నల్ల కుబేరుల జాబితా బయటపెట్టాలి: సురవరం
Published Tue, Nov 15 2016 2:17 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన గ్దూం భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. విదేశాల్లో ఉన్న నల్ల కుబేరుల జాబితాను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని నిత్యావసరాలకు ఇప్పుడున్న రూ.500,1000 నోట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సురవరం డిమాండ్ చేశారు. సెప్టెంబర్లో జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని ఆయన అన్నారు. కాగా రూ.500,1000నోట్లను కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement