కర్షకుడికి కొత్త కష్టం | New struggle to farmer | Sakshi
Sakshi News home page

కర్షకుడికి కొత్త కష్టం

Published Tue, Nov 22 2016 5:49 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కర్షకుడికి కొత్త కష్టం - Sakshi

కర్షకుడికి కొత్త కష్టం

* రైతులకు ‘చిల్లర’ సమస్యలు  
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 6.50 లక్షల ఎకరాల్లో వరిపైరు కోతలకు సిద్ధం 
కూలీలకు చెల్లించేందుకు రూ.100 నోట్ల కోసం అవస్థలు
రబీ పంటలపైనా ప్రభావం
 
సాక్షి, అమరావతి బ్యూరో : చిల్లర సమస్య అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి రైతులపై నోట్ల రద్దు ప్రకటన తీవ్ర ప్రభావం చూపింది. కోతలకాలం దగ్గర పడటంతో కూలీలకు రూ.100 నోట్లు సర్దుబాటు చేసేదెలా.. అని రైతులు తల పట్టుకుంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 6.50 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 70 శాతం మేర వరి పైరు కోత దశకు వచ్చింది. మిగిలిన పైరు కూడా మరో వారం రోజుల్లో కోతకు వస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాలో ఉన్న డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించినా, కేవలం రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారు. అయితే ఎకరా పంట ఇంటికి చేరాలంటే కనీసం రూ.10వేలు వరకు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలోనే çకూలీలకు ఇచ్చేందుకు చిల్లర నోట్లు లేక, కోతలు కోసి, కట్టలు కట్టి, నూర్పిâýæ్లను పూర్తిచేసేదెలా.. అని రైతులు ఆందోâýæనకు గురవుతున్నారు.
 
రబీ పంటలకూ నోట్ల కష్టాలు..
రబీ పంటల కోసం విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే రైతులకూ నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాయితీ విత్తన కేంద్రాల్లోనూ రద్దయిన నోట్లను తీసుకోవడం లేదు. పైగా ఈ నెల 24వ తేదీ వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లందరూ రద్దయిన పాత నోట్లను తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా.. ఎక్కడా అమలుకావడం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏపీ ఆయిల్‌ ఫెడ్, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్‌ఫెడ్‌లు మాత్రమే పెద్ద నోట్లు తీసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో ఉందని ప్రయివేటు డీలర్లు చెబుతున్నారు. వారు రూ.500, రూ.1,000 నోట్లు తీసుకోవడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితంగా విత్తనాలు, ఎరువులు, విత్తనాల విక్రయాలు సైతం భారీగా పడిపోయాయి.
 
రూ.650 కోట్లు అవసరం..
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణంగా 4లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేస్తారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రెండు లక్షలు, గుంటూరులో 60వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగు చేశారు. రెండు జిల్లాల్లో మొత్తం 6.50 లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరాకు రూ.10వేలు చొప్పున కూలీలకు చెల్లించాల్సి ఉన్నదందున, రెండు జిల్లాల్లోనూ రూ.650 కోట్ల విలువైన చిన్ననోట్లు అవసరం. ఈ మేరకు నగదు బ్యాంకుల్లో లేదు. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నప్పటికీ రూ.2వేల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో రైతులు, కౌలు రైతులు చిల్లర కోసం నానా అవస్థలు పడుతున్నారు. తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.100 నోట్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement