టోల్ ట్యాక్స్ రద్దు పొడిగించిన కేంద్రం..
Published Fri, Nov 11 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనదారులకు మరికొద్ది రోజులు వెసులుబాటు లభించింది. దేశవ్యాప్తంగా టోల్ ఫ్లాజాల వద్ద ట్యాక్స్ రద్దును కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈ వెలుసుబాటు నవంబర్ 14 అర్థరాత్రి వరకూ అమల్లో ఉంటుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి వెల్లడించారు. కాగా రూ.500, 1000 నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు టోల్ ఫ్లాజాల వద్ద చిల్లర సమస్యతో పాటు, పాత నోట్లు తీసుకునేందుకు అక్కడ సిబ్బంది నిరాకరించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దీంతో కేంద్రం టోల్ ట్యాక్స్‌ను మరో మూడు రోజులు పొడిగిస్తూ ప్రకటన చేసింది. తొలుత 11వ తేదీ అర్ధరాత్రి వరకు పన్ను వసూళ్లను నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ.. దేశవ్యాప్తంగా కొత్త నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పాత నోట్ల వినియోగంపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ బిల్లులు, పన్నులు చెల్లించేందుకు గడువు పొడిగించింది. నవంబర్14 అర్ధరాత్రి వరకూ కేంద్రం ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది.
Advertisement
Advertisement