కేరళలో రూ. 51 లక్షల కొత్త నోట్లు స్వాధీనం | Demonetisation: Over Rs 51 lakh in 2000 denomination notes coughted in kerala | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 26 2016 7:40 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

దేశవ్యాప్తంగా కొత్త కరెన్సీ అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కేరళలోని ఇరిటి వద్ద ఆదివారం ఎక్సైజ్‌ అధికారులు ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి లెక్కల్లో చూపని రూ. 51 లక్షల విలువైన రూ. 2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి వస్తోంది. కేరళలోని తిరూర్‌లో ఓ వ్యాపారి నుంచి రూ. 39.98 లక్షల విలువైన రూ.2 వేలనోట్లను ఇటీవల స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ముంబైలోని పన్వేల్‌లో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేసి రూ. 35 లక్షలను, రూ. 2.5 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. దొరికిన కరెన్సీ అంతా రూ.2 వేల కొత్తనోట్లే.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement