వ్యయమవుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. నెలకు 10 నుంచి 18 గుడ్లు సాధారణ కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీ నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ప్రస్తుతం లైవ్ కోడి ధర కిలో రూ.650లు ఉంటే, మాంసం రూ.800 పైగా పలుకుతోంది. ఇంట్లో తినేందుకు వాడే ఈ కోడి గుడ్డు ధర రూ.20కి పైగా పలుకుతుంటే.. పిల్లలు పొదిగే గుడ్డు ధర రూ.40 పైమాటే. తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఎంతో లాభదాయకం. 2017లో 500 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫారం ప్రారంభించా. నేడు 1,500 కోళ్లతో నడుపుతున్నా. నిర్వహణ వ్యయం పెద్దగా ఉండదు. రైతు బజార్ల నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, మూడు పూటలా నీళ్లు పెడతానంతే. వీటికి వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగాల బెడద ఉండదు. 4–5 నెలల తర్వాత కోడి.. మాంసానికి సిద్ధమవుతుంది. మా ఫారం నుంచి ఈ కోళ్లనే కాకుండా కోడి మాంసాన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నా. కోడి పిల్లలను అయితే ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నా. రూ.లక్షతో మొదలైన వ్యాపారం నేడు రూ.20 లక్షలకు చేరింది. – ఇంటి ప్రదీప్, ప్రదీప్ ఫామ్స్ యజమాని, నున్న, కృష్ణా జిల్లా. -
కోళ్లయందు ‘కడక్‌నాథ్’ వేరయా..!
రాజాం సిటీ: చర్మం నలుపు, మాంసం నలుపు, ముక్కు, గోళ్లు, ఎముకలు.. ఆఖరకు నాలుక కూడా నలుపే. ఈ నలుపే ఇప్పుడు జిల్లా వాసుల మనసు గెలుచుకుంటోంది. కొత్త రుచుల అన్వేషణలో మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి రాజాం తదితర ప్రాంతాల్లో కొక్కొరొక్కో అంటోంది. మటన్‌తో సమానంగా దీని మాంసం ధర పలుకుతున్నా.. ఫర్లేదండి అంటూ జిల్లావాసులు ఇష్టంగా లాగించేస్తున్నారు. కోళ్లయందు కడక్నాథ్లు వేరయా అనిపించుకుంటున్న ఈ బ్రీడ్ గురించి తెలుసుకుంటే.. మొత్తం నలుపే.. కడక్‌నాథ్ కోళ్లు కొత్తవేం కావు. పేపర్లు, సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఇవి బాగా తెలుసు. అయితే సిక్కోలులో లభ్యం కావడం మాత్రం కొత్తే. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోడి రుచులు పంచుతోంది. ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. సాధారణంగా కోళ్లులో బొచ్చు రంగు రంగులుగా ఉన్నప్పటికీ మాంసం మాత్రం ఎరుపుగానే ఉంటుంది. ఈ కడక్‌నాథ్ కోళ్లు మాత్రం బొచ్చుతోపాటు చర్మం, ముక్కు, గోళ్లు, ఎముక లు, చివరికి నాలుక కూడా నలుపుగానే ఉంటుంది. ఈ కోళ్లను మాంసం కోసం పెంపకం చేపడుతుంటారు. వీటి గుడ్లు కాఫీకలర్తోపాటు కొంత పింక్ కలర్లో ఉంటాయని కోళ్ల ఫారం యజమానులు చెబుతున్నారు. పోషక విలువలు భేష్ కడక్‌నాథ్ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలె్రస్టాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుంది. పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతోపాటు కడక్‌నాథ్ చికెన్ ధర రూ. 800లు వరకు పలుకుతోంది. తేడా ఇదే.. కడక్‌నాథ్ కోళ్లు మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్లో లభించే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు పెరుగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు. రుచి బాగుంది... ఈ ప్రాంతంలో కడక్‌నాథ్ కోళ్లు విక్రయిస్తున్నారని తెలుసుకుని వచ్చాం. నాటు కోడి మాంసం కంటే చాలా బాగుంది. ఈ మాంసం తిన్న తర్వాత బ్రాయిలర్ కోడి మాంసం తినాలనిపించడంలేదు. కోడితోపాటు మాంసం కూడా నలుపురంగులో ఉండడంతో ఎలా ఉంటుందో అని అనుకున్నాం. కానీ వంటకం తర్వాత దాని రుచి చాలా బాగుంది. ఇప్పుడు వారంలో ఓ సారి ఈ మాంసం మాత్రమే తింటున్నాం. – ఆర్.తిరుపతిరావు, జి.నారాయణరావు, మాంసం ప్రియులు డిమాండ్ ఉంది రాజాం ప్రాంతంలో ఎక్కువగా బ్రాయిలర్ ఫారాలు మాత్రమే ఉన్నాయి. వీటికి భిన్నంగా ఏదైనా వ్యాపారం చేయాలని నాటుకోళ్లఫారం పెట్టాను. మొదటిసారిగా నా స్నేహితుల ద్వారా కడక్‌నాథ్ కోళ్లు గురించి విన్నాను చిన్న పిల్లలను కొనుగోలు చేసి పెంపకం చేపట్టాను. మా ఫారంలో ఉన్నాయని తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫారంలో నాటుకోళ్లుతోపాటు వీటిని పెంచు తున్నా. నాటుకోళ్ల కంటే కడక్‌నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. – ఎస్.చిన్నబాబు, ఎస్ఆర్ఎన్ కోళ్లఫారం యజమాని, పొనుగుటివలస, రాజాం బలవర్ధకమైన ఆహారం ప్రస్తుతం మార్కెట్లో లభించే బ్రాయిలర్, నాటు కోళ్ల కంటే కడక్‌నాథ్ కోడి మాంసం బలవర్ధకమైన ఆహారం. మిగతా వాటి కంటే కొవ్వు శాతం తక్కువగా ఉండడంతోపాటు ప్రోటీన్ల శాతం అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మాంసకృత్తులు లభిస్తాయి. ఈ మాంసం తినడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఇటు వినియోగదారులకు, అటు వ్యాపారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. – డాక్టర్ శివ్వాల మన్మథరావు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, రాజాం చదవండి: ‘నాన్నా.. నా మనసేమీ బాలేదు’ హిజ్రాతో దోస్తీ, రూ.3 లక్షలు తీసుకుని దారుణం -
ఖరీదైన కడక్, నలుపెందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఈ కోడి చాలా కడక్.. పోషక విలువల్లోనే కాదు ఖరీదులో సైతం.. దీని కడక్‌నాథ్ కోడి. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోడికి మాంచి డిమాండ్ వచ్చింది. రోగ నియంత్రణకు మాంసాహారం తీసుకోవాలనే వైద్య నిపుణులు సూచిస్తున్న క్రమంలో.. ఈ కోడిలో పోషకాలు మెండుగా ఉండడంతో మాంసంప్రియుల చూపు దీనిపై పడింది. అసలు ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది? దీని ప్రత్యేకత ఏమిటి? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. అన్నీ నలుపే.. సాధారణంగా కడక్‌నాథ్ జాతి కోళ్లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతాయి. నలుపు రంగులో ఉండే ఈ కోడి.. గుడ్లు కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్లో ఉంటాయి. ఈ కోళ్లను మాంసం కోసం పెంచుతారు. దీని చర్మమే కాదు, ముక్కు, గోళ్లు, ఎముకలు చివరికి నాలుక కూడా నలుపే. దీని శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉండటంతో ఈ రంగులో ఉంటుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు భేష్ కడక్‌నాథ్ కోళ్లలో ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, కొవ్వు, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా, శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందట. పురిటినొప్పులు తగ్గించడంతో పాటు.. మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలోనూ ఈ మాంసం తోడ్పడుతుందనే ప్రచారమూ ఉంది. తేడా ఇలా.. కడక్‌నాథ్ మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్లో దొరికే బ్రాయిలర్ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు తూగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంటుందని పెంపకందారులు చెబుతున్నారు. ఊపందుకుంది.. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పట్నుంచీ ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై మరింత శ్రద్ధ పెరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఉండటం కోసం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు జనాలు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతం ఝూబువా, అలీరాజ్‌పూర్‌కే పరిమితమైన దేశీ నల్ల కోడి కడక్‌నాథ్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో నగర శివారు ప్రాంతాల్లో కడక్‌నాథ్ కోళ్ల పెంపకం ఊపందుకుంది. కడక్‌నాథ్ చికెన్ ధర దాదాపు వెయ్యి రూపాయలపైనే పలుకుతోంది. బతికున్న కోడి కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముడవుతోంది. చదవండి: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ధోని కీలక నిర్ణయం నాటు కోడి గుడ్లను ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా? -
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ధోని కీలక నిర్ణయం
రాంచీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ప్రారంభించిన కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్ చేసిన రెండు వేల కడక్‌నాథ్ కోళ్లను, అంతే సంఖ్యలోని గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని ఆర్డర్ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ దృవీకరించారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికి, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్సిన ధోని.. అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లకోళ్లు (కడక్‌నాథ్ కోళ్లు) అలాగే హైదరాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ రకం కోళ్ల మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తున్నాయి. కడక్‌నాథ్ చికెన్ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. మన దేశంలో కడక్‌నాథ్ చికెన్ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ) అనే వైరస్.. పక్షి జాతుల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. లక్షలాది పక్షుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్ దేశంలోని పది రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా దీని ప్రభావం మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. -
కరోనా ఎఫెక్ట్: నల్లకోడికి ఫుల్లు డిమాండ్
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఉండటం కోసం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మీద దృష్టి పెట్టారు జనాలు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్, పళ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ గిరిజన ప్రాంతం ఝూబువా, అలీరాజ్‌పూర్‌కే పరిమితం అయిన దేశీ నల్ల కోడి కడక్‌నాథ్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. దీని వినియోగదారుల్లో ఎక్కువగా భోపాల్, ఇండోర్ వాసులు ఉన్నారు. తాజాగా ఇక్కడ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండోర్‌లో గత నాలుగురోజుల్లో మొత్తం 500 కేసులు నమోదవ్వగా.. భోపాల్‌లో 300 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి కడక్‌నాథ్ కోడికి డిమాండ్ బాగా పెరిగింది. లాక్డౌన్ వల్ల కొద్దిగా తగ్గినప్పటికి ప్రస్తుతం అన్‌లాక్ అమల్లోకి రావడంతో మళ్లీ అమ్మకాలు పెరిగాయి. పౌల్ట్రీ ఫామ్ యజమానుల ఆదాయం పెరిగేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతి కోళ్ల ఉత్పత్తి, అమ్మకాలను పెంచే ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. (చదవండి: ‘కడక్‌నాథ్’ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!) ఇక కడక్‌నాథ్ కోడి ప్రత్యేకత ఏంటంటే చికెన్ తోలు, మాంసం, గుడ్లు అన్ని నలుపు రంగులోనే ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉండటంతో పాటు, ఈ మాంసంలో కొవ్వు తక్కువగా.. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుండె, శ్వాస, రక్తహీనత వ్యాధులతో బాధపడేవారికి ఈ చికెన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అధిక రోగనిరోధక శక్తి గల కడక్‌నాథ్ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. కాగా ఈ జాతి కోడి కిలో మాంసం 700-1,000 రూపాయల వరకు, గుడ్డు ధర 40–50 రూపాయలకు పైగానే ఉంటుందట. -
‘కడక్‌నాథ్’ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ఎంఎస్ ధోని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సిరులు కురిపించడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘కడక్‌నాథ్’ పెంపకంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పేదిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ధోని బృందం ఆర్డర్ చేసిన 2 వేల కోడి పిల్లలు, డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం గురించి మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించాడని, అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. (చదవండి: ధోని తప్పుకొంటే.. సీఎస్కే కెప్టెన్‌గా అతడికే అవకాశం!) కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. ప్రొటీన్ల శాతం ఎక్కువ. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.. అదే విధంగా ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ ఉంటుందట. ఇక ఈ కోళ్ల చర్మం, మాంసంతోపాటు రక్తం కూడా నలుగు రంగులోనే ఉండటం విశేషం. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. అధిక రోగనిరోధక శక్తి గల కడక్‌నాథ్ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. కాగా ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైగానే ఉంటుందట. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని, ప్రస్తుతం ఐపీఎల్ టీం సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన ఫాంహౌజ్‌లో కుటుంబంతో సమయం గడిపే ధోని, ఇప్పుడు అక్కడే పౌల్ట్రీని నెలకొల్పనున్నాడు. -
నల్ల కోళ్లు పైసలు ఫుల్లు
కర్ణాటక, సిరుగుప్ప: వ్యవసాయంలో సరైన ఆదాయం లేక, మధ్యప్రదేశ్‌కు చెంది ఖడక్‌నాథ్ కోళ్ళ పెంపకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు శశిధరగౌడ అనే రైతు. బళ్లారి జిల్లా తాలూకాలోని శాలిగనూరు గ్రామంలో ఉండే రైతు శశిధరగౌడ పెంచుతున్న నల్లజాతి కోళ్లు ఇతోధికమైన లాభాలను ఇస్తున్నాయి. ఈకల నుంచి మాంసం వరకు మొత్తం నల్లగా ఉండే ఈ కోళ్లు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. ఒక్కో పెట్ట 150 గుడ్లు రైతు గౌడ మొత్తం నాలుగు లక్షలు డిపాజిట్ చేసి 600 కోడి పెట్టలు 120 కోడి పుంజులను నాలుగు యూనిట్‌గా తీసుకొన్నారు. వీటిని తెచ్చిన నెల రోజులకు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి. రోజు విడిచి రోజు 100 నుండి 150 వరకు గుడ్లు పెడతాయి. మొదట వ్యాపార ఒప్పందం ప్రకారం ఒక గుడ్డు ధర రు.15 కింద కోళ్ల సరఫరాదారే కొంటారు. వీటిని అరబ్ దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారన్నారు. స్థానికంగానూ గిరాకీ ఉంది. ఆహారం ఏమిటి ఈ కోళ్ళు అన్నిరకాల ఆకుకూరలైన టమోటా, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పొలంలో వ్యర్థంగా పెరిగే గౌరి పల్లె, రాజగూర పల్లె తదితర నానా ఆకులను తింటాయి. ప్రతి దినం మిశ్రమం చేసిన ధాన్యాన్ని ప్రతి కోడికి 100 గ్రాములు ఇస్తారు. ఫారంలో నేలపై రాలిన ధాన్యం పొట్టు, కోడి ఈకలు, రెట్టలను కలిపి పొలాలకు ఎరువుగా వాడవచ్చు. ప్రతి నెలా ఫారంను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలు దరిచేరవు. వైద్యుల సూచనల ప్రకారం వాటికి వైరస్ వ్యాధులు సోకకుండా ఔషధాలు ఉపయోగిస్తూ ఉండాలని చెప్పారు. రూ.7 లక్షల ఆదాయం కోళ్ళను, గుడ్లను కొనేందుకు ఒక ఆర్గానిక్ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నామని రైతు తెలిపారు. రోజుకు కోళ్లకు 75 కేజీల దాణా పెడతారు. సీజన్‌కు కోళ్ల మందులకు రూ.12 వేలు, షెడ్‌కు రూ.2 లక్షలు, నెలకు కూలీలకు రూ.25 వేలు, నాలుగు నెలలకు కరెంటు ఖర్చు రూ.35 వేలు ఇలా మొత్తం కలిపి రూ.7.50 లక్షల వరకు ఖర్చవుతుందని రైతు తెలిపారు. 600 కోళ్ల నుంచి సరాసరి 100 గుడ్లు, కోడి ధర రూ.550 ప్రకారం రూ.14 లక్షల వరకూ ఆదాయం వస్తుందని, ఇందులో ఖర్చులు పోను రూ.7 లక్షల వరకూ ఏడాదికి ఆదాయం వస్తుందని తెలిపారు. గుడ్లు, మాంసం ఆరోగ్యదాయకం కొంతకాలం కిందట మధ్యప్రదేశ్ నుంచి 5 నెలల వయస్సున్న 720 కోడిపిల్లలను తెచ్చి తమ ఫారంలో పెంపకం ఆరంభించినట్లు గౌడ తెలిపారు. ఈ కోళ్ళకు పలు ఆరోగ్య లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ కోళ్ల గుడ్లు, మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండం వల్ల సుగర్, గుండెజబ్బులు ఉన్నవారు కూడా నిక్షేపంగా తినవచ్చునని చెప్పారు. సాధారణ బాయ్లర్, నాటు కోళ్ల మాంసం కంటే రుచిగా ఉంటుందని చెప్పారు. ఈ నల్ల కోళ్ళను ఇళ్ల వద్ద మామూలు కోళ్లమాదిరిగానే పెంపకం సాగించవచ్చు. ఇవి స్వల్ప వ్యధిలోనే పెద్ద సైజుకు ఎదుగుతాయి. దండిగా గుడ్లనూ పెడతాయి. కోళ్ల సరఫరాదారుల వద్ద రూ. ఒక లక్ష డిపాజిట్ చేసినట్లైతే 150 కోడి పెట్టలు, 30 కోడి పుంజులు కలిపి యూనిట్‌గా అందజేస్తారు. -
కడక్‌నాథ్‌కోడి @1,500
సోన్ (నిర్మల్): కడక్‌నాథ్ కోడి.. ప్రస్తుతం నిర్మల్ చుట్టుపక్కల అత్యధికంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కూడా ఉందండోయ్.. అదే ఈ కోడి రేటు! అవును .. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. ఇందులో పుంజుకయితే ఇంకాస్త రేటు ఎక్కువే. ఈ కోడి పూర్తిగా నలుపు రంగులో ఉండడం స్పెషల్. గతంలో ఎవరికీ తెలియని ఈ కోళ్లను ప్రస్తుతం నిర్మల్ ప్రాంతాల్లో అధికంగా విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా ఇవి నిర్మల్ జిల్లాకు దిగుమతవుతున్నాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు, కిడ్నీల్లో రాళ్లు, ఆస్తమా, బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఈ కోడిని తింటే రోగాలు నయమవుతాయని ప్రచారం ఈమధ్య జోరందుకుంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా గ్రామాల్లో లభించే దేశీకోళ్లు ఒక్కోటి రూ.400 వరకు ధర పలుకుతుండగా, బాయిలర్ చికెన్ కిలో రూ.180, మటన్ రూ.500 వరకు అమ్ముతున్నారు. ఈ కడక్‌నాథ్ కోళ్లు మాత్రం కిలో నుంచి కిలోన్నర బరువు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.1,200 నుంచి రూ. 1,500 వరకు పలుకుతుండటం గమనార్హం. -
కోడే కాదు గుడ్డు కూడా నలుపే !
సాక్షి, తలుపుల(అనంతపురం) : ఎక్కడైనా కోడి బొచ్చు నల్ల రంగులో ఉండడం చూసి ఉంటాం. అయితే బొచ్చుతో పాటు చర్మం, రక్తం చివరకు పెట్టే గుడ్డు కూడా నల్లగానే ఉంటే.. ఆశ్చర్యంగా ఉంది కదూ !. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది అచ్ఛం ఆ రకం కోళ్లే. కడక్‌నాథ్ అని పిలువబడే ఈ రకం కోళ్లను కర్ణాటకలోని బాగేపల్లి నుంచి తలుపుల మండలం గొల్లపల్లితండాకు చెందిన యువరైతు మనోజ్ఞనాయక్ తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఈ రకం కోళ్లలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి గుడ్లు పెడతాయి కానీ, పిల్లలను పొదగవు. వీటి గుడ్లను మాములు కోళ్ల కింద పొదుగుకు పెట్టాల్సిందే. ఇక వీటి మాంసానికి డిమాండ్ కూడా భారీగా ఉన్నట్లు రైతు తెలుపుతున్నాడు. అది కూడా ఎంతంటే.. కిలో మాంసం దాదాపు రూ.700 చొప్పున గుంటూరు, కర్ణాటక ప్రాంతాల్లో అమ్ముడు పోతోందట. -
కడక్‌నాద్ కోళ్లపై మధ్యప్రదేశ్‌కే హక్కులు!
నల్ల కోళ్లు.. అదేనండి కడక్‌నాద్ కోళ్లపై ప్రాదేశిక గుర్తింపు(జీఐ) హక్కులను మధ్యప్రదేశ్ దక్కించుకుంది. అనాదిగా గిరిజనులు పెంచి పోషిస్తున్న కడక్‌నాద్ కోళ్ల జాతిపై ప్రాదిశిక గుర్తింపు హక్కుల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల మధ్య గత ఏడాది నుంచి వాదప్రతివాదాలు జరగుతూ వచ్చాయి. చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ కార్యాలయం మధ్యప్రదేశ్‌కే జీఐ హక్కు ఇస్తూ మార్చి 28న జర్నల్ 104లో నోటిఫై చేసినట్లు ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి అంతర్ సింగ్ ఆర్య ప్రకటించడంతో వివాదానికి తెరపడింది. ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాలకు చెందిన గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను అనాదిగా పరిరక్షిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని 21 సహకార సంఘాలలో సభ్యులైన 430 మంది గిరిజనులు కడక్‌నాద్ కోళ్లను సాకుతూ, పిల్లలను, మాంసాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు. గ్రామీణ్ వికాస్ ట్రస్టు 2012లో గిరిజనుల తరఫున ప్రాదేశిక గుర్తింపు కోరుతూ ధరఖాస్తు చేసింది. ఝబువలో 1978లో తొలి కడక్‌నాద్ కోడి పిల్లల హేచరీ ఏర్పాటైంది. అయితే, ఛత్తీస్‌ఘడ్‌లోని 120 స్వయం సహాయక బృందాల ద్వారా 1600 మంది గిరిజన మహిళలు కడక్‌నాద్ కోళ్ల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నందున వీరికే జీఐ హక్కులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. చివరికి మధ్యప్రదేశ్‌కే జీఐ మంజూరైనందున ఇకపై ఈ కోళ్ల జాతిపై సర్వహక్కులు ఝబువ, అలిరాజ్పుర్ జిల్లాల గిరిజనులకే దక్కాయి. అంటే ‘కడక్‌నాద్’ పేరుతో నల్ల కోళ్లను ఇక మరెవరూ అమ్మటానికి వీల్లేదు. అందేకే, దేశంలో ఎక్కడివారైనా కడక్‌నాద్ కోళ్ల లభ్యతను తెలుసుకొనేందుకు, సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా MP Kadaknath పేరిట హిందీ/ఇంగ్లిష్ మొబైల్ యాప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కడక్‌నాద్ కోళ్లకు ఎందుకింత క్రేజ్? కడక్‌నాద్ కోడి మాంసం రుచికరమైనదే కాకుండా పోషక విలువలు, ఔషధ గుణాలను కలిగి ఉంది. సాధారణ జాతుల కోడి మాంసంలో మాంసకృత్తులు 18% ఉంటే.. ఇందులో 25–27% ఉంటాయి. ఐరన్ అధికం. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ అని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకోవడం ఈ కోళ్లకు ఉన్న మరో ప్రత్యేకత. మధ్యప్రదేశ్ ప్రభుత్వ హేచరీలలో ఏటా రెండున్నర లక్షల కడక్‌నాద్ కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ కోడి పిల్లలను తెప్పించి, మన రైతులకు అందజేస్తే వారి ఆదాయం పెరుగుతుంది. -
నల్ల కోళ్లు నాలుగు విధాల మేలు!
‘నలుపు రంగు’.. అయితేనేం? మాంసం రుచి అదరహో! ప్రొటీన్ల శాతం కూడా ఎక్కువే.. కొవ్వు తక్కువ. ఇంకెన్నో సుగుణాలు కల్గిన ‘కడక్‌నాథ్’ అనే నల్ల కోళ్ల పెంపకంపై తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆసక్తి పెరుగుతోంది. రైతులు వ్యవసాయానికి అనుబంధంగా అదనపు ఆదాయ వనరుగా ఈ కోళ్ల పెంపకం చేపడుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ఫాం హౌజ్‌లలో ‘కడక్ నాథ్’ కోళ్ల సందడి వినిపిస్తోంది. స్థానిక పెరటి కోళ్ల మాదిరిగానే.. వీటి పోషణకు పెద్దగా ఖర్చు లేకుండా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పంట పొలాల వద్ద ఈ కోళ్ల పోషణ చేపడితే.. పంటలకు ఆశించే పురుగులను తిని పంట ఎదుగుదలకు దోహదపడతాయి. కోళ్ల విసర్జితాలు పంటకు మంచి ఎరువు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ కోళ్ల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. ఐరన్ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ అని చెబుతున్నారు. కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40–50 పైనే. గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. శంషాబాద్ రూరల్ ప్రాంతంలో సురేశ్ అనే యువ రైతు సేంద్రియ పద్ధతిలో ఈ కోళ్లను పెంచి, మాంసం అమ్ముతున్నారు. వీటి గుడ్లను హేచరీలో పొదగేసి ఒక్కో పిల్లను రూ.80లకు అమ్ముతున్నారు. కడక్‌నాథ్ కోళ్ల పోషణ చాలా సులువని, 5 నెలల్లో అమ్మకానికి తగినంత పెరుగుతాయని సురేశ్(99599 52345) చెబుతున్నారు. సురేశ్ – బుర్గు ప్రభాకర్‌రెడ్డి, శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్), రంగారెడ్డి జిల్లా -
కోడి పెట్టిన చిచ్చు