Indian banking sector
-
ఫస్ట్‌టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
దేశంలో ఐటీ రంగాన్ని వెనక్కి నెట్టి బ్యాంకింగ్ రంగం సరికొత్త మైలురాయిని సాధించింది. తొలిసారిగా 2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం నికర లాభం రూ. 3 లక్షల కోట్లను అధిగమించింది. లిస్టెడ్ పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకుల సంయుక్త నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 2.2 లక్షల కోట్లతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ. 3.1 లక్షల కోట్లకు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.ఐటీ రంగాన్ని దాటి.. ఇటీవలి కాలంలో సాంప్రదాయకంగా అత్యంత లాభదాయక రంగంగా ఉన్న ఐటీ సేవల రంగాన్ని బ్యాంకుల లాభాలు అధిగమించాయి. 2024లో లిస్టెడ్ ఐటీ సేవల కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. ఇది బ్యాంకులు ఆర్జించిన లాభాల కంటే చాలా తక్కువ.ప్రభత్వ, ప్రైవేట్ బ్యాంకుల లాభాలు ఇలా.. ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల నికర లాభాన్ని సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల నికర లాభం 42 శాతం పెరిగి దాదాపు రూ.1.7 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.ప్రధాని ట్వీట్ దేశంలో బ్యాంకింగ్ రంగం రికార్డ్ స్థాయి లాభాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘గత 10 సంవత్సరాలలో చెప్పుకోదగ్గ మలుపు. భారతదేశ బ్యాంకింగ్ రంగ నికర లాభం మొదటిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటింది. బ్యాంకుల లాభాలు మెరుగుపడటం పేదలు, రైతులు, ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.In a remarkable turnaround in the last 10 years, India's banking sector net profit crosses Rs 3 lakh crore for the first time ever.When we came to power, our banks were reeling with losses and high NPAs due to the phone-banking policy of UPA. The doors of the banks were closed…— Narendra Modi (@narendramodi) May 20, 2024 -
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
భారత్ బ్యాంకింగ్.. భేష్
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ‘స్థిర’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ బుధవారం పేర్కొంది. ఆర్థిక వృద్ధి, మెరుగైన ఫైనాన్షియల్ పరిస్థితులు ఇందుకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ‘మార్చితో ముగిసే 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కొంత తగ్గుతుందని భావిస్తున్న విషయం వాస్తవం. అయితే దేశ వృద్ధికి సంబంధించి పరిస్థితులు, ఫండమెంటల్స్ అన్నీ పటిష్టంగా ఉన్నాయి. ఆయా అంశాలు బ్యాంకింగ్ రుణ వృద్ధికి, రుణ నాణ్యతకు దోహదపడతాయి’’ అని మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ)కు సంబంధించి బ్యాంకుల రుణ నాణ్యత కొంత ఇబ్బందుల్లోనే ఉంది. వడ్డీరేట్లలో పెరుగుదల దీనికి కారణం. ► అయితే మొత్తంగా చూస్తే, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండిబకాయిలు (ఎన్పీఎల్) నిష్పత్తులు స్వల్పంగా తగ్గాయి. రికవరీలు, ఎప్పటినుంచో పేరుకుపోయిన రుణాల రైటాఫ్‌లు దీనికి కారణం. ► బ్యాంకుల లాభదాయకత గత కొన్నేళ్లుగా మెరుగుపడింది. రుణ–నష్టాల కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) కూడా తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకుల మూలధనం, నిధులు, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత, సరఫరాలు) పరిస్థితులు స్థిరంగా ఉన్నాయి. ఆయా అంశాలు రుణ వృద్ధికి సైతం మద్దతును ఇస్తున్నాయి. ► అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. బ్యాంకింగ్‌కు స్టేబుల్ అవుట్‌లుక్ కొనసాగించడానికి ఇది కూడా ఒక కారణం. 2023–24లో భారత్ జీడీపీ వృద్ధి 5.5 శాతంగా, 2024–2025లో 6.5 శాతంగా నమోదవుతుందని భావిస్తున్నాం. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ) అంచనాలు వేస్తున్నప్పటికీ, క్లిష్ట, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇది తగిన వృద్ధి రేటే. దీనికి దేశీయ వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు మద్దతును ఇస్తున్నాయి. ► ప్రైవేట్ కార్పొరేట్ల నుంచి కూడా రుణ డిమాండ్ బలంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బ ణం వంటి క్లిష్ట అంశాలు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పెంచడం, కంపెనీలు తమ ఫైనాన్సింగ్ అవసరాలను తక్కువ వ్యయాలతో తీర్చుకోవడానికి దేశీయ బ్యాంకుల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు ఈ అంచనాలకు కారణం. వృద్ధి అంచనా పెంపు 2023–24 భారత్ అంచనాలను కిత్రం 4.8 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మూలధన కేటాయింపుల పెంపు (2022–23లో రూ.7.5 లక్షల కోట్లుగా ఉన్న మొత్తాలను రూ.10 లక్షల కోట్లకు పెంపు. జీడీపీలో 3.3 శాతం) దీనికి కారణం. అయితే 2022–23కు సంబంధించి తన అంచనాలను 7 శాతం నుంచి (నవంబర్‌లో అంచనా) 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. 2024–25 లో వృద్ధి అంచనాలను 6.5 శాతంగా తన గత తాజా గ్లోబల్ మ్యాక్రో అవుట్‌లుక్‌లో పేర్కొంది. జీ20 దేశాల పురోగతి ఇలా... ఇక జీ20 దేశాల వృద్ధి 2022లో 2.7 శాతంగా ఉంటే, 2023లో 2 శాతానికి తగ్గుతుందని మూడీస్ అంచనావేసింది. అయితే 2024లో 2.4 శాతానికి మెరుగవుతుందని తెలిపింది. చైనాకు సంబంధించి వృద్ధి రేటు 2022ల 3 శాతం ఉంటే, 2023లో 5 శాతానికి మెరుగుపడుతుందని తెలిపింది. దీని ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్ కొనసాగిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ఎస్బీఐ మంత్లీ ఇన్స్టాల్మెంట్ల భారం.. నెల రోజుల్లో రెండవ‘సారి’
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్) పది బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ పెరిగింది. అన్ని కాలపరిమితులకు తాజా పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాలకు సంబంధించి నెలవారీ రుణ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) భారం వినియోగదారులపై పెరగనుంది. నెలరోజుల వ్యవధిలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరగడం ఇది రెండవసారి . ఇప్పటికే బ్యాంక్ 10 బేసిస్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ను పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో అనూహ్యంగా 40 బేసిస్ పాయింట్లు (4 శాతం నుంచి 4.4%కి) పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ, స్థిర డిపాజిట్ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ తాజా రెండవ దఫా రేటు పెంపుతో ఇదే బాటలో పలు బ్యాంకులు రెండవ రౌండ్ రేట్ల పెంపు దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎస్బీఐ తాజా నిర్ణయం, ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఎస్బీఐ వెబ్సైట్ సమాచారం ప్రకారం, తాజా రేటు పెంపు మే 15 నుంచి అమల్లోకి వస్తుంది. ► దీని ప్రకారం, ఏడాది ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.20 శాతానికి పెరిగింది. పలు రుణాలు ఈ కాల పరిమితికి అనుసంధానమై ఉంటాయి. ► ఓవర్‌నైట్, నెల, 3 నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85%కి చేరింది. ► రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 0.1 శాతం పెరిగి 7.4 శాతానికి చేరింది. ► మూడేళ్ల రేటు 7.50 శాతానికి ఎగసింది. ► కాగా, ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) ప్రస్తుతం 6.65 శాతంగా ఉంది. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 6.25 శాతంగా ఉంది. ► గృహ, ఆటో లోన్లతో సహా ఏ లోన్‌ను మంజూరు సమయంలోనైనా బ్యాంకులు ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్కు క్రెడిట్ రిస్క్ ప్రీమియం (సీఆర్పీ)ను కలుపుతాయి. ఆగస్టు నాటికి రెపో 0.75 శాతం పెరగొచ్చు ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా ఇదిలావుండగా, తీవ్ర ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటు ఆగస్టు నాటికి మరో 75 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం తీవ్రంగా పెరిగిన ద్రవ్యోల్బణంలో కనీసం 59 శాతం ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల తలెత్తిన భౌగోళిక రాజకీయ సంఘర్షణే కారణం. కరోనా మహమ్మారికి ముందు రెపో రేటు 5.15 శాతంగా ఉండేది. ఆగస్టు నాటికి తిరిగి ఈ స్థాయికి కీలక రేటు చేరుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిని బేస్ ఇయర్‌గా తీసుకుంటే అటు తర్వాత మొత్తం ద్రవ్యోల్బణంలో 52 శాతం యుద్ధమే కారణం. ఆహారం, పానీయాలు, ఇంధనం, విద్యుత్, రవాణా రంగాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీసీ) రంగానికి ఇన్పుట్ ధరల పెరుగుదల ప్రభావం మరో 7% ఉంది. ద్రవ్యోల్బణం సమీపకాలంలో తగ్గే అవకాశం లేదు. ధరల పెరుగుదల విషయంలో గ్రామీణ–పట్టణ ప్రాం తాల మధ్య వ్యత్యాసం ఉంది. అధిక ఆహార ధరల ఒత్తిడితో గ్రామీణ ప్రాంతాలు ఇబ్బంది పడుతుంటే, పట్టణ ప్రాంతాల విషయంలో ఇంధన ధరల పెంపుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జూన్, ఆగస్టు నెలల్లో జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ విధాన కమిటీ రేట్లు 0.75 బేసిస్ పాయింట్లు పెంచినా, యుద్ధ–సంబంధిత అంతరాయాలు త్వరగా తగ్గకపోతే ‘రేట్ల పెంపుదల కారణంగా ద్రవ్యోల్బణం అర్థవంతంగా తగ్గిపోతుందా లేదా’ అనేది సెంట్రల్ బ్యాంక్ ఆలోచించవలసిన అతిపెద్ద ప్రశ్న. ద్రవ్యోల్బణం తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, స్థిరమైన రేటు పెరుగుదల వల్ల వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలించాలి. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
నోట్ల రద్దు: బ్యాంకులకు ప్రాణ సంకటం!
-
పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం!
• ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ అవుతున్న పాత నోట్లు • రుణాలివ్వటానికి బ్యాంకుల వద్ద కొత్తనోట్లు లేవు • ఇపుడున్న పరిస్థితుల్లో తీసుకునేవారూ కరువే • వ్యాపారం చేయకున్నా ఈ డిపాజిట్లపై వడ్డీ చెల్లించాలి • ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు • కొన్నాళ్లు ఇవే పరిస్థితులు కొనసాగితే బ్యాంకులకు ఇబ్బందే! సాక్షి, బిజినెస్ విభాగం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తొలి ఒకటి రెండు రోజుల్లో భారతీయ బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. బ్యాంకు షేర్లు ఇక తారాజువ్వల్లా ఎగురుతాయని ఇన్వెస్టర్లు భావించారు. దానికి తగ్గట్లే అంతర్జాతీయ సంస్థలు, అనలిస్టులు అంతా... ‘‘ఇంకేముంది! అందరూ తమ పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. చాలామంది సేవింగ్స ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు గనక బ్యాంకింగ్ వ్యవస్థలోకి విపరీతమైన డబ్బులొస్తారుు. అవి వాటిపై సేవింగ్స వడ్డీనే చెల్లిస్తారుు కనక వాటికి అతితక్కువ ఖర్చుకు బోలెడంత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్‌కు శుభ సమయం’’ అంటూ ఊదరగొట్టేశారు. అనుకున్నట్లే తొలి రెండు మూడు రోజులు బ్యాంకు షేర్లు రివ్వుమన్నారుు. కాకపోతే... ఆ తరవాత మెల్లగా తత్వం బోధపడింది. అందరికీ విషయం అర్థమైంది. ఫలితం... బ్యాంకు షేర్ల పతనం మొదలైంది. భవిష్యత్తు చాలా ఇబ్బందికరం!! నిజానికిపుడు సమస్యల్లా బ్యాంకు షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది కాదు. అసలు బ్యాంకులు మున్ముందు ఏమవుతాయా..? అన్నది. ఎందుకంటే ఇపుడు బ్యాంకుల ముందున్నది చాలా చిత్రమైన సమస్య. బ్యాంకింగ్ రంగం పుట్టినప్పటి నుంచీ వాటికెప్పుడూ ఎదురుకాని సమస్య. అదేమంటే... పాత నోట్లన్నీ ఇపుడు జనమంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల వరకూ జమరుునట్లు బ్యాంకులు చెబుతున్నారుు. ఇంకా డిసెంబరు 31 వరకూ... అంటే దాదాపు 32 రోజుల సమయం ఉంది. ప్రభుత్వం ఆశిస్తున్నట్లే జరిగినా కూడా కనీసం రూ.11-12 లక్షల కోట్లు జమవుతారుు. వీటిని జనం వెనక్కి తీసుకోవటానికి ప్రస్తుతం ఏ బ్యాంకు దగ్గరా నగదు అందుబాటులో లేదు. మరో ఐదారు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అంచనాలున్నారుు. వడ్డీ ఎలా చెల్లిస్తారుు? సరే!! తమ వద్ద డిపాజిట్టరుున డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇవ్వాలి కదా!!. సేవింగ్స ఖాతా వడ్డీ చూసినా 4 శాతంగా ఉంది. ఎస్బీఐ వంటి దిగ్గజాలు ఇదే వడ్డీ చెల్లిస్తున్నా... కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని బ్యాంకులు ఇంతకన్నా కాస్త ఎక్కువ కూడా చెల్లిస్తున్నారుు. కాకపోతే డిపాజిట్దారులంతా తమ సేవింగ్స ఖాతాల్లోనే డబ్బులు వేశారనుకోలేం. కొందరైతే 7-7.5 శాతం వడ్డీకి టర్మ్ డిపాజిట్లు కూడా చేస్తున్నారు. వీరికి వడ్డీ చెల్లించాలంటే బ్యాంకులు వ్యాపారం చెయ్యాలి. వ్యాపారమంటే రకరకాల రుణాలివ్వాలి. అసలు బ్యాంకుల దగ్గర కొత్త నోట్లే లేనపుడు అవి రుణాలెలా ఇస్తారుు? డీడీ రూపంలోనో, చెక్కుల రూపంలోనో రుణాలిస్తే... నగదు తీసుకునే అవకాశం లేదు కనక ఇపుడెవరు తీసుకుంటారు? ఎందుకంటే ఎవరైనా రుణాలు తీసుకునేది ఖర్చుల కోసమే. ఖర్చుల్లో చాలావరకూ నగదుతోనే ముడిపడి ఉంటారుు తప్ప అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో చేసేవి కావు. అందుకని రుణాలిచ్చినా తీసుకోవటానికిపుడు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. మరో ఆరేడు నెలలు ఇదే పరిస్థితి ఉంటే అప్పటిదాకా అవి రుణాలివ్వలేవు కదా!!. రుణాలివ్వనపుడు వాటికి ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం రాకపోతే అవి వడ్డీ ఎలా చెల్లిస్తారుు? సగటున కనీసం 6 శాతం వడ్డీ చూసుకున్నా... ఆరు నెలలకు కనీసం రూ.3వేల కోట్లు వడ్డీ చెల్లించాలి కదా!!. అసలు వడ్డీ మాట పక్కనబెడితే... బ్యాంకుల నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలంటే అవి ఏం చేస్తారుు? కొన్ని వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారుు? ఇప్పటికే విపరీతమైన మొండి బకారుుల భారంతో నష్టాలు చూపిస్తున్న బ్యాంకుల భవిష్యత్తేంటి? సీఆర్ఆర్ కింద పెడితే పరిస్థితేంటి? బ్యాంకులు తమ వద్ద సెప్టెంబర్ 16-నవంబర్ 11 మధ్య డిపాజిట్ అరుున సొమ్ము ను రిజర్వు బ్యాంకు వద్ద సీఆర్ఆర్ కింద పెట్టాలని రెండురోజుల కిందట ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆదేశాలు జారీచేశారు. సీఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన సొమ్మన్న మాట. అలా పెడితే దానికి వడ్డీ రాదు. మరి బ్యాంకులకే వడ్డీ రానపుడు అవి కస్టమర్లకెలా చెల్లిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరో కోణంలో చూస్తే.. నోట్ల రద్దు దెబ్బకు ఇప్పటికే చాలా వ్యాపారాలు మందగించారుు. కాస్త పరిస్థితి సర్దుకున్నాక ఓ ఆరేడు నెలల తరవాతైనా బ్యాంకుల చేతికి పూర్తి స్థారుులో నగదు వస్తే అవి రుణాలివ్వటం మొదలెడతారుు. రుణాలు తీసుకున్నవారు తమ వ్యాపారాల్ని మళ్లీ పూర్తిస్థారుులో పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది. మరి ఆలోగా వారు వారుుదాలు చెల్లిస్తారా? ఒకవేళ చెల్లించని పరిస్థితులు నెలకొంటే మళ్లీ ఎన్పీఏల భారం పెరుగుతుంది కదా? ఇదంతా చూస్తుంటే బ్యాంకుల భవిష్యత్తుపై ఆందోళన కలగటం లేదూ!!?