షాజాపూర్: దేశవ్యాప్తంగా మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లు మాయమైపోతున్నాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. ఇందులో కుట్రకోణం దాగుందని ఆరోపించారు. సోమవారం నాడిక్కడ జరిగిన ఓ రైతు సదస్సులో చౌహాన్ మాట్లాడుతూ.. ‘పెద్ద నోట్ల రద్దుకు ముందు దేశంలో రూ.15 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండేది. నోట్ల రద్దు తర్వాత చలామణి రూ.16.50 లక్షల కోట్లకు చేరుకుంది. కానీ రూ.2 వేల నోట్లు మాత్రం మార్కెట్ నుంచి మాయమైపోతున్నాయి’ అని వెల్లడించారు. మార్కెట్‌లో నగదు కొరతతో సమస్యల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని చౌహాన్ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment