నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్
గోపాలపట్నం: పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి చేస్తామంటూ మోసగిస్తున్న ముఠాలో ఏడుగురిని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేశారు. రద్దు చేసిన నోట్లు ఇస్తే తిరిగి అంతే మొత్తానికి కొత్త నోట్లు ఇస్తామంటూ 13మంది సభ్యుల ముఠా మోసగిస్తోంది.
రామకృష్ణ అనే వ్యక్తి రూ.4 లక్షలకు పాత నోట్లు ఇవ్వగా ఈ ముఠా అతడికి రూ.4 లక్షలు ఇచ్చింది. అయితే అందులో నకిలీ కరెన్సీ ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ముఠాలోని ఏడుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరినుంచి రూ.1.20 లక్షల నగదు, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.