గుజరాత్: గుజరాత్ లో ఒకవైపు అసెంబ్లీకి మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగియగా మరోవైపు భారీ ఎత్తున రద్దయిన నోట్లను నిఘా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బారుచ్‌లో రద్దయిన రూ.500, 1000ల నోట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. సుమారు రూ. 50 కోట్లవిలువ చేసే పాత నోట్లను రికవరీ చేశామని డిఆర్ఐ అధికారులు ప్రకటించారు.
యమునా బిల్డింగ్ మెటీరియల్ ప్రాంగణంపై దాడిచేసిన అధికారులు రూ. 48.90 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ది డిప్యూటిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం రద్దయిన పాత కరెన్సీ నోట్లను కలిగి వుండడం నేరమని అధికారులు పేర్కొన్నారు. రూ.10 వేలు లేదా ఇది ముఖ విలువకు ఐదు రెట్ల పరిమానా విధించవచ్చని తెలిపారు. దీని ప్రకారం రూ. 245 కోట్ల రూపాయల జరిమానా విధించబడుతుంది. ఈకేసులో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులపై కోర్టులో డీఆర్‌ఐ అధికారులు ఫిర్యాదు చేయనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. దాదాపు 68శాతం పోలింగ్ జరిగినట్టు ఈసీ తెలిపారు. కాగా ఈ నెల 14 న మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment