పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం! | indian banking sector suffering with old notes deposit | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం!

Published Tue, Nov 29 2016 12:42 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం! - Sakshi

పెద్ద నోట్ల రద్దు ప్రభావం బ్యాంకులకు ప్రాణసంకటం!

ఇబ్బడిముబ్బడిగా డిపాజిట్ అవుతున్న పాత నోట్లు
రుణాలివ్వటానికి బ్యాంకుల వద్ద కొత్తనోట్లు లేవు  
ఇపుడున్న పరిస్థితుల్లో తీసుకునేవారూ కరువే
వ్యాపారం చేయకున్నా ఈ డిపాజిట్లపై వడ్డీ చెల్లించాలి  
ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు తడిసిమోపెడు
కొన్నాళ్లు ఇవే పరిస్థితులు కొనసాగితే బ్యాంకులకు ఇబ్బందే! 

సాక్షి, బిజినెస్ విభాగం
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తొలి ఒకటి రెండు రోజుల్లో భారతీయ బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. బ్యాంకు షేర్లు ఇక తారాజువ్వల్లా ఎగురుతాయని ఇన్వెస్టర్లు భావించారు. దానికి తగ్గట్లే అంతర్జాతీయ సంస్థలు, అనలిస్టులు అంతా... ‘‘ఇంకేముంది! అందరూ తమ పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. చాలామంది సేవింగ్‌‌స ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు గనక బ్యాంకింగ్ వ్యవస్థలోకి విపరీతమైన డబ్బులొస్తారుు. అవి వాటిపై సేవింగ్‌‌స వడ్డీనే చెల్లిస్తారుు కనక వాటికి అతితక్కువ ఖర్చుకు బోలెడంత డబ్బు అందుబాటులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్‌కు శుభ సమయం’’ అంటూ ఊదరగొట్టేశారు. అనుకున్నట్లే తొలి రెండు మూడు రోజులు బ్యాంకు షేర్లు రివ్వుమన్నారుు. కాకపోతే... ఆ తరవాత మెల్లగా తత్వం బోధపడింది. అందరికీ విషయం అర్థమైంది. ఫలితం... బ్యాంకు షేర్ల పతనం మొదలైంది.

భవిష్యత్తు చాలా ఇబ్బందికరం!!
నిజానికిపుడు సమస్యల్లా బ్యాంకు షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది కాదు. అసలు బ్యాంకులు మున్ముందు ఏమవుతాయా..? అన్నది. ఎందుకంటే ఇపుడు బ్యాంకుల ముందున్నది చాలా చిత్రమైన సమస్య. బ్యాంకింగ్ రంగం పుట్టినప్పటి నుంచీ వాటికెప్పుడూ ఎదురుకాని సమస్య. అదేమంటే... పాత నోట్లన్నీ ఇపుడు జనమంతా బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల వరకూ జమరుునట్లు బ్యాంకులు చెబుతున్నారుు. ఇంకా డిసెంబరు 31 వరకూ... అంటే దాదాపు 32 రోజుల సమయం ఉంది. ప్రభుత్వం ఆశిస్తున్నట్లే జరిగినా కూడా కనీసం రూ.11-12 లక్షల కోట్లు జమవుతారుు. వీటిని జనం వెనక్కి తీసుకోవటానికి ప్రస్తుతం ఏ బ్యాంకు దగ్గరా నగదు అందుబాటులో లేదు. మరో ఐదారు నెలలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అంచనాలున్నారుు.

వడ్డీ ఎలా చెల్లిస్తారుు?
సరే!! తమ వద్ద డిపాజిట్టరుున డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇవ్వాలి కదా!!. సేవింగ్‌‌స ఖాతా వడ్డీ చూసినా 4 శాతంగా ఉంది. ఎస్‌బీఐ వంటి దిగ్గజాలు ఇదే వడ్డీ చెల్లిస్తున్నా... కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని బ్యాంకులు ఇంతకన్నా కాస్త ఎక్కువ కూడా చెల్లిస్తున్నారుు. కాకపోతే డిపాజిట్‌దారులంతా తమ సేవింగ్‌‌స ఖాతాల్లోనే డబ్బులు వేశారనుకోలేం. కొందరైతే 7-7.5 శాతం వడ్డీకి టర్మ్ డిపాజిట్లు కూడా చేస్తున్నారు. వీరికి వడ్డీ చెల్లించాలంటే బ్యాంకులు వ్యాపారం చెయ్యాలి. వ్యాపారమంటే రకరకాల రుణాలివ్వాలి. అసలు బ్యాంకుల దగ్గర కొత్త నోట్లే లేనపుడు అవి రుణాలెలా ఇస్తారుు? డీడీ రూపంలోనో, చెక్కుల రూపంలోనో రుణాలిస్తే... నగదు తీసుకునే అవకాశం లేదు కనక ఇపుడెవరు తీసుకుంటారు? ఎందుకంటే ఎవరైనా రుణాలు తీసుకునేది ఖర్చుల కోసమే.

ఖర్చుల్లో చాలావరకూ నగదుతోనే ముడిపడి ఉంటారుు తప్ప అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో చేసేవి కావు. అందుకని రుణాలిచ్చినా తీసుకోవటానికిపుడు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. మరో ఆరేడు నెలలు ఇదే పరిస్థితి ఉంటే అప్పటిదాకా అవి రుణాలివ్వలేవు కదా!!. రుణాలివ్వనపుడు వాటికి ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం రాకపోతే అవి వడ్డీ ఎలా చెల్లిస్తారుు? సగటున కనీసం 6 శాతం వడ్డీ చూసుకున్నా... ఆరు నెలలకు కనీసం రూ.3వేల కోట్లు వడ్డీ చెల్లించాలి కదా!!. అసలు వడ్డీ మాట పక్కనబెడితే... బ్యాంకుల నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాలంటే అవి ఏం చేస్తారుు? కొన్ని వేల కోట్లను ఎక్కడి నుంచి తెస్తారుు? ఇప్పటికే విపరీతమైన మొండి బకారుుల భారంతో నష్టాలు చూపిస్తున్న బ్యాంకుల భవిష్యత్తేంటి?

సీఆర్‌ఆర్ కింద పెడితే పరిస్థితేంటి?
బ్యాంకులు తమ వద్ద సెప్టెంబర్ 16-నవంబర్ 11 మధ్య డిపాజిట్ అరుున సొమ్ము ను రిజర్వు బ్యాంకు వద్ద సీఆర్‌ఆర్ కింద పెట్టాలని రెండురోజుల కిందట ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆదేశాలు జారీచేశారు. సీఆర్‌ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన సొమ్మన్న మాట. అలా పెడితే దానికి వడ్డీ రాదు. మరి బ్యాంకులకే వడ్డీ రానపుడు అవి కస్టమర్లకెలా చెల్లిస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరో కోణంలో చూస్తే..   నోట్ల రద్దు దెబ్బకు ఇప్పటికే చాలా వ్యాపారాలు మందగించారుు. కాస్త పరిస్థితి సర్దుకున్నాక ఓ ఆరేడు నెలల తరవాతైనా బ్యాంకుల చేతికి పూర్తి స్థారుులో నగదు వస్తే అవి రుణాలివ్వటం మొదలెడతారుు. రుణాలు తీసుకున్నవారు తమ వ్యాపారాల్ని మళ్లీ పూర్తిస్థారుులో పునరుద్ధరించడానికి కొంత సమయం పడుతుంది. మరి ఆలోగా వారు వారుుదాలు చెల్లిస్తారా? ఒకవేళ చెల్లించని పరిస్థితులు నెలకొంటే మళ్లీ ఎన్‌పీఏల భారం పెరుగుతుంది కదా? ఇదంతా చూస్తుంటే బ్యాంకుల భవిష్యత్తుపై ఆందోళన కలగటం లేదూ!!?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement