ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తొలి ఒకటి రెండు రోజుల్లో భారతీయ బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. బ్యాంకు షేర్లు ఇక తారాజువ్వల్లా ఎగురుతాయని ఇన్వెస్టర్లు భావించారు. దానికి తగ్గట్లే అంతర్జాతీయ సంస్థలు, అనలిస్టులు అంతా... ‘‘ఇంకేముంది! అందరూ తమ పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. చాలామంది సేవింగ్‌స ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు గనక బ్యాంకింగ్ వ్యవస్థలోకి విపరీతమైన డబ్బులొస్తారుు. అవి వాటిపై సేవింగ్‌స వడ్డీనే చెల్లిస్తారుు కనక వాటికి అతితక్కువ ఖర్చుకు బోలెడంత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్‌కు శుభ సమయం’’ అంటూ ఊదరగొట్టేశారు. అనుకున్నట్లే తొలి రెండు మూడు రోజులు బ్యాంకు షేర్లు రివ్వుమన్నారుు. కాకపోతే... ఆ తరవాత మెల్లగా తత్వం బోధపడింది. అందరికీ విషయం అర్థమైంది.