CBI arrests
-
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు బెంగాల్ మంత్రుల అరెస్ట్
కోల్‌కతా: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్లో అరెస్టుల పర్వం సోమవారం మొదలైంది. ఈ కేసులో టీఎంసీ నేతృత్వంలోని బెంగాల్ సర్కార్‌లో మంత్రులుగా ఉన్న ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టుచేశారు. మరో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, రాష్ట్ర మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలనూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. రోజంతా హైడ్రామా నడిచింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అరెస్టుల విషయం తెల్సి మమత వెంటనే సీబీఐ ఆఫీస్‌కు వచ్చి దాదాపు ఆరుగంటలపాటు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. మరోవైపు, ఈ నలుగురికీ బెయిల్ మంజూరుచేస్తూ స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం సోమవారం రాత్రి హైకోర్టు వీరి బెయిల్‌పై స్టే ఇచ్చింది. అరెస్టులను నిరసిస్తూ టీఎంసీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలను గాలికొదిలేసి నిరసన చేపట్టారు. అరెస్టులు చట్టవిరుద్ధం: స్పీకర్ ‘ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలంటే ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌గా నాకు ముందే సమాచారమివ్వాలి. అలాంటి లేఖలు ఏవీ నాకు సీబీఐ నుంచి రాలేదు. ఇలా స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యేల అరెస్ట్ చట్టవిరుద్ధం’ అని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే, ఈ నలుగురు నేతల అరెస్టుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ గతంలో అనుమతులు ఇవ్వడం గమనార్హం. నన్నూ అరెస్ట్ చేయండి: మమతా బెనర్జీ అరెస్టుల విషయం తెల్సుకున్న టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెంటనే కోల్‌కతాలో సీబీఐ కార్యాలయం ఉన్న ‘నిజాం ప్యాలెస్’ భవంతికి వచ్చి ధర్నా చేపట్టారు. అరెస్టులపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘సీబీఐ ఆఫీస్ నుంచి వెళ్లేదేలేదు. కావాలంటే నన్నూ అరెస్టు చేయండి’ అని అక్కడ ఉన్న సీబీఐ సిబ్బందితో మమత ఆగ్రహంగా అన్నారు. అరెస్టు చేశాక ఆ నలుగురు నేతలను సీబీఐ అధికారులు బిల్డింగ్‌లోని 15వ అంతస్తులోని ఒక రూమ్‌కు తీసుకెళ్లారు. మమత ఆ రూమ్ బయటే నిరసన తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు ఆమె సీబీఐ కార్యాలయంలోనే ఉండి నిరసన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని జీర్ణించుకోలేకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐని అడ్డుపెట్టుకొని వేధింపులకు దిగుతోందని తృణమూల్ ఆరోపించింది. -
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం కుమారుడు అరెస్ట్
-
చిదంబరానికి బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పి.చిందంబరానికి బ్యాడ్ న్యూస్.. ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుంది. చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మారిషస్‌నుంచి పెట్టుబడులనుఅందుకునే విషయంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఐఎన్ఎక్స్ మీడియా ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అలాగే ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఎన్ఐఆర్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
ఆగని ఆర్బీఐ అధికారుల అక్రమాలు
బెంగళూరు: డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు అధి్కారుల అక్రమాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంకు సీనియర్ ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాల్సిన ఆర్బీఐ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగదు మార్పిడి చేస్తున్న మరో ఇద్దరు ఆర్ బీఐ సిబ్బందిని సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నైకా కాగా, మరొకరు స్పెషల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్మెంట్ ఏకే కేవిన్ అని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.1.99 కోట్ల పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపనలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా అక్రమ నోట్ల మార్పిడి కేసులో బెంగళూరు ఇది రెండవ కేసు. డిసెంబర్13 బెంగళూరులో ఆర్బీఐ అధికారి(రూ.1. 51కోట్లు)మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
అగస్టాలో ఆమ్యామ్యాలు
-
'పోర్న్' సూత్రధారి అరెస్టు
అతను ఉన్నత కుటుంబంలో పుట్టాడు. పేరు కౌశిక్ కునార్. జల్సాలు, విదేశాల్లో చదువులకు కావాల్సినంత డబ్బుంది. ప్రఖ్యాత కాలేజీ నుంచి సాధించిన డిగ్రీ కూడా ఉంది. కానీ బుద్ధి మాత్రం వంకర దారి పట్టింది. దేశంలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న 'పోర్న్' వీడియో స్కాండల్‌లో ప్రధాన నిందితుడైన అతడిని గురువారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అశ్లీల వీడియోలను భారీ ఎత్తున ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేస్తూ.. పెద్దమొత్తంలో సొమ్ము చేసుకున్నాడని, అరెస్టు సమయంలో అతడి వద్ద దొరికిన వస్తువుల్పి చూసి నివ్వెరపోయామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. 'అశ్లీల వీడియోల్ని చిత్రీకరించేందుకు స్టెల్త్ కెమెరాలు, వాటిని ఎడిట్ చేసేందుకు హై ఎండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్.. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో దురాగతాల్ని రికార్డు చేసి నెట్లో అప్లోడ్ చేసేవాడని, దాదాపు 500కు పైగా అశ్లీల వీడియోల్ని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిపై ఐటీ యాక్ట్ తో పాటు లైంగికదాడి కోణంలోనూ కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు చెప్పారు. వీడియోలు ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో చిత్రీకరించారో తెలుసుకోవడం కష్టంగా మారడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫోరెన్సిక్ సాఫ్ట్ వేర్ సహాయంతో వీడియోస్ అప్ లోడ్ చేసేవాళ్ల కోసం వేటాడాం. ఆ క్రమంలోనే కౌశిక్ కునార్ దొరికిపోయాడని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. మహిళలను తీవ్రంగా హింసించి, ఆపై అత్యాచారం జరిపి, ఆ దృశ్యాల్ని ఇంటర్ నెట్ లోకి పంపుతున్న ఉదంతాలపై హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తూకు లేఖ రాసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అనంతరం అశ్లీల వీడియోలపై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. -
తృణమూల్‌కు సృంజయ్ బోస్ రాజీనామా
బెయిల్‌పై విడుదలైన మర్నాడే.. ఎంపీ పదవికి రాజీనామా కోల్‌కతా: శారదా కుంభకోణం అంశం తృణమూల్ కాంగ్రెస్‌ను ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ పార్టీకి, ఎంపీ పదవికి గురువారం రాజీనామా చేశారు. పశ్చిమబెంగాల్‌ను కుదిపేసిన శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ఆ పార్టీ ఎంపీ సృంజయ్బోస్ 75 రోజులుగా జైల్లో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలయ్యారు.. గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘రాజకీయాలు నా చేతిలో టీ కాదని ఇన్ని రోజులుగా జైల్లో ఉన్న సమయంలో నాకు అర్థమైంది. నా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి బోస్పై విపరీతమైన ఒత్తిడి ఉందని టీఎంసీనేత ఓబ్రియాన్ వ్యాఖ్యానించారు. కాగా, పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి లోకేత్ చటర్జీ గురువారం తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ‘శారదా’పై పర్యవేక్షణకు సుప్రీం నో!: మరోవైపు శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించి సీబీఐ ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానీ బెంగాల్ ప్రభుత్వం పేర్కొనలేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సి.నాగప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. -
శారద స్కాంలో టీఎంసీ మాజీ నేత అరెస్ట్
కొల్కత్తా: శారద చిట్ స్కాం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఖాన్‌ను కొల్‌కత్తాలో బిదాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శారద చిట్ స్కాం కేసులో టీఎంసీకి చెందిన బడా నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం అసీఫ్ ఖాన్‌కు తెలిసి ఉండవచ్చని సీబీఐ భావిస్తుంది. ఆ క్రమంలో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో కూడా ఈ కేసులో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే శారద స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్ర ఉందంటూ మీడియా కథనాలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఓ సభలో ఘాటుగా స్పందించారు. ఓ మీడియా వర్గం తమ పార్టీ వారిని దొంగలుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీల నుంచి తమ పార్టీ నాయకులు ఎవరు ఒక్కపైసా కూడా తీసుకోలేదని మమతా స్పష్టం చేశారు.