21, 51 రూపాయల కొత్త నోట్ల ఆలోచన లేదు | 21, 51, not at the thought of the new banknotes | Sakshi
Sakshi News home page

21, 51 రూపాయల కొత్త నోట్ల ఆలోచన లేదు

Published Fri, Mar 31 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

21, 51, not at the thought of the new banknotes

► రూ. 50 రూ. 100 నోట్లను రద్దు చేయాం
► ఆర్దిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ స్పష్టం
 
న్యూఢిల్లీ: కొత్తగా  21 రూపాయలు, 51 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా తమ పరిశీలనలో లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు.
 
 బీజేపీ ఎంపీ పరేశ్‌ రావెల్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలాగే రూ. 50, రూ.100 నోట్లను రద్దు చేసే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement