బకాయిలపై వివరణ ఇచ్చిన హీరో నాగార్జున | Hero nagarjuna gives clarity on bank loans | Sakshi
Sakshi News home page

బకాయిలపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున

Published Thu, Nov 17 2016 1:32 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

బకాయిలపై వివరణ ఇచ్చిన హీరో నాగార్జున - Sakshi

బకాయిలపై వివరణ ఇచ్చిన హీరో నాగార్జున

హైదరాబాద్ : బ్యాంకు రుణాలపై వచ్చిన ఆరోపణలను హీరో నాగార్జున ఖండించారు. బ్యాంకులకు తాము ఎలాంటి బకాయిలు లేమని ఆయన స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నమాట వాస్తవమేనని అన్నారు.
 
అయితే ఆ రుణాలు అన్నీ ఈ ఏడాది మొదట్లోనే చెల్లించినట్లు నాగార్జున తెలిపారు. కాగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లు తాను కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో కానీ బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేమని అన్నారు. ఈ మేరకు ఆయన  గురువారం ట్విట‍్టర్ లో వివరణ ఇచ్చారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement