సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి న మోదీ, ప్రధాని అయిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న కేసీఆర్, నాలుగున్నరేళ్లలో 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. నిరుద్యోగ యువతను మోసం చేసిన మోదీ, కేసీఆర్‌లను గద్దె దించాలి’అని ఏఐసీసీ కార్యదర్శి, యువజన కాంగ్రెస్ ఆలిండియా పర్యవేక్షకుడు కృష్ణాజీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
లక్ష ఉద్యోగాల సాధనకు యువజన కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర మంగళవారం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో వారు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేస్తుందని, అధికారంలోకి వచ్చాక చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని కృష్ణాజీ అన్నా రు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పుడు కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఉత్తమ్ విమర్శించారు.
కేసీఆర్‌తో సహా ఆ కుటుంబంలోని ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. రాష్ట్రవ్యాప్తం గా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయ డంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డిలను ఇంటికి పంపేందుకు నిరుద్యోగ యువత సన్నద్ధమయ్యింద న్నారు. సూర్యాపేట కలెక్టరేట్ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment