‘బాబు, కేసీఆర్కు ముందస్తు సమాచారం’
‘బాబు, కేసీఆర్కు ముందస్తు సమాచారం’
Published Mon, Nov 14 2016 11:53 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
హైదరాబాద్ : నల్లధనం వెలికితీతకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ముందస్తు ఆలోచన లేకుండా తొందరపాటుగా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రజల ఇబ్బందులను మోదీ సర్కార్ విస్మరిస్తున్నందునే తాము నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రధాని తన సన్నిహితులకు, అనుకూల సీఎంలకు, వ్యాపార సంస్థలకు ముందుగానే పెద్దనోట్ల రద్దును లీక్ చేశారని ఉత‍్తమ్ ఆరోపించారు.
దీంతో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్లు ముందస్తు సమచారంతో లబ్ది పొందారని ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల ఇబ్బందులు తొలిగాక, మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు.
Advertisement
Advertisement