రూ.15 లక్షలు వేస్తామని చెప్పలేదు...
విజయవాడ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సొంత ఖాతాలో రెండున్నర లక్షలు వేసుకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నది కేవలం అపోహ మాత్రమే అని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఆమె శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పలేదన్నారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేయొచ‍్చని మాత్రమే ప్రధాని చెప్పారని పురందేశ్వరి వివరణ ఇచ్చారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులు అయినా జనాలు బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద డబ్బుల కోసం క్యూ కడుతున్నారు.