Rs.500
-
నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూ.500,1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేశారు. నల్లధనం కట్టడికి కఠిన నిర్ణయాలు తప్పనిసరి అని, క్యాలెండర్లో 9వ తేదీ రాగానే పెద్దనోట్లు చెల్లవని, అక్రమార్కులకు అవి చెత్త కాగితాలే అని, చట్టబద్ధమైన మార్పిడి సాధనాలుగా ఉండబోవని తెలిపారు. పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో ప్రజలు దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ పలు నిబంధనలతో పాటు సడలింపులు చేసింది. పెద్ద నోట్ల మార్పిడి విషయంలో ఆస్పత్రులు,రైల్వేస్టేషన్లు, పెట్రోల్ బంక్‌లు, పాలకేంద్రాలకు మినహాయింపు ఇచ్చింది. రెండు రోజులు మాత్రమే పెద్దనోట్లు చెల్లుతాయని వెల్లడించిన ఆ శాఖ ఆ తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆ పరిమితిని పెంచింది. చదవండి: (నోట్ల కష్టాలు... మరో ఆరు నెలలు!) ఫిబ్రవరి 8 ► సగటు వినియోగదారుడికి ఊరట ► మార్చి 13 నుంచి క్యాష్ విత్‌డ్రాపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత ► రెండు విడతల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు తొలగిస్తాం: ఆర్బీఐ ► ఫిబ్రవరి 20 నుంచి ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50వేలకు పెంపు ► ప్రస్తుతం ఏటీఏం విత్‌డ్రా పరిమితి వారానికి రూ.24వేలు జనవరి 16 ► ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు ► ఏటీఎం నుంచి ఇక రోజుకు 10 వేలు విత్‌డ్రాకు అవకాశం ► అయితే.. వారానికి 24 వేలే! ► కరెంట్ అకౌంట్ల పరిమితి కూడా రూ.50వేల నుంచి రూ. లక్షకు పెంపు ► పాత నోట్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం జనవరి 8 ► కో ఆపరేటివ్ బ్యాంకులు సహా ఇతర బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు నుంచి వివరాలు కోరిన ఐటీ ► ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు నగదు డిపాజిట్ వివరాలు సమర్పించాలని ఐటీ ఆదేశాలు ►ఫిబ్రవరి 28,2017 లోపు నివేదిక సమర్పించాలి. జనవరి 2 ► పెద్ద నోట్ల డిపాజిట్లలో ఎన్ ఆర్ ఐ లకు ఆర్థికశాఖ కొత్త మెలిక పెట్టింది. ► విదేశాలకు వెళ్ళే భారతీయులు అయితే మార్చి 31 వరకు వరకు ►ఎన్ఆర్ ఐ లకు జూన్ 30వరకు ఆర్ బి ఐ శాఖల్లో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. ► డిపాజిట్ కంటే ముందు కస్టమ్స్ అధికారుల నుండి ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని ఆర్థికశాఖ తేల్చింది. జనవరి 1 ►రద్దుచేసిన నగదు నోట్లను మార్చుకొనేందుకు ఎన్ఆర్ఐ లకు 2017 ,జూన్ 30 వరకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ►ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరు రూ.25 వేలకు పరిమితి డిసెంబర్ 30 ►విత్ డ్రా పరిమితి పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ►రోజుకు ప్రస్తుతమున్న రూ. 2500 విత్ డ్రా పరిమితిని 4500కు పెంపు ► ఈ సదుపాయం జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. డిసెంబర్ 29 ►కేంద్రం మరో యూటర్న్. పాతనోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం జారీచేసిన తాజా ఆర్డినెన్స్‌లో కీలక సవరణ చేసింది. ►రద్దయిన పాతనోట్లనుకలిగి ఉంటే జైలు శిక్ష తప్పదనే నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది. ► రూ.1000, రూ.500 నోట్లు కల్గివుంటే రూ.10వేలు కనీస జరిమానా ►ఈ ఆర్డినెన్స్ గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు చేరుకోనుంది. ►అధ్యక్షుని ఆమోదం అనంతరం ఈ నెల 31నుంచి ఈ ఆర్డినెన్స్ అమలులోకి రానుంది. డిసెంబర్ 28 ►పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం: ఆర్డినెన్స్ కు ఒకే చెప్పిన క్యాబినెట్ ►2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష ►డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపితే రూ.5వేల వరకు జరిమానా డిసెంబర్26 ► రద్దయిన నోట్లు 10 వేలకు పైగా కలిగి ఉంటే భారీ జరిమానా ►త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనున్న కేంద్రం ► రూ.50 వేల జరిమానా, లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదురెట్ల జరిమానా ► ప్రత్యేక సందర్భాల్లో మేజిస్ట్రేట్ ద్వారా జరిమానా నిర్ణయం ► డిసెంబర్ 30 తరువాత రద్దయిన నోట్లు కేవలం రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో మాత్రమే డిపాజిట్ చేసే సదుపాయం డిసెంబర్ 25 ► ఆస్తులు జప్తు చేసుకునేందుకు కేంద్రం అడుగులు ► బినామీ అని రుజువైతే ఏడేళ్ల వరకు జైలు.. ► ఆస్తి విలువలో 25% జరిమానా ► తప్పుడు సమాచారమిచ్చినా 10 శాతం ఫైన్ ► ఆదాయానికి మించినా.. లెక్క చెప్పలేని ఆస్తులున్నా ఇదే చట్టం ► పాత చట్టాన్ని ఆగస్టులోనే సవరించిన కేంద్రం ► జప్తులో జాప్యం నివారణకు మరోసారి సవరణ యోచన ► ఈ నెల 30తో ‘నోట్ల రద్దు’కు ముగియనున్న గడువు ► ఆ తర్వాత బినామీలపై చర్యలకు కసరత్తు డిసెంబర్ 21 ►వేతనాల చెల్లింపు చట్టం-1936లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆర్డినెన్స్ జారీ ►నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో ఇక చెక్కులు లేదా బ్యాంకుల ద్వారానే జీతాల చెల్లింపు ► చెక్కుల ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లింపు ►పాత నోట్ల డిపాజిట్లపై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్ బీఐ. డిసెంబర్ 30 వరకు రూ.5 వేలకు పైన డిపాజిట్లు ఒకసారే అన్న నిబంధనను రిజర్వ్ బ్యాంక్ బుధవారం ఉపసంహరించుకుంది. డిసెంబర్ 20 ► నగదు రహిత ఆర్థిక వ్యవస్థ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్బీఐ దగ్గర ఇపుడు సరిపడా నగదు ఉంది. ఆధార ఆధారిత లావాదేవీలు దాదాపు 300 శాతం పెరిగాయి ► నగదుఆర్థిక వ్యవస్థకోసం చిన్నవ్యాపారులకు పన్ను ప్రోత్సాహకాలు, డిజిటల్ లావాదేవీలు జరిపిన చిన్న వ్యాపారులకు 6శాతం పన్ను దీని మూలంగా మొత్తం 30 శాతానికి పైగా చిన్న వ్యాపారులను పన్ను మినహాయింపు. డిసెంబర్ 19 ► రూ.2కోట్లు కంటే ఆదాయం తక్కువగా ఉన్న వ్యాపారులు తమ వినియోగదారులను డిజిటల్ లావాదేవీల దిశగా ప్రోత్సహిస్తే వారికి పన్నులో కొంత మినహాయింపు- కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ► ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 44ఏడీ ప్రకారం రూ.2కోట్లు, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారు 8శాతం పన్ను చెల్లించాలి. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిగా డిజిటల్ లావాదేవీలు జరిపితే వారికి పన్నులో కొంత రాయితీ ఇచ్చి ఆరు శాతం మాత్రమే వసూలు ► నగదు లావాదేవీలు నిర్వహించిన వారికి యథావిధిగా 8శాతం పన్ను వర్తింపు. ► పెద్ద నోట్ల కష్టాలు త్వరలోనే తీరుతాయి: జైట్లీ ► డిమాండ్‌కు సరిపడ నగదు అందుబాటులో ఉంది : జైట్లీ ► నగదు విత్‌డ్రా పరిమితి ఎత్తివేతపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: జైట్లీ డిసెంబర్ 18 ►డిపాజిట్లపై కొత్త నిబంధన: రూ.ఐదువేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. డిసెంబర్ 18 ► రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు షరతులతో కూడిన పన్ను మినహాయింపు. డిసెంబర్ 31 వరకు రద్దయిన నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15 ►డిజిటల్ చెల్లింపులకు నీతి ఆయోగ్ భారీ ప్రోత్సాహకాలు: రెండుకొత్త పథకాలు లక్కీ గ్రాహక్ యోజన , డిజిధన్ వ్యాపారి యోజన. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు, వ్యాపారస్తులకు బంపర్ బహుమతులు. డిసెంబర్ 9 ►డిజిటల్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేదా ఎండీఆర్లకు సంబంధించి ఒక్కో లావాదేవీకి రూ.2,000 వరకు డిజిటల్ చెల్లింపులపై సర్వీస్ టాక్స్ రద్దు ►డిజిటల్ రూపంలో (డెబిట్ / క్రెడిట్ కార్డు, ఇ-వాలెట్స్, మొబైల్ వాలెట్స్ తదితరాలు) పెట్రోలు, డీజిల్ కొనుగోలు పై కొనుగోలుదారులకు విక్రయ ధరపై 0.75 శాతం తగ్గింపు ► పదివేల కన్నా తక్కువ జనాభా ఉండే ఒక లక్ష గ్రామాల్లో ప్రతీ గ్రామానికి రెండు పీఓఎస్‌ల ఏర్పాటు. రూపే కిసాన్ కార్డులు పీఓఎస్ మెషిన్లు / మైక్రో ఏటీఎం / ఏటీఎంలద్వారా వద్ద నగదు రహిత లావాదేవీలు. దేశవ్యాప్తంగా 4.32 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగిన వారికి లబ్ది ► సబర్బన్ రైల్వే నెట్వర్క్ ద్వారా ప్రోత్సాహకాలు. జనవరి 1 నుంచి నెలవారీ, సీజనల్ టికెట్లను కొనే వారు డిజిటల్ రూపంలో చెల్లిస్తే వారు 0.5 శాతం డిస్కౌంట్ పొందుతారు. ► అన్లైన్ లో టికెట్లు కొనే రైలు ప్రయాణికులందరికీ రూ. 10 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా కల్పించనున్నారు. రోజూ సుమారుగా 14 లక్షల మంది రైలు టికెట్లు కొంటున్నారు. ఇందులో 58 శాతం టికెట్లు ఆన్లైన్లో డిజిటల్ చెల్లింపులతో విక్రయమవుతున్నాయి. మరో 20 శాతం మంది డిజిటల్ చెల్లింపులోకి మారగలరని అంచనా. దీంతో రోజుకు సగటున 11 లక్షల మంది ఈ బీమా పరిధిలోకి వస్తారు. ►రైల్వే అందించే కేటరింగ్, వసతి, విశ్రాంతి గదులు లాంటి పెయిడ్ సేవలకు డిజిటల్ రూపంలో చెల్లింపులపై 5 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. ► ప్రభుత్వరంగ బీమా సంస్థలు సాధారణ బీమా పాలసీలకు డిజిటల్ చెల్లింపులపై 10 శాతం రాయితీని అందించనున్నాయి. అదే విధంగా ఎల్ఐసీ నూతన జీవిత బీమా పాలసీలపై 8 శాతం రాయితీని అందించనుంది. వీటిని పొందేందుకు సంబంధిత పోర్టల్స్ ద్వారా చెల్లింపులు చేయాలి. ► కేంద్ర ప్రభుత్వ విభాగాలకు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెల్లింపులు డిజిటల్ రూపంలో చేస్తే లావాదేవీల ఫీజు / ఎండీఆర్ ఛార్జీల భారాన్ని వినియోగ దారులపై మోపరు. ఆ భారాన్ని ఆయా సంస్థలే భరిస్తాయి. ఇదే విధానాన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ► పీఒఎస్ టర్మినల్స్, మైక్రో ఏటీఎం, మొబైల్ పీఓఎస్లకు నెలవారీ అద్దెను రూ100 లోపుగా తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది. దీంతో చిన్న తరహా వ్యాపారులు మరెందరో వీటిని పొందేందుకు వీలు కలుగుతుంది. ►జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడీ కార్డ్ లేదా ఫాస్ట్ టాగ్స్ ఉపయోగించి చెల్లింపు చేస్తే 2016-17 వరకు 10 శాతం తగ్గింపు. డిసెంబర్ 8 ► ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన డిసెంబర్ 7 ► బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు. డిసెంబర్ 6 ►నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి. డిసెంబర్ 1న ఆర్బీఐ విధించిన పరిమితి... పెట్రోల్ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోళ్లలో ఈ నెల 2వ తేదీ వరకు మాత్రమే పాత 500 రూపాయల నోటు చెల్లుబాటు డిసెంబర్ 1న బంగారంపై విధించిన పరిమితులు: ► వెల్లడించిన డబ్బుతో బంగారం కొంటే ఎలాంటి సమస్య ఉండదు ► పన్ను మినహాయింపు ఉన్న డబ్బుతో కొన్నా ఇబ్బంది లేదు ► ఇంట్లో దాచుకున్న డబ్బుతో బంగారం కొంటే ప్రాబ్లం లేదు ► ఇలా కొన్న బంగారం, నగలపై ఎలాంటి పన్ను ఉండదు ► వారసత్వంగా వచ్చిన బంగారంపైనా పన్ను ఉండదు ► వివాహమైన మహిళ వద్ద అరకేజీ బంగారం ఉంటే సీజ్ చేయం ► పెళ్లికాని మహిళ వద్ద 250 గ్రాములు ఉంటే ఎలాంటి సీజ్ ఉండదు ► పురుషుల వద్ద 100 గ్రామలు వరకు బంగారం ఉండొచ్చు నవంబర్ 30 మార్పులు... ► ప్రధానమంత్రి జన్-ధన్ యోజన ఖాతాల నుంచి విత్‌డ్రా చేసే నగదుపై పరిమితి ► విత్‌డ్రా లిమిట్‌ను పదివేలకు కుదిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడి ► కేవైసి ఖాతాదారులకు నెలలో రూ.10,000, నాన్ కేవైసి ఖాతాదారులకు నెలలో రూ.5000 విత్‌డ్రాకు అనుమతి ► 10వేలకు పైన విత్‌డ్రాకు సరియైన ఆధారాలు, పత్రాలు చూపించిన తరువాత బ్యాంక్ మేనేజర్ అనుమతితో విత్‌డ్రా ► బినామీ ఆస్తి లావాదేవీ, డబ్బు లావాదేవీల నుంచి అమాయక రైతులు, గ్రామీణ ఖాతాదారుల రక్షించడానికి వీలుగా ఈ ప్రకటన నవంబర్ 28వ తేదీ నిబంధనలు... ► డిపాజిట్లలో లెక్కతేలని సొమ్ముపై సర్కారు కన్ను ► స్వచ్ఛందంగా వెల్లడిస్తే పన్ను 50 శాతమే ► మిగిలిన 50 శాతంలో 25 శాతం వెనక్కి తీసుకోవచ్చు ► మరో 25 శాతంపై నాలుగేళ్ల లాకిన్.. వడ్డీ ఉండదు ► దాన్ని పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తామన్న ప్రభుత్వం ► దీనికోసం ప్రధానమంత్రి గరీబీ కల్యాణ్ యోజన పేరుతో కొత్త పథకం ► స్వచ్ఛంద వెల్లడికి గడువు డిసెంబర్ 30 ► వెల్లడించకుండా అధికారుల సోదాల్లో దొరికితే 85% పన్ను ► ఆదాయ పన్ను చట్టంలో సవరణలకు పార్లమెంటులో బిల్లు ► ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నవంబర్ 25వ తేదీ సడలింపులు... ► పాత రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ కౌంటర్లలో మార్చుకోవచ్చు.. ఒకవ్యక్తి పాత నోట్లను మార్చుకునేందుకు పరిమితి రూ.2వేలు. ► ముద్రణ సమస్యల వల్ల కొన్ని కొత్త రూ.500 నోట్లలో తప్పులు దొర్లాయని, అయినా సరే ఆ నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది. ► ఐనాక్స్ థియేటర్ల వద్ద డెబిట్ కార్డులతో రూ.2వేలు తీసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 17 చోట్ల ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ► వ్యక్తుల వద్ద ఉండే బంగారంపై పరిమితి పెట్టాలన్న ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. నవంబర్ 24 మార్పులు(గురువారం) ► బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి రద్దు ► పోస్టాఫీసుల్లోనూ నోట్ల మార్పిడికి అవకాశం ఉండదు ► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌కే రూ. 1,000 నోటు పరిమితం ► 15వ తేదీ వరకు అనుమతించిన చెల్లింపులన్నీ పాత రూ. 500 నోట్లతోనే.. ► జాబితాలో తాజాగా మొబైల్ రీచార్జ్, స్కూలు ఫీజులు, కో-ఆపరేటివ్ స్టోర్లు ► పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిలకు మాత్రమే అవకాశం ► డిసెంబర్ 2 వరకూ టోల్ ట్యాక్స్ రద్దు.. ఎక్కడెక్కడ పాత 500 నోటు చెల్లుతుందంటే.. ► పౌర సేవల బిల్లులు.. కేవలం విద్యుత్, నీటి బిల్లుల కోసమే.. బకాయిలు చెల్లించాలి.. ఆస్తి పన్ను చెల్లింపులకు వర్తించదు ► టోల్ ప్లాజాలు (డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదు) డిసెంబర్ 3 నుంచి 15 వరకు చెల్లించవచ్చు ► పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పాల కేంద్రాలు ►ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు ► డాక్టర్ చీటీతో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలుకు ► రైల్వే టికెట్ కౌంటర్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎరుుర్‌పోర్టు కౌంటర్లు ► ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకూ ఫీజులు చెల్లించవచ్చు. ►రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాల కొనుగోలుకు ► మొబైల్ రీచార్జ్ కోసం.. ఒక రీచార్జ్‌కు ఒక్క నోటే తీసుకుంటారు. ► కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్ల నుంచి రూ. 5 వేల వరకూ కొనుగోళ్లకు ►విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు. వివరాలు పాస్‌పోర్టులో తప్పకుండా నమోదు చేయాలి. ► రైల్వే క్యాటరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు ► చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు నవంబర్ 23 మార్పులు(బుధవారం) ► లక్షా 55 వేల పోస్ట్ ఆఫీసుల్లో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటు ►సహకార బ్యాంకుల్లో నగదునిల్వపై ఆర్బీఐకి ఆదేశాలు ►నాబార్డుకు, సహకార బ్యాంకులకు 21 వేల కోట్లు పంపిణీ ►అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం నవంబర్ 21న (సోమవారం) రైతులకు ఊరట ► కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాదారులు వారంలో రూ. 50 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు: ఆర్బీఐ ► వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసిన ఆర్బీఐ ► పాత పెద్ద నోట్లతో రైతులు ప్రభుత్వ దుకాణాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి ► రైతులు, రక్షణ, పారా మిలటరీ, గ్రూపు సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ఉపసంహరణ నియంత్రణల సడలింపు ►నవంబర్ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్ డ్రా చేశారని ఆర్బీఐ తెలిపింది. నవంబర్ 18న (శుక్రవారం) క్రమంగా నగదు మార్పిడి ఎత్తివేత ► ఏ బ్యాంకులో ఖాతా ఉంటే అక్కడే (శనివారం 19) పాత నోట్లను మార్చుకోవాలి. అయితే సీనియర్ సిటిజన్స్ కు మినహాయింపు ► ఆదివారం బ్యాంకులు పని చేయవు ► బ్యాంకు లాకర్లు సీజ్ చేసి బంగారం, వజ్రాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకుంటారన్న వార్తలన్నీవదంతులే అని ఆర్థిక శాఖ వెల్లడి ► నగదు మార్పిడిని రూ.2వేలకు తగ్గించిన కేంద్రం క్రమంగా దాన్ని ఉపసంహరించాలని యోచన ► దానికి బదులుగా నగదును ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలంటూ ప్రజల్ని కోరనున్న కేంద్ర ప్రభుత్వం ► నల్లధనం దాచుకునేందుకు బ్యాంకు ఖాతాల్ని దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిక ► ప్రస్తుత నిబంధన ప్రకారం జన్‌ధన్ ఖాతాదారులు రూ.50 వేలు, సాధారణ ఖాతాల్లో రూ.2.50 లక్షల వరకూ జమ చేసుకోవచ్చు. ► ఒకవేళ ఖాతాను దుర్వినియోగం చేస్తే...విచారణలో అది రుజువైతే ఆ నగదుపై ఆదాయపు పన్నుతో పాటు పెనాల్టీ విధింపు నవంబర్ 17న (గురువారం) నగదు మార్పిడిపై పరిమితి ► వివాహ వేడుకలకు రూ.2.5 లక్షల నగదును విత్ డ్రా చేసుకోవచ్చు ► పంట రుణం కింద మంజూరైన, రైతుల అకౌంట్లకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి రూ.25,000ను రైతులు విత్‌డ్రా చేసుకోవచ్చు ► కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు ఇదే పరిమితి వర్తింపు ► రైతులంతా కేవైసీ వివరాలు అందించాలి ► ఆ అకౌంట్లు రైతు పేరు మీదనే ఉండాలి, రుణ పరిమితులకు లోబడి ఉండాలి. ► రుణ బీమా ప్రీమియం తేదీల గడువు 15 రోజులకు పెంపు ► నగదు మార్పిడి కింద ఒక్కవ్యక్తి రేపటి(నవంబర్ 18) నుంచి డ్రా చేసుకునే మొత్తం రూ.4500 నుంచి రూ.2000లకు కుదింపు ► ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లో రిజిస్టర్ అయిన వారు వారానికి రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు ► ఏటీఎంలో సాప్ట్ వేర్ మార్పుపై టాస్క్‌ఫోర్స్ ► కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు(అప్ టూ గ్రూప్ సీ... ఉద్యోగులు) అడ్వాన్స్ జీతం కింద రూ.10,000 నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం ► ప్రభుత్వం వద్ద అవసరమైనంత నగదు లభ్యత ఉంది, నగదు ఇబ్బంది లేదు నవంబర్ 15న (మంగళవారం) నిర్ణయాలు ► కరెన్సీ మార్పిడికి వచ్చే వారికి వేలిపై ఇంకు గుర్తు పెట్టాలని కేంద్రం నిర్ణయం ► జన్‌ధన్ యోజన ఖాతాల్లో డిపాజిట్ పరిధి రూ.50 మించకూడదని ఆదేశాలు జారీ ► ఈ వారాంతానికల్లా ఏటీఎంల నుంచి విత్ డ్రా పరిమితి రోజుకు రూ.4వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకున్న కేంద్రం ► సహకార బ్యాంకుల్లో పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ. ఇప్పటికే ఖాతాల్లో ఉన్న సొమ్ము విత్ డ్రాకు మాత్రమే అవకాశం నవంబర్ 14న (సోమవారం) నిర్ణయాలు ► ప్రభుత్వ ఆస్పత్రులు, పెట్రోలు బంకులతో పాటు రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు, ప్రజా రవాణా కోసం, పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో పా నోట్ల వాడకం గడువు ఈనెల 24 వరకు పొడిగింపు ► టోల్ చార్జీల వసూలు రద్దు నవంబర్ 18 అర్ధరాత్రి వరకూ పొడిగింపు ► ఏటీఎం లావాదేవీల చార్జీలు ఎత్తివేసిన బ్యాంకులు ► 'కరెంట్ ఖాతా'ల విత్ డ్రా పరిమితి వారానికి రూ.50వేలకు పెంపు. అయితే ఖాతా తెరచి మూడు నెలలు కావాలి. ► సహకార కేంద్రాలతో పాటు, కోర్టు ఫీజులు చెల్లించేందుకు పాత నోట్లు వాడకానికి ఓకే. ► నవంబర్ 21 వరకూ ఎయిర్‌పోర్టుల్లో పార్కింగ్ ఫీజు రద్దు చేస్తూ ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం ► దేశ వ్యాప్తంగా కొత్త నోట్ల విత్ డ్రా కోసం వందల కొద్దీ మైక్రో నగదు ఏటీఎంల్ని ఏర్పాటు చేస్తాం: ఆర్థికశాఖ ► గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే బ్యాంకింగ్ కరస్పాండెట్లు వద్ద నగదు నిల్వను రూ. 50 వేలకు కేంద్రం పెంచింది. రోజుకు ఎన్నిసార్లైన బ్యాంకుల నుంచి వారు నగదు పొందేందుకు అవకాశం కల్పించింది. ► కరెన్సీ మార్పిడి కోసం వయోవృద్ధులకు, దివ్యాంగులు ప్రత్యేక క్యూ ద్వారా నగదు మార్పిడి. ► పెన్షనర్లు ఏటా ప్రభుత్వానికి ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ గడువును వచ్చే ఏడాది జనవరి 15కు పెంచిన కేంద్రం నవంబర్ 13 ఆదివారం: విత్ డ్రా పరిమితి పెంపు ► బ్యాంకుల్లో నగదు విత్ డ్రా పరిమితి వారానికి రూ.20 వేల నుంచి రూ.24వేలకు పెంపు. ఖాతాదారుడు ఒకేరోజైనా లేదా వారంలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. ► నోట్ల మార్పిడిప పరమితి రూ.4000 నుంచి రూ.4500కు పెంపు ► రోజుకు రూ.10,000 విత్ డ్రా నిబంధన ఎత్తివేత ► ఏటీఎంల ద్వారా విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.2000 నుంచి రూ.2500కు పెంపు నవంబర్ 10న (గురువారం) నిర్ణయాలు ► ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం ► పాత నోట్లతో 11వ తేదీ రాత్రివరకూ విద్యుత్ బిల్లు చెల్లింపులు చేయవచ్చు: టీఎస్ఎస్పీడీసీఎల్ ► 860 పోస్టాపీసుల్లో కరెన్సీ మార్పిడికి 24వరకు అవకాశం: తెలంగాణ పోస్టల్ శాఖ ► పాత నోట్లతో ఆస్తిపన్ను, నల్లా, కరెంట్ బిల్లులు చెల్లింపులు: కేంద్రం ► కొత్త వెయ్యి రూపాయల నోట్లు తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్ణయం ► టికెట్ల రద్దు చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లించవద్దు: రైల్వేశాఖ నవంబర్ 9న (బుధవారం) నిర్ణయాలు: రూ.2.5 లక్షలు దాటితే కొరడా ► రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై పన్ను. గృహిణులు రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేసినా ఎలాంటి పన్ను ఉండదు. అయితే రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తేనే సమస్య ► రిటర్నుల్లో సమర్పించిన ఆదాయ వివరాలతో సరిపోలకపోతే 200 శాతం జరిమానా ► ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు. రైల్వేకౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు నవంబర్ 8న (మంగళవారం) నిర్ణయాలు ►ఆర్బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు ఎలాంటి పరిమితి లేకుండా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అకౌంట్లోకి సరైన ఆధారాలు చూపించి బదిలీ చేయవచ్చు. అయితే బ్యాంకుల్లోని కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫారాలను అసంపూర్తిగా నింపిన వారు కేవలం గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు ► కొద్ది రోజుల వరకు బ్యాంకుల నుంచి విత్ డ్రాయల్ పరిమితి రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేలుగా నిర్ణయించారు. నవంబర్ 24న సమీక్ష తర్వాత ఈ పరిమితిని పెంచనున్నారు ► ఏటీఎంల్లో విత్ డ్రాయల్ (నవంబర్ 18 వరకు) కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే. తర్వాత దీన్ని రూ.4 వేలకు పెంచనున్నారు ► నవంబర్ 24 వరకు ఐడీ ప్రూఫ్ చూపించి హెడ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో రోజుకు 500, 1000 నోట్లను రూ.4 వేల వరకు మార్చుకో వచ్చు. ఈ పరిమితిపై 15 రోజుల తర్వాత సమీక్షిస్తారు ► చెక్, డీడీ, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ ట్రాన్సఫర్ ద్వారా జరిగే లావాదేవీలపై ఆంక్షలు లేవు ► డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయలేని వారు మార్చి 31, 2017 వరకు ఆర్బీఐ కేంద్రాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి బదిలీ చేసుకోవచ్చు -
మున్సిపల్ కార్పొరేషన్‌కు పాతనోట్ల పంట
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దుతో పింప్రి మున్సిపల్ కార్పొరేషన్ దశ తిరిగింది. గత 13 రోజుల నుంచి ఈ కార్పొరేషన్ ఖజానాకు ఆస్తి పన్ను రూపంలో రూ.130 కోట్లు వచ్చి చేరాయి. కేంద్రం నోట్ల రద్దు ప్రకటించిన రెండు రోజులకే పింప్రీ మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) పన్ను చెల్లింపులో పాత నోట్లను అంగీకరిస్తామని ప్రకటించింది. ఇందుకోసం నగరవ్యాప్తంగా 15 కార్యాలయాలను ఏర్పాటు చేసి, 200 మంది సిబ్బందిని మోహరించింది. రెండు ప్రైైవేట్ బ్యాంక్‌లకు పన్ను వసూలు అధికారాన్ని కూడా కల్పించింది. దీంతో బుధవారం గడువు ముగిసేటప్పటికి రూ.130 కోట్ల నగదు పన్నుల రూపంలో జమ అయింది. ప్రజల స్పందన భారీగా ఉండటంతో ఈ డ్రైైవ్ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, పెండింగ్ పన్నులను బకాయి దారులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీతో చెల్లిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ చెల్లింపులపై దర్యాప్తు చేపట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. పీఎంసీ ఆస్తి పన్ను విభాగ అధికారి సుహాస్ మపారి మాట్లాడుతూ.. కేవలం 13 రోజుల్లో తాము రూ.130 కోట్లు నగదు రూపంలో పొందగా, చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో కలిపి రూ. 910 కోట్ల వరకు వచ్చాయని తెలిపారు. అయితే, ఐటీ విభాగం కోరిక మేరకు.. చెల్లింపుదారుల వివరాలన్నిటినీ వారికి అందించామని వెల్లడించారు. -
కర్షకుడికి కొత్త కష్టం
* రైతులకు ‘చిల్లర’ సమస్యలు * కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6.50 లక్షల ఎకరాల్లో వరిపైరు కోతలకు సిద్ధం * కూలీలకు చెల్లించేందుకు రూ.100 నోట్ల కోసం అవస్థలు * రబీ పంటలపైనా ప్రభావం సాక్షి, అమరావతి బ్యూరో : చిల్లర సమస్య అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి రైతులపై నోట్ల రద్దు ప్రకటన తీవ్ర ప్రభావం చూపింది. కోతలకాలం దగ్గర పడటంతో కూలీలకు రూ.100 నోట్లు సర్దుబాటు చేసేదెలా.. అని రైతులు తల పట్టుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 6.50 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 70 శాతం మేర వరి పైరు కోత దశకు వచ్చింది. మిగిలిన పైరు కూడా మరో వారం రోజుల్లో కోతకు వస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాలో ఉన్న డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించినా, కేవలం రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఎకరా పంట ఇంటికి చేరాలంటే కనీసం రూ.10వేలు వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే çకూలీలకు ఇచ్చేందుకు చిల్లర నోట్లు లేక, కోతలు కోసి, కట్టలు కట్టి, నూర్పిâýæ్లను పూర్తిచేసేదెలా.. అని రైతులు ఆందోâýæనకు గురవుతున్నారు. రబీ పంటలకూ నోట్ల కష్టాలు.. రబీ పంటల కోసం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే రైతులకూ నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాయితీ విత్తన కేంద్రాల్లోనూ రద్దయిన నోట్లను తీసుకోవడం లేదు. పైగా ఈ నెల 24వ తేదీ వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లందరూ రద్దయిన పాత నోట్లను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఎక్కడా అమలుకావడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్ఫెడ్లు మాత్రమే పెద్ద నోట్లు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో ఉందని ప్రయివేటు డీలర్లు చెబుతున్నారు. వారు రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా విత్తనాలు, ఎరువులు, విత్తనాల విక్రయాలు సైతం భారీగా పడిపోయాయి. రూ.650 కోట్లు అవసరం.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణంగా 4లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రెండు లక్షలు, గుంటూరులో 60వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. రెండు జిల్లాల్లో మొత్తం 6.50 లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరాకు రూ.10వేలు చొప్పున కూలీలకు చెల్లించాల్సి ఉన్నదందున, రెండు జిల్లాల్లోనూ రూ.650 కోట్ల విలువైన చిన్ననోట్లు అవసరం. ఈ మేరకు నగదు బ్యాంకుల్లో లేదు. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నప్పటికీ రూ.2వేల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రైతులు, కౌలు రైతులు చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నారు. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.100 నోట్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. -
నోట్ల రద్దు: నిబంధనలు-వెసులుబాటు
-
రూ.15 లక్షలు వేస్తామని చెప్పలేదు...
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సొంత ఖాతాలో రెండున్నర లక్షలు వేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నది కేవలం అపోహ మాత్రమే అని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆమె శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పలేదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయొచ్చని మాత్రమే ప్రధాని చెప్పారని పురందేశ్వరి వివరణ ఇచ్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులు అయినా జనాలు బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద డబ్బుల కోసం క్యూ కడుతున్నారు. -
ఉర్జిత్ పటేల్ సంతకమెలా వచ్చింది?
బెంగళూరు : పెద్ద నోట్లు రద్దు వల్ల దేశంలో ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ ఎంపీ, నటి రమ్య ఆరోపించారు. రమ్య నిన్న మీడియాతో మాట్లాడుతు. కేంద్ర ప్రభుత్వం రూ. 500,1000 నోట్లు రద్దు చేసే ముందు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదన్నారు. దాని వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రమ్య ఆరోపించారు. దేశంలో ఉన్న నల్లధనం బయటికి తీయడం అనేది చాల మంచి విషయమని, అయితే ఇలాంటి పెద్ద సమస్యలను సృష్టించే పనులు చేసే ముందు సామాన్య ప్రజలకు, పేదలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో కూలి పనులు చేసుకునే కార్మికులు పనులు మాని బ్యాంకుల ముందు రోజుల తరబడి క్యూలో ఉంటున్నారని ఇలా రోజుల చొప్పున వృథా అయితే వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుందని రమ్య ఆరోపించారు. నల్లధనం బయటికి తీయడానికి కేంద్రం గడిచిన 10 నెలల నుంచి ఈ పథకం అమలు చేయడానికి ప్రణాళిక సిద్దం చేసిందని అంటున్నారని, అయితే కొత్తగా ముద్రించిన నోట్ల పైన ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ సంతకం ఎలా వచ్చిందని, అది ఎలా సాధ్యమయిందని రమ్య అన్నారు. కేంద్రం ఇందులో కూడ రాజకీయం చేసిందని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ విషయం బయటికి రాక ముందు బీజేపీ ఖాతాకు పెద్ద ఎత్తున నగదు మార్పు చేయడం జరిగిందని రమ్య ఆరోపించారు. -
ఇంక్ గుర్తులను ఇలా చెరిపేయవచ్చు
-
ఇంక్ గుర్తులను ఇలా చెరిపేయవచ్చు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను నిషేధించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నోట్లు మార్చుకునే వ్యక్తులు ఒక్కసారి కాకుండా పదే పదే పలు బ్యాంకులు తిరుగుతూ పలుసార్లు నోట్లు మార్చుకుంటున్నారని తెలిసి కేంద్ర ఆర్థిక శాఖ ఎన్నికల్లో ఉపయోగించే ‘చెరగని సిరా’ మరకల విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెల్సిందే. బుధవారం కొన్ని బ్యాంకుల్లో ప్రారంభించిన ఈ విధానం గురువారం నాటికి దేశంలోని అన్ని బ్యాంకులకు విస్తరించింది. ఆ సిరాను ఎలా చెరపేసుకోవచ్చో అనుభవజ్ఞులే కాకుండా సామాన్యులకు కూడా బాగానే తెలుసనే విషయం మనకు తెల్సిందే. చేతి వేలుమీద సిరా మరక ఆరిపోయిన కొద్దిపేపటికి అగ్గిపుల్ల గంధకంతో గీకేసి సబ్బుతో చేతి వేలును శుభ్రం చేసుకోవడం చాలా పాపులర్ విధానం. కొంత మంది పలు టూత్ పేస్ట్‌లు, స్పిరిట్లు ఉపయోగించి కూడా ఈ మరకలను ఆనవాళ్లు లేకుండా పూర్తిగా కడిగేస్తారు. ఎన్నికల సిరా గుర్తును చెరిపేసుకొని ఒక్కొక్కరు రెండుసార్లు పార్టీకి ఓటు వేయమంటూ ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఒకప్పుడు పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సిరాను ఎలా చెరపేసుకోవచ్చో చూపించే పలు వీడియోలో యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. -
బకాయిలపై వివరణ ఇచ్చిన హీరో నాగార్జున
హైదరాబాద్ : బ్యాంకు రుణాలపై వచ్చిన ఆరోపణలను హీరో నాగార్జున ఖండించారు. బ్యాంకులకు తాము ఎలాంటి బకాయిలు లేమని ఆయన స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నమాట వాస్తవమేనని అన్నారు. అయితే ఆ రుణాలు అన్నీ ఈ ఏడాది మొదట్లోనే చెల్లించినట్లు నాగార్జున తెలిపారు. కాగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు తాను కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కానీ బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేమని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. It is true we took a loan frm banks to build new film facilities at annapurna studios earlier.ALL LOANS HAVE BEEN CLEARED EARLIER THIS YEAR.— Nagarjuna Akkineni (@iamnagarjuna) 17 November 2016For the few who may believe so neither me nor annapurna studios owe any money to any banks!!FYI— Nagarjuna Akkineni (@iamnagarjuna) 17 November 2016 -
నల్ల కుబేరుల జాబితా బయటపెట్టాలి: సురవరం
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గ్దూం భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశాల్లో ఉన్న నల్ల కుబేరుల జాబితాను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని నిత్యావసరాలకు ఇప్పుడున్న రూ.500,1000 నోట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సురవరం డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లో జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని ఆయన అన్నారు. కాగా రూ.500,1000నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. -
'కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
హైదరాబాద్ : తమ అవినీతి సొమ్ము, నల్లధనం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తున్నారని బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలన వల్లే దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ... అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే రూ.500, 1000 నోట్లను రద్దు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కేసీఆర్ పాలనా వైఫల్యమే కారణమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో 30 ఏళ్లు వెనక్కి పోతామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
పంచాయతీలకు కాసుల గలగల
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను అవస్థలు పెడుతున్నా... గ్రామ పంచాయతీల్లో మాత్రం పన్నుల వసూళ్లు పెరుగుతున్నాయి. పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నుల చెల్లింపునకు అవకాశం కల్పించడమే దీనికి కారణం. కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉన్నాయి. దాంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా పాతనోట్లతో పన్నులు, బకాయిలు చెల్లించేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించడంతో నాలుగు రోజులుగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఖజానా కళకళలాడుతోంది. పలు గ్రామాల్లో పాత బకాయిలతో పాటు వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లించా ల్సిన ఆస్తిపన్నును కూడా చెల్లిస్తుండడం గమనార్హం. ఇంతకుముందు ఇంటింటికీ తిరిగి పన్ను కట్టాలని అడిగినా వసూళ్లు జరిగేవి కావని, ఇప్పుడు పన్ను చెల్లించేం దుకు పాతనోట్లతో జనం బారులు తీరుతు న్నారని కొందరు గ్రామ పంచాయతీల సర్పంచులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాతనోట్లతో ఆస్తిపన్ను చెల్లించుకునే అవకా శాన్ని మారుమూల గ్రామాలు సైతం వినియోగించుకుంటున్నారని.. ముఖ్యంగా పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాల్లో ఆస్తి పన్నులు వంద శాతం వసూలయ్యే అవకాశం కనిపిస్తోందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ప్రత్యేక ఏర్పాట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రజలు ఆసక్తి చూపు తుండడాన్ని గమనించి పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో రోజువారీగా దండోరా వేయిం చడంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డుకో పన్ను వసూలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే పంచాయతీ సిబ్బందే ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేసి రసీదులు అందజేస్తున్నారు. మొత్తంగా గత 4 రోజుల్లో అనూహ్యంగా రూ.21 కోట్లకు పైగా పన్నులు వసూలు కావడం, పాత నోట్లతో పన్ను చెల్లింపునకు కేంద్రం మరింత గడువు ఇవ్వడంతో మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఆస్తిపన్ను వసూలుకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా చొరవ చూపడం, కొత్త జిల్లాల్లో డీపీవోలుగా నియమితులైన అధికారులు ప్రత్యేక శ్రద్ద కనబరచడంతో పంచాయతీలకు నిధుల కొరత తీరనుంది. పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌తో అదనపు నిధులు పాత బకాయిలతో పాటు ఈ ఏడాది వంద శాతం ఆస్తిపన్ను వసూలైన గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నుంచి పెర్ఫార్మెన్స్ గ్రాంటు రూపేణా అదనపు నిధులు అందనున్నాయి. కేంద్రం ఇచ్చే ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్‌లో 50 శాతం నిధులను గతేడాది కంటే ఐదుశాతం అధికంగా ఆస్తిపన్ను వసూలు చేసిన గ్రామ పంచాయ తీలకు, మరో 50 శాతం నిధులను ఈ ఏడాది వంద శాతం పన్నులు వసూలు చేసిన గ్రామ పంచాయతీలకు ఇవ్వనున్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి రూ.105 కోట్ల పెర్ఫార్మెన్స్ గ్రాంట్ లభించగా.. వచ్చే ఏడాది రూ.195 కోట్లను ఇవ్వనున్నారు. సాధారణంగా వచ్చే అభివృద్ధి నిధులకు తోడుగా మంచి పనితీరు కనబర్చిన గ్రామాలకు ఈ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఇస్తారు. దీంతో అభివృద్ధి పనులకు మరింత తోడ్పాటు లభిస్తుంది. -
'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకాయిలు చెల్లించ వచ్చన్న వెసులు బాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. జీహెచ్ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దయిన నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరు తుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకాయిలు వసూలవుతున్నాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీకి రూ.157 కోట్లు జీహెచ్ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.157 కోట్లు వసూలయ్యాయి. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూలైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్ఆర్ఎస్ కూడా చెల్లిస్తుండటం విశేషం. భారీగా వసూలైన విద్యుత్ చార్జీలు విద్యుత్ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యాయి. సెలవు దినమైనప్పటికీ విద్యుత్ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యాయి. కొందరు వినియోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. పెరిగిన బకాయిల చెల్లింపులు పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి మొండి బకాయిలు పెద్ద ఎత్తున వసూలవు తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగాయి. ట్రాఫిక్ ఈ-చెలానా చెల్లింపులు ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ–చలాన్లను కూడా వాహన దారులు రద్దయిన నోట్లతో క్లియర్ చేసుకొంటున్నారు. మీ–సేవ, ఈ–సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. -
'పెద్ద నోట్ల రద్దులో శాస్త్రీయత లేదు'
-
నోట్ల రద్దులో శాస్త్రీయత లేదంటూ భూమన నిరసన
తిరుపతి : పెద్ద నోట్ల రద్దుతో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు, చిన్ననోట్ల కొరతను నిరసిస్తూ ఆయన మంగళవారం తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేంద్రం సదుద్దేశంతో నిర్ణయం తీసుకున్నా... అందులో శాస్త్రీయత లేదని అన్నారు. ప్రజల ఇబ్బందులపై తాము స్పందించాల్సి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ జనాల ఊపిరి తీసేశారని భూమన వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం సామాన్యులు నడిరోడ్డుపై పడిగాపులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తిప్పలు గుర్తించకుండా ....తాను వదిలిన బాణం నల్లకుబేరుల గుండెల్లో దిగి వాళ్లు నిద్రపోవడం లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు వేసి గెలిపించినవారు ...నోట్ల కోసం వీధుల్లోకి వచ్చారని భూమన అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8న భారత జాతికి వెల్లడిస్తే...మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం మూడు నెలల ముందే సమాచారం అందిందని భూమన విమర్శించారు. సీఎం,ఆయన అనుయాయులు ఈ మూడు నెలల్లో ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల భూములను కొని, లక్షల కోట్ల రూపాయిల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీనికి సమాధానం ఎవరు చెబుతారని భూమన ప్రశ్నించారు. మరోవైపు భూమన నిరసన దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో భూమన అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న భూమనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. -
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: మేఘవాల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం నల్ల కుబేరులకు లాభం కలిగించేలా ఉందన్న విపక్షాల ఆరోపణలపై మేఘవాల్ స్పందిస్తూ.. అవినీతికి పాల్పడే బ్యూరోక్రాట్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందని ప్రశ్నించారు. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. కాగా నోట్ల రద్దుతో సామాన్యుడికి కష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో నోట్ల మార్పిడితో పాటు నగదు డ్రా చేసుకునేందుకు జనాలు తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే రా్తరి నుంచి ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రూ.500,1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
‘వాళ్లే నిద్రమాత్రలు వేసుకుంటున్నారు’
-
'నా చాయ్ అంత స్ట్రాంగ్‌గా నిర్ణయాలుంటాయ్'
ఘాజిపూర్: మాములుగానే మంచి మాటకారి అయిన ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన సభకు వచ్చిన ప్రజలను తన వాక్చాతుర్యంతో కట్టిపడేశారు. పంచ్ డైలాగ్‌లు విసరడంతో వారంతా సందడి చేశారు. సోమవారం బీజేపీ పరివర్తన ర్యాలీ సందర్భంగా మాట్లాడిన మోదీ తాను చాయ్ అమ్మిన రోజులు గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయాలు కూడా తన చాయ్ అంత స్ట్రాంగ్‌గా ఉంటాయని అన్నారు. ఈ మాట వినగానే సభ ముందు ఉన్నవారంతా మోదీ మోదీ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. 'నేను చిన్న పిల్లాడిలా ఉన్న రోజుల్లో చాయ్ మరింత్ స్ట్రాంగ్‌గా తయారు చేయమని కోరేవారు.. ఇప్పుడు నా నిర్ణయాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. నేను రైల్వే ఫ్లాట్ ఫాంలపై చాయ్‌లు అమ్మేవాడిని' అని మోదీ బహిరంగ సభలో చెప్పారు. రూ.2.5లక్షలు జమ చేసేవారిని అధికారులు ఏమీ అనబోరని, కానీ, 2.5కోట్లు ఉన్నవారిని మాత్రం వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వారు తమ మంచాల పరుపుల కింద దాచినా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అంతకుముందు దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని మోదీ అన్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయానికి సామాన్యులు సహకరిస్తుంటే.. నల్ల కుబేరులు మాత్రం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు: మోదీ
ఘజీపూర్: దేశం కోసం పోరాటం చేయడానికి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం ఉత్తరప్రదేశ్ ఘజీపూర్‌లో బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయాన్ని సామాన్యులు సహకరిస్తుంటే... నల్ల కుబేరులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అయితే నోట్ల రద్దుతో ఆదాయపన్ను ఎగ్గొట్టేవారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, అవినీతిపరులే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ ప్రధాని కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. బ్లాక్ మనీ విషయాన్ని హస్తం పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్న ఆయన కాంగ్రెస్ టెర్రరిస్టులకు మద్దతు పలుకుతుందా అని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు అంశాన్ని విపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. పేదల కష్టం గురించి వాళ్లందరి కంటే తనకే బాగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబ సభ్యులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ...దేశాన్ని జైల్లో పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు తర్వాత కొన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సమస్య వచ్చిందంటూ మోదీ ఎద్దేవా చేశారు. దేశంలో డబ్బుకు కొదవ లేదని, కాకపోతే ఉండాల్సిన చోటే డబ్బు లేదని అన్నారు. పేదల త్యాగం వృథా కానివ్వమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఓటు ద్వారానే మార్పు సాధ్యమని మోదీ ఉటంకించారు. తమది పేదల ప్రభుత్వమని ఆయన అన్నారు. అవినీతిపరులే నల్లధనం గురించి ఆందోళన చెందుతున్నారని, సామస్యుల ఇబ్బందులు తనకు తెలుసునని మోదీ పేర్కొన్నారు. సామాన్యుల పరిరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, దేశంలో అవినీతికి తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఓటు ద్వారా అవినీతి వద్దని చెప్పాలని ఆయన కోరారు. నల్లధనంపై యుద్ధనికి సహకరించాలన్నారు. తాను కేవలం 50రోజుల వ్యవధి మాత్రమే అడిగానని మోదీ తెలిపారు. -
‘బాబు, కేసీఆర్‌కు ముందస్తు సమాచారం’
హైదరాబాద్ : నల్లధనం వెలికితీతకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ముందస్తు ఆలోచన లేకుండా తొందరపాటుగా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రజల ఇబ్బందులను మోదీ సర్కార్ విస్మరిస్తున్నందునే తాము నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రధాని తన సన్నిహితులకు, అనుకూల సీఎంలకు, వ్యాపార సంస్థలకు ముందుగానే పెద్దనోట్ల రద్దును లీక్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు ముందస్తు సమచారంతో లబ్ది పొందారని ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలిగాక, మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. -
పొలిటికల్ బ్లాక్ మనీ స్కామ్: మమతా బెనర్జీ
-
పొలిటికల్ బ్లాక్ మనీ స్కామ్: మమతా బెనర్జీ
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్యూలో నిలబడి పాతనోట్లను మార్చుకుంటే...తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలు బ్యాంకులను సందర్శించారు. శనివారం ఆమె ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో పర్యటించి, తాజా పరిణామాలపై అక్కడి కస్టమర్లతో మాట్లాడారు. అనంతరం మమతా మాట్లాడుతూ... పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య అతిపెద్ద బ్లాక్ మనీ స్కామ్ గా ఆమె అభివర్ణించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇప్పటికీ విజ్ఞప్తి చేశామని, మరోసారి దీనిపై పునరాలోచించాలన్నారు. యువత నుంచి వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల రద్దుతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ.2000 నోటును నిత్యావసరాలకు ఏవిధంగా ఉపయోగిస్తారని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. నిజమైన నల్ల కుబేరులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలే కానీ, ప్రజలను ఇబ్బందులు పెట్టరాదని మమతా బెనర్జీ అన్నారు. అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని...అంతేకానీ సామన్యులను వేధించరాదని ఆమె సూచించారు. ఈ చర్య నల్ల రాజకీయ నిర్ణయం అంటూ కేంద్ర ప్రభుత్వంపై మమతా తన ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించారు. -
నోట్ల వెతల్లో స్ఫూర్తి కథలు కూడా..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లవని, అవి చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించడంతో మధ్యతరగతి, కార్మికుల కష్టాలు ప్రారంభమైన విషయం తెల్సిందే. చిన్న దుకాణాల నుంచి పెద్ద మాల్స్ వరకు, పాలు, కూరగాయల నుంచి పెట్రోలు బంకుల వరకు అటు నిషేధించిన నోట్లు తీసుకోవడానికి, ఇటు అరువు ఇవ్వడానికి నిరాకరించడంతో కన్నీళ్లు పెట్టుకున్న కార్మికుల కథలెన్నో వింటున్నాం. అదే సమయంలో తోటి వారి అవస్థను అర్థం చేసుకొని సహకరించిన స్ఫూర్తిదాయక కథలు కూడా ఉన్నాయి. ఉంటాయి. ఓలా డ్రైవర్ విపిన్ కుమార్ స్ఫూర్తిదాయకంగా వ్యవహరించిన కథ కూడా అలాంటిదే. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ విప్లవ్ ఆరోరా బుధవారం రాత్రి అర్జంట్‌గా ఊరెళ్లాల్సి వచ్చి రైల్వే స్టేషన్‌కు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. జేబులో అన్ని 500 రూపాయల నోట్లే ఉండడంతో కంగారు పడ్డారు. తన ఓలా అకౌంట్లో కొంత సొమ్మున్న విషయం గుర్తొచ్చి ఫర్వాలేదనుకున్నారు. తీరా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక బిల్లు చూస్తే ఓలా అకౌంట్లో ఉన్న దానికంటే చాలా ఎక్కువైంది. ఏం చేయాలో తోచక కంగారు పడ్డారు. ‘ఏం ఫర్వాలేదుసార్. ఓలా యాజమాన్యం నుంచి వచ్చే నా కమిషన్‌ను వదులుకుంటాను. ఈరోజు డబ్బులు తక్కువ సంపాదించానని సర్దుకుంటా. నాలాంటి బడుగు జీవికి డబ్బులు చాలకపోతే కష్టమే. మోదీ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్లన దేశంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వింటున్నాను. ఫర్వాలేదు, వారిలో నేనొకరిని. మోదీ మంచి నిర్ణయం తీసుకున్నందున నేను ఇబ్బంది పడ్డా ఫర్వాలేదు. దేశ సంక్షేమం కోసం నేను కొంత సాయం చేశానని తృప్తి పడతాను. మీరు ఎలాంటి ఫికర్ పెట్టుకోకుండా సుఖంగా జర్నీ చేయండిసార్!’ అని ఓలా క్యాబ్ డ్రైవర్ విపిన్ కుమార్, విప్లవ్ ఆరోరాతో హిందీలో వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని ఆరోరా ఓలా ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా ఎంతో మంది యూజర్లు దాన్ని షేర్ చేసుకొని కుమార్‌ను అభినందించారు. ఓలా యాజమాన్యం కూడా స్పందించి తమ ఓలా గ్రూప్‌లో కుమార్ లాంటి డ్రైవర్ ఉన్నందుకు గర్విస్తున్నామని, ఈ ట్రిప్పులో తాను కోల్పోయిన సొమ్మును అతనికే అందజేస్తామని అరోరాకు హామీ కూడా ఇచ్చింది. -
వాహనదారులకు మరో వెసులుబాటు
-
వాహనదారులకు మరో వెసులుబాటు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాహనదారులకు మరికొద్ది రోజులు వెసులుబాటు లభించింది. దేశవ్యాప్తంగా టోల్ ఫ్లాజాల వద్ద ట్యాక్స్ రద్దును కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈ వెలుసుబాటు నవంబర్ 14 అర్థరాత్రి వరకూ అమల్లో ఉంటుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి వెల్లడించారు. కాగా రూ.500, 1000 నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు టోల్ ఫ్లాజాల వద్ద చిల్లర సమస్యతో పాటు, పాత నోట్లు తీసుకునేందుకు అక్కడ సిబ్బంది నిరాకరించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దీంతో కేంద్రం టోల్ ట్యాక్స్‌ను మరో మూడు రోజులు పొడిగిస్తూ ప్రకటన చేసింది. తొలుత 11వ తేదీ అర్ధరాత్రి వరకు పన్ను వసూళ్లను నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ.. దేశవ్యాప్తంగా కొత్త నోట్లు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పాత నోట్ల వినియోగంపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ బిల్లులు, పన్నులు చెల్లించేందుకు గడువు పొడిగించింది. నవంబర్14 అర్ధరాత్రి వరకూ కేంద్రం ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. -
ఏటీఎంలు వద్దు పేటీఎంలు ముద్దు
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను నిషేధించడం దేశ ప్రజలకు ఎంతమేరకు కలిసొస్తుందో తెలియదుగానీ డిజిటల్ పేపెంట్స్, ఆన్లైన్ లేదా మొబైల్ వాలెట్స్ నవజాత కంపెనీలకు అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చింది. నరేంద్ర మోదీ బుధవారం చేసిన ప్రకటనతో మొబైల్ వాలెట్ కంపెనీ ‘పేటీఎం’ మార్కెట్లో దుమ్మురేపుతోంది. ఒక్కసారిగా పేటీఎం చెల్లింపులు 435 శాతం పెరిగాయి. దీనికి సంబంధించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య 200 శాతం పెరిగింది. కిరాణా, బ్రాండెడ్ రిటేల్ మాల్స్ సహా పాన్ షాపుల నుంచి పెట్రోలు బంక్‌ల వరకు చెల్లింపులు జరిపే ఈ కంపెనీకి దేశంలోని 1200 నగరాల పరిధిలోని 8,50,000 ప్రాంతాల నుంచి పేటీఎం సర్వీసులను వినియోగదారులు ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. స్వాతంత్య్ర భారత దేశం ఆర్థికరంగ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ ఉదాత్త నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతూ ఈ కంపెనీ పలు పత్రికల్లో ఫస్ట్ పేజీ ప్రకటనలు కూడా ఇచ్చింది. ‘మోదీ నిర్ణయం వెలువడినప్పటి నుంచి మా వినియోగదారులు ఊహించని విధంగా పెరిగిపోయారు. ఇప్పుడు మా కల నెరవేరడం ప్రారంభమైందని భావిస్తున్నాను. దేశంలోని నలుమూలలకు మా సర్వీసులను విస్తరించేందుకు రానున్న నెలల్లో మేమింతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన సమయం వచ్చింది’ అని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ మీడియాతో వ్యాఖ్యానించారు. ‘అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో’ అంటూ తమ వినియోగదారులకు పిలుపునిచ్చారు. అలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ‘ఫ్రీచార్జ్ వాలెట్’ వ్యాపారం దేశవ్యాప్తంగా మూడింతలు పెరిగింది. ప్రతి 500 రూపాయల వ్యాపారంపైనా యాభై రూపాయలు రాయితీని ఇస్తామంటూ కూడా తాజాగా ఆ కంపెనీ ప్రకటించింది. ‘ఇక క్యాష్ ఆన్ డెలవరి అనేది గతించిన అంశం. క్యాష్ స్థానాన్ని ఇక ఫ్రీచార్జ్ ఆక్రమిస్తుంది’ అని ఫ్రీచార్జి మాతృ కంపెనీ స్నాప్‌డీల్ సీఈవో, సహ వ్యవస్థాపకులు కునాల్ బహాల్ వ్యాఖ్యానించారు. మరో ఆన్లైన్ పేమెంట్ సంస్థ ‘మొబిక్విక్’ వ్యాపారం కూడా బుధవారం నుంచి ఇప్పటివరకు ఏడింతలు పెరిగింది. ‘దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు నరేంద్ర మోదీ దిమ్మతిరిగే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచంలోనే మన నల్లడబ్బు మాట వినిపించకుండా మోదీ జరిపిన సర్జికల్ స్రై్టక్స్ ఇవి. యాభై రోజుల కాలంలో దేశంలో కోటి మంది ప్రజల చెల్లింపుల విధానం మారిపోతుంది. మనమంతా నగదు ఆర్థిక వ్యవస్థ నుంచి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు ఇక దూసుకుపోతాం. ఈ చారిత్రక పరిణామ కాలంలో మేమూ భాగస్వాములం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. రేపటి నుంచి ఏటీఎంలకు పరుగెత్తాల్సిన అవసరం లేదని మొబిక్విక్ను ఉపయోగించండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో మరికొన్ని ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థల కలిగిన కంపెనీలు కూడ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లాభపడ్డాయి. దేశంలోని 120 నగరాల్లో వినియోగదారులు రీచార్జి చేసుకోవడంలో 1500 శాతం అభివృద్ధి సాధించామని దేశవ్యాప్తంగా టాక్సీలను నడిపే ఓలా కంపెనీ ఆన్లైన్ పేమెంట్ సంస్థ ‘ఓలామనీ’ ప్రకటించింది. తాము రీచార్జిలపై మరింత మనీ ఆఫర్లు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఊబర్ కంపెనీ కూడా ఓలా తరహాలో గణనీయంగా ప్రయోజనం పొందింది. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ వ్యాపార సంస్థలు మాత్రం ‘క్యాష్ ఆన్ డెలవరి’ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు, మొబైల్ వాలెట్ పేపెంట్ లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరించాల్సిందిగా పిలుపునిచ్చింది. -
18 వరకు రోజుకు 2 వేల రూపాయలే
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఏటీఎంలు పనిచేయడం ప్రారంభమైన నేపథ్యంలో డబ్బులు డ్రా చేయడంపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరోసారి వివరణ ఇచ్చింది. రూ. 500, 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 2000 రూపాయల నోట్లతో పాటు ఇతర డినామినేషన్ కలిగిన నోట్లను విస్తృతంగా పంపిణీ చేశామని ఆర్బీఐ పేర్కొంది. అయితే, ఒక్కో కార్డుపైన రోజుకు 2 వేలకు మించి విత్ డ్రా చేయడానికి వీలులేదని, ఈ నెల 18 వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని ఆర్బీఐ శుక్రవారం మరోసారి పేర్కొంది. ఈ నెల 18 వ తేదీ తర్వాత ప్రతి కార్డుపైనా రోజుకు 4 వేల వరకు డ్రా చేయొచ్చని తెలిపింది. ఇకపోతే రద్దు చేసిన రూ. 500, 1000 నోట్లను డిసెంబర్ 30 వ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని, ఈ విషయంలో ప్రజలు కొంత ఓపిక, సహనం పాటించాలని కోరింది. ఇకపోతే, ఖాతాదారులు బ్యాంకుల్లోని కౌంటర్ల వద్ద డబ్బు విత్ డ్రా చేసుకునే వారికి 10 వేల రూపాయలకు మించి తీసుకోవడానికి వీలులేదు. ఆ వారంలో మొత్తంగా విత్ డ్రా 20 వేలకు మించకుండా చూసుకోవాలి. నవంబర్ 24 వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని, ఆ తర్వాత ఈ అంశంపై మరోసారి సమీక్షించిన తర్వాత పరిమితి పెంచాలా వద్దా అన్న నిర్ణయం జరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. -
దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ....
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్థిక అత్యయిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లు, దుకాణాలు, మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, వైన్స్, బార్స్, బస్సులు బోసిపోగా బ్యాంకులు కిక్కిర్సిన జనంతో కిటకిటలాడుతున్నాయి. ఏటీఎం సెంటర్లు కొన్ని తెరవకపోగా తెరిచిన సెంటర్లు కూడా క్యాష్ అవుట్‌తో తెరవనట్లుగానే మూతపడి పోయాయి. ఇదేమిటని బ్యాంక్ మేనేజర్లను ఖాతాదారులు నిలదీయగా, బ్యాంక్ కౌంటర్ల ముందు పడిగాపులు గాస్తున్న కస్టమర్లకే సకాలంలో డబ్బులు చెల్లించలేక పోతున్నామని, ఇంకా ఏటీఎం గోడు వినే సమయం ఎక్కడదంటూ సమాధానం ఇస్తున్నారు. బ్యాంకుల్లో కూడా ఐదొందలు, వంద, అంతకన్నా తక్కువ నోట్ల నిల్వలు హారతి కర్పూరంలా కరగిపోగా నోట్లు మార్చుకునేందుకు వచ్చిన కస్టమర్ల చేతుల్లో రెండువేల రూపాయల నోట్లు పెడుతున్నారు. అసలే చిల్లర దొరక్క చస్తుంటే రెండువేల రూపాయల నోట్లను ఏం చేసుకోవాలని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజున కొత్త నోట్లతో సెల్ఫీలు దిగి కస్టమర్లు కాస్త సంతోషం వ్యక్తం చేయగా, రెండో రోజు నుంచి నోట్లు మార్చుకున్న కస్టమర్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పొద్దుటే టిఫిన్ తిని మధ్యాహ్నానికి లంచ్, రాత్రికి డిన్నర్ కట్టుకొని, వీలు అయితే చాపచుట్ట పట్టుకొని బ్యాంకుల వద్దకు వెళ్లాలంటూ సోషల్ మీడియాలో సూచనలు, సలహాలు వెల్లువెత్తుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొలం అమ్మిన సొమ్మును ఇంట్లో పెట్టుకొన్న ఓ అమ్మ ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకొందని, ఓ ముసలి అమ్మ తన దగ్గరున్న ఐదు వందల నోట్లు చెల్లవని తెలిసి గుండాగి చనిపోయిందని, ఆస్పత్రిలో ఏ ఎనిమిదేళ్ల పాప తండ్రి సకాలంలో మందులు కొనుక్కరాలేక పోవడం వల్ల మరణించిదనే వార్తలు దేశం నలుమూలల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏటీఎంల చుట్టూ తిరుగుతూ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా పర్యాటకులు పడుతున్న ఇబ్బంది అంతా, ఇంతా కాదు. చేతిలో నిషేధించిన నోట్లను మార్చుకోలేక లేదా మార్చుకునే సమయం లేక, అన్ని చోట్ల డెబిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులోలేక వారు ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్టికల్ స్ట్రైక్స్ అని తొలుత ప్రశంసించిన వారు కూడా టైమ్ అండ్ సెన్స్ లేని సర్జికల్ స్ట్రైక్స్ అని ఇప్పుడు బాధ పడుతున్నారు. -
హవాలా....హవాలా...నోట్ల హవాలా...
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం నాడు అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని ఆయన మద్దతుదారులు ‘సర్జికల్ స్రై్టక్స్’గా అభివర్ణించారు. చాలా మంది ప్రజలు అవును కాబోలు అనుకున్నారు. పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు సరైన లక్ష్యం, సరైన సమయంలో, సరైన రీతిలో జరిగిన దాడులే కావచ్చు. అనూహ్యంగా ఈ నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేయడంలో మాత్రం సరైన లక్ష్యం, సరైన సమయం, సరైన రీతి మూడు తప్పేనని రెండు రోజుల్లోనే తేలిపోయింది. ‘దో దిన్ రుక్ జాయే హవాలా రేట్స్ హాజాయింగే’ ఓ సీనియర్ జర్నలిస్ట్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యానం ఇప్పుడు నిజమవుతోంది. రేట్లు ఇప్పటికీ బయటకు రాలేదుగానీ హవాలా దళారులు మాత్రం బయటకు వచ్చారు. 20 శాతం కమిషన్‌పై నల్ల కుబేరులు బొక్కల్లో దాచిన బోషాణంలోనుంచి తీసిస్తే వాటిని ప్రభుత్వం కళ్లుగప్పి తెల్లబజారులోకి తేట తెల్లగా తెస్తామని చెబుతున్నారు. బ్యాంకుల్లో రెండున్నర లక్షలకు మించి నిషేధించిన నోట్లను డిపాజిన్ చేస్తే వారిపై నిఘా వేసి ఆ డబ్బు కూపీలు లాగుతామని, నల్లడబ్బని తెలిసినా, చూపిన సోర్స్‌కు టాలీ కాకపోయినా పన్నుతోపాటు రెండు వందల రెట్లు జరిమానా విధిస్తామని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ ఆదియా స్వయంగా ప్రకటించి హవాలా దందాకు తలుపులు బార్లా తెరిచారు. రెండున్నర లక్షలకు పైగా డిపాజిట్ చేసే ఖాతాదారుల వివరాలన్నింటిని పరిశీలించే శక్తి సామర్ధ్యాలు, తగిన సిబ్బంది ఆదాయం పన్ను శాఖకు ఉందా అన్న సందేహం తప్పకుండా వస్తోంది. రెండున్నర లక్షల డిపాజిట్‌దారుల జోలికి వెళ్లమని పరోక్షంగా ఆదిలోనే చెప్పగా, ఆ విషయాన్ని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ మరింత గట్టిగా ధ్రువీకరించారు. లక్షల సంగతి దేవుడెరుగు బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్‌కు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువలేని వారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. వారిలో వీలైనంత మందికి పదో, పరకో ఇచ్చి నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చేందుకు హవాలాదారులే కాకుండా బ్యాంక్ దళారులు కూడా కాచుకొని కూర్చున్నారు. ఎంత డబ్బయినా నిషేధించిన నోట్ల రూపంలో తీసుకుంటామని, బంగారం కొంటే చాలంటూ బంగారు షాపుల యజమానులు, వస్త్రవ్యాపారులు, జిమ్‌లు, సెలూన్లు, క్లబ్బులు సరికొత్త ఆఫర్లతో ముందుకు రావడం వెనకనున్న ఆంతర్యం ఏమిటో ప్రభుత్వానికి అవగాహన ఉందా? తులం బంగారాన్ని యాభై వేల రూపాయలకు అమ్ముతున్నారంటే నల్లడబ్బుకు తెల్లవన్నె తెచ్చే విద్య వారికేదో తెలిసే ఉంటుందికదా? నోట్ల నిషేధ నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే ఎలా తెల్సిందంటూ ప్రతిపక్షం ప్రశ్నించదంటే అర్థం ఏమిటీ? బడా బాబులు ముందే ఈ విషయాన్ని తెలుసుకొని ఈపాటికే నల్లడబ్బును సర్దేసుకొని ఉండరా, అచ్చం ఇలాంటి వారికోసమే మోదీ ప్రభుత్వం వెయ్యి నోటు స్థానంలో రెండు వేల నోటును తెచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన విమర్శల్లో నిజం లేదంటారా? దేశవ్యాప్తంగా బ్యాంకుల ముందు బారులు తీరిన జనాల్లో ఒక్క నల్ల కుబేరుడన్నా కనిపించారా? దొడ్డితోవ హవాలా మార్గాలు తలుపులు తెరచి ఉండగా వారెందుకు బ్యాంకుల వద్దకు వస్తారు? ఏదేమైనా మోదీ గారు అధికారికంగా యాభై రోజుల పాటు హవాలా మార్గాన్ని రాజమార్గం చేశారని పలు వర్గాల వారు విమర్శిస్తున్నారు. విదేశీ కరెన్సీనే అధికారుల కళ్లుగప్పి చేరాల్సిన చోటుకు చేర్చే హవాలాదారులకు దేశీయ నోట్లను మార్చడం పెద్ద కష్టమా? -
విచిత్రంగా నోట్లను రద్దు చేస్తారా?: ములాయం
లక్నో: రూ.500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను జైలుకు పంపకుండా ఎమర్జెన్సీ విధించడం అంటే ఇదేనని ఆయన గురువారమిక్కడ అన్నారు. పేదలను, మధ్య తరగతిని హింసించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ములాయం ధ్వజమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని, ప్రజలను ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోనివ్వాలని ఆయన సూచించారు. నల్లధనంపై రాంమనోహర్ లోహియా తర్వాత ఎవరైనా పోరాడుతున్నారంటే అది సమాజ్‌వాది పార్టీయేనని ములాయం అన్నారు. విదేశాల్లోని మొత్తం నల్లధనం వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నల్లధనం రాకుండా అడ్డుకోవాలన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకురాకుండా విచిత్రంగా నోట్లను రద్దు చేశారని ములాయం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ అర్ధరాత్రి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నల్లధనానికి తాము కూడా వ్యతిరేకులమని చెబుతూనే, ప్రజలను ఇలా ఇబ్బందులు పెట్టాల్సిన ఆగత్యం ఏమొచ్చిందని ఆయన ప్రశించారు. గతంలో విదేశాల నుండి నల్లధనం తీసుకొస్తామని బీజేపీ కోతలు కోసిందని ములాయం విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ములాయం స్పష్టం చేశారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నోట్ల రద్దు దేశంలో ఎమర్జెన్సీని తీసుకు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. -
నోటు పాట్లు
– నేటి నుంచి రూ.500, వెయ్యి నోట్లు చిత్తుకాగితాలే – ఈ నెల 11 వరకూ ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు, పెట్రోలు బంకుల్లో చెల్లుబాటు – నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసివేత – డిసెంబర్ ఆఖరు వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్లు మార్చుకునే అవకాశం – మంగళవారం రాత్రి నుంచే నోట్లు తీసుకునేందుకు నిరాకరించిన వ్యాపారులు – నేటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడనున్న సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏంటి? రూ. 500, రూ.వెయ్యి నోట్లు నేటి నుంచి చెల్లవని చెబుతున్నారనుకుంటున్నారా? అవునండి! నిజం! ఇది సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన! రూ.500, వెయ్యినోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటన టీవీల్లో వస్తుండగనే...వ్యాపారులు వినియోగదారుల నుంచి రూ.500, వెయ్యినోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. జేబులో వందనోట్లు లేకపోవడం, ఉన్ననోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరించడంతో 'అనంత' ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే శుక్రవారం వరకూ ఉన్ననోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు. దీంతో ఇంట్లో వంద నోట్లు లేకుండా కేవలం పెద్దనోట్లు మాత్రమే ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. కేంద్రం ప్రభుత్వం రూ.500, వెయ్యినోట్లు రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి 8.30గంటల నుంచే టీవీల్లో ప్రకటనలు వచ్చాయి. ఇది దావానలంలా నగరం మొత్తం వ్యాపించింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే వినియోగదారులు కొన్ని బేకరీలు, సూపర్మార్కెట్లలో రూ.500, వెయ్యినోట్లు ఇస్తే చెల్లవనే మాట చెప్పకుండా 'చిల్లర లేదు' అని సింపుల్‌గా తప్పించుకున్నారు. దీంతో మంగవారం రాత్రి నుంచే పెద్దనోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఎందుకు అందరూ ఇలా చెబుతున్నారో అర్థం కాక వినియోగదారులు తలలు పట్టుకున్నారు. చివరకు పక్కన ఉన్నవారు 'ఈరోజు రాత్రి నుంచి నోట్లు చెల్లవండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇలా అంటున్నారు' అని వివరించే ప్రయత్నం చేశారు. కొంతమంది వ్యాపారులతో వాదులాటకు దిగారు. కొన్ని దుకాణాలు ఎందుకొచ్చిన గొడవ అని మూసేశారు. దీంతో అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి గందరగోళం నెలకొంది. బ్యాంకుల మూసివేతతో ఇక్కట్లు: నెల ప్రారంభమై వారమే అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల జీతాలు వచ్చి ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగులకు కాస్త ఆలస్యంగా వేతనాలు ఇస్తారు. నెల ఆరంభం కావడంతో ఇంట్లోకి కావల్సిన కిరణా, పాలవారికి డబ్బులు, తదితర ఖర్చులు ఉంటాయి. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు బంద్ కావడంతో ఇంట్లో వందనోట్లు లేకపోతే రెండురోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే! పెద్దనోట్లు తీసుకుని చిల్లర ఇవ్వండని ఇరుగు, పొరుగును అడిగినా ఎవ్వరూ స్పందించి ఇచ్చే ప్రసక్తి ఉండదు. దీంతో ఇబ్బందులు పడక తప్పదు. పెట్రోలు బంకులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు, పాలకేంద్రాల్లో ఈ నెల 11 వరకూ పెద్దనోట్లు చెల్లుబాటు అవుతాయి. కానీ పెట్రోలు బంకులు, ఆస్పత్రుల్లో కూడా తీసుకోలేదు. దీంతో వాహనదారులు, రోగులు మరింత ఇబ్బందులు పడ్డారు. సామాన్య, మధ్యతరగతి కుటంబాల్లో కల్లోలం రూ.500, వెయ్యినోట్ల రద్దు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఆస్తులు కొనేందుకు, పిల్లల వివాహాల కోసం నెలనెలా వచ్చే జీతాల్లో తినీతినక, పొదుపుగా సంసారం చేసుకుంటూ డబ్బులు దాచుకున్నారు చాలామంది ఉన్నారు. ఇలా రూ.5లక్షల నుంచి 15 లక్షలు 20లక్షల వరకూ దాచుకున్నవారు ఇప్పుడు నోట్లు చెల్లుబాటు కావంటే, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలి. అంత మొత్తం మార్చుకోవాలంటే ఆదాయమార్గాలు చూపించాలి. ప్రతి నెలా దాచామంటే బ్యాంకులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు భారీగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ దెబ్బ మధ్యతరగతి కుటుంబాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. డిపాజిట్ సెంటర్లు కిటకిట: అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి నోట్లు చెల్లవనే ప్రకటనతో రెండు గంటల్లోనే డిపాజిట్ చేయాలనే ఆతృతతో పలువురు డిపాజిట్సెంటర్లకు చేరుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది. ఒకరికొకరు వాదనలకు దిగారు. నోట్ల ప్రకటనతో పెద్దనోట్లు భారీగా నిల్వ ఉన్నవారంతా నిద్రలే కుండా మంగళవారం గడిపారు. -
రూ.500కే స్మార్ట్ ఫోన్
నోయిడా: పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారు. వేలకు వేలు పోసి ఫోన్ కొంటే.. జేబుదొంగల బారిన పడటం లేదా రెండు మూడేళ్లకే ఫోన్ ఏదో ఒకలా పాడైపోవడం లాంటివి చాలా చోట్ల చూస్తాం. మళ్లీ అంత డబ్బు పోసి కొనలేక.. స్మార్ట్‌ఫోన్‌ను వదలలేక నానా ఇబ్బందులు పడతారు. అలాంటివాళ్ల కోసం త్వరలో రూ.500కే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ ఉత్పత్తిదారు 'రింగింగ్ బెల్స్' అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 'ఫ్రీడమ్ 251' పేరుతో రూపొందిన ఈ ఫోనును రక్షణమంత్రి మనోహర్ పారికర్ బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయట. ప్రధాని నరేంద్రమోదీ ఆశయాలకు అనుగుణంగా భారత్‌లోని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండేలా అతి తక్కువధరకే స్మార్ట్ ఫోన్‌ను రూపొందించామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రింగింగ్ బెల్స్ గత ఏడాది రూ.2,999కే అత్యంత చౌకైన 4జీ ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం లాంచ్ చేయనున్న 'ఫ్రీడమ్ 251' మోడల్ ప్రత్యేకతలకు సంబంధించి సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. -
కరెన్సీ నోట్ల మార్పిడికి.. పది రోజులే గడువు
ముంబయి : కరెన్సీ నోట్ల మార్పిడికి సమయం దగ్గర పడింది. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఇక పది రోజుల గడువు ఉంది. రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లు సహా ఇతర నోట్లను మార్చుకునేందుకు భారత రిజర్వు బ్యాంకు జనవరి 1వ తేదీ 2015ను తుది గడువుగా విధించింది. 2005 కంటే ముందున్న కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాల్సిందిగా రిజర్వు బ్యాంకు ఈ ఏడాది జనవరి 22న ప్రజలను కోరింది. దీంతో ఇప్పటివరకు 144.66 కోట్ల కరెన్సీని ప్రజలు మార్చుకున్నారు. 2005కు ముందు తయారైన కరెన్సీ నోట్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2005 కంటే ముందున్న నోట్ల వెనుక వైపు సంవత్సరం ముద్రించి ఉండదు. 2005 తర్వాత ముద్రించిన కరెన్సీ నోట్లపై వెనుకవైపు భాగాన సంవత్సరం ముద్రించి ఉంటుంది.