పోస్టల్‌శాఖ బంపర్ ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: పాతపెద్ద నోట్లను డిపాజిట్ల రూపంలో మార్చుకునేందుకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది. పోస్టాపీసుల్లో కొత్తగా సేవింగ్ ఖాతాలు తెరిచి, అందులో ఎంత నగదైనా డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది. హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసుతో పాటు వాటి పరిధిలోని 35 పోస్టాఫీసుల్లో కొత్తగా ఖాతాలు, డిపాజిట్‌ల స్వీకరణకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈశాఖల వద్ద పాత నోట్లను సులభంగా మార్చుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పాత కరెన్సీ మార్పిడికి ఒకేసారి అవకాశం ఉండడంతో పాతనోట్ల డిపాజిట్లపై దృష్టి సారించింది. నగదు మార్పిడి కోసం వచ్చేవారికి పోస్టాఫీసుల్లోని ఖాతాలు, డిపాజిట్ పరిమితి, వచ్చే వడ్డీపై అవగాహన సైతం కల్పిస్తోంది.