సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నోట్లతో అంధులకు చాలా కష్టమవుతోంది. ఈ నోట్లన్నింటిన్నీ దాదాపు ఒకే విధమైన పరిమాణాలతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రవేశపెడుతుండటంతో, వారు గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందని తెలిసింది. పాత నోట్లలో పొడవు, వెడల్పుల్లో కనీసం 10ఎంఎం అయినా తేడా ఉండేంది. కానీ కొత్త నోట్లలో ఇది కేవలం 4ఎంఎం మాత్రమే ఉంది. దీంతో పాత రూ.20 నోటు,కొత్త రూ.200 నోట్లు ఒకే విధమైన పరిమాణాలు కలిగి ఉన్నాయి. సాధారణంగా చూపులేని వారు నోట్ల సైజును బట్టే వాటిని గుర్తిస్తుంటారు, అదే నిరక్షరాస్యులు వాటి రంగును బట్టి నోట్ల విలువను గుర్తిస్తారు. కానీ ఆర్‌బీఐ ప్రవేశపెడుతున్న కొత్త నోట్ల సైజులో పెద్దగా తేడా లేకపోవుతుండటంతో వారికి కష్టమవుతోంది.
''అంతర్జాతీయ ప్రమాణాల మేరకు కరెన్సీ నోట్ల సైజుల్లో తేడా 5 ఎంఎం ఉండాలి. కానీ కొత్త కరెన్సీ రూ. 50, రూ.200 నోట్లలో తేడా కేవలం 4ఎంఎం మాత్రమే. త్వరలో కొత్తగా రాబోతున్న రూ.100 నోటు తేడా కేవలం 2 ఎంఎం అని మాత్రమే తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలైంది. 2017 అక్టోబర్30న ఈ విషయంపై మేము జోక్యం చేసుకుంటా'' అని అడ్వకేట్, సొలిసిటర్ కంచన్ పమ్మని చెప్పారు. బ్లైండ్ గ్రాడ్యుయేట్ల ఫోరమ్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో దీనిపై క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment