మార్కెట్లోకి వచ్చిన కొత్త నోట్లెన్నో తెలుసా?
మార్కెట్లోకి వచ్చిన కొత్త నోట్లెన్నో తెలుసా?
Published Fri, Mar 10 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM
న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సుమారు 12 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఫిబ్రవరి 24 వరకు మొత్తం 11,64,100 కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఈ మొత్తం ఇప్పటికి మరికొంత పెరిగి ఉంటుందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
అయితే ఎన్ని పాత నోట్లు వచ్చాయనే వివరాలను మాత్రం మంత్రి తెలుపలేదు. ప్రతి కరెన్సీ నోటు నకిలీదో కాదో పరిశీలించాల్సి ఉందని, అనంతరం నకిలీ నోట్లను, మంచి వాటిని వేరు చేయాలన్నారు. ఇదొక పెద్ద ప్రక్రియని, ఈ పనంతా ముగిసిన అనంతరం సమగ్రమైన నివేదికను సభకు అందిస్తామన్నారు. అదేవిధంగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల వివరాలను ప్రకటించారు. గతేడాది డిసెంబర్ లో రూ.1,40,824 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయని చెప్పారు. కాగ 2015 డిసెంబర్ లో ఈ పన్నులు రూ.1,35,660 కోట్లు మాత్రమే.
Advertisement
Advertisement