బెంగళూరు: డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు అధి్కారుల అక్రమాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంకు సీనియర్ ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాల్సిన ఆర్‌బీఐ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగదు మార్పిడి చేస్తున్న మరో ఇద్దరు ఆర్ బీఐ సిబ్బందిని సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆర్‌బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నైకా కాగా, మరొకరు స్పెషల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్‌మెంట్ ఏకే కేవిన్ అని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.1.99 కోట్ల పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపనలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
కాగా అక్రమ నోట్ల మార్పిడి కేసులో బెంగళూరు ఇది రెండవ కేసు. డిసెంబర్13 బెంగళూరులో ఆర్‌బీఐ అధికారి(రూ.1. 51కోట్లు)మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆగని ఆర్బీఐ అధికారుల అక్రమాలు
Published Sat, Dec 17 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
Advertisement